అన్నీ ఉన్నా నేత చీరెలు ధరించిన ధీర
గాంధీ పిలుపుతో సత్యాగ్రహ ఉద్యమంలోకి...
సంవత్సరం పాటు జైలు జీవితం
తండ్రి వెంట కాంగ్రెస్ సమావేశాలకు హాజరు
మోతీలాల్ నెహ్రూ కుమార్తెగా, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సోదరిగా ప్రజలందరికీ చిరపరిచితమైన విజయలక్ష్మి పండిట్ ఝాన్సీలక్ష్మి బారుు, సరోజిని స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో బ్రిటీష్ పాలకులపై పోరాడారు. పలుసార్లు జైలుకు వెళ్లారు. భారత ప్రతినిధిగా పలు దేశాల్లో జరిగిన సదస్సులకు హాజరయ్యారు. భారత తొలి మంత్రిగా ఘనత వహించారు. ఆమె చూపిన పోరాట పటిమ నేటికీ స్ఫూర్తిదాయకం. రేపు విజయలక్షి్ష్మ జయంతి సందర్భంగా పలు విశేషాలు...
విజయలక్ష్మి పండిట్ సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసింది. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్‌ను వివాహమాడింది. అప్పటి నుంచి విజయలక్ష్మి పండిట్‌గా పేరు మార్చుకున్నారు.భారత స్వాతంత్య్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ సైతం అనుభవించిన వీరవనితల్లో విజయలక్ష్మి పండిట్ ఒకరు. నెహ్రూ వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే విజయలక్షి్ష్మ జన్మించింది. మోతీలాల్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఇంటికి వస్తుండేవారు.
స్వరూపరాణికి చిన్నతనం నుంచే కాంగ్రెస్ నాయకులందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. 1915వ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు బొంబాయిలో జరిగాయి. మోతీలాల్‌తో పాటు స్వరూప కుమారి సమావేశాలకు హాజరయింది. స్వరూప కుమారికి కవిత్వమంటే మంచి ఆశక్తి. ఎక్కువ కాలం తోటలో కూర్చుని సాయంకాల సమయాల్లో సోదరితో కవిత్వ ప్రసంగాలతో కాలం వెళ్లబుచ్చేవారు.
దండిలో ప్రారంభం అయిన ఉప్పు సత్యాగ్రహంలో విజయలక్ష్మి పాల్గొని విరివిగా ఉపన్యాసాలిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఉత్తరాలు, ఊరేగింపులు జరిపి ఉద్యమానికి నాయకత్వం వహించింది. సహాయనిరాకరణ ఉద్యమంలోనూ పాలుపంచుకుంది. విజయలక్ష్మి పండిట్ కాన్పూర్ చిల్‌హర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థిపైన వెయ్యి ఓట్ల మెజారిటీతో నెగ్గిందామె. సంయుక్త రాష్ట్ర ప్రధాని గోవింద వల్లభ పంత్ అయ్యాడు.
విజయలక్ష్మి పండిట్ తొలిసారిగా మంత్రిగా పదవీ స్వీకారం చేసి స్థానిక స్వపరిపాలనా బాధ్యత చేపట్టింది. 1937 జూలై 28 న ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. 1938-39 సంవత్సరాలకు ఒక ప్రణాళిక తయారు చేసి, మూడు వందల ఆసుపత్రులను వివిధ రకాల వైద్య విధానాలతో స్థాపించింది. బాటసారులకూ, గ్రామీణులకూ నీరులేక బాధపడే ప్రాంతాలలో ఎన్నో బావులు తవ్వించింది. వయోజన విద్య పాఠశాలను నెలకొల్పింది. 1939 ఆగ్రా లోని స్ర్తీ వైద్య కళాశాలను, శిశు పోషణ కారణంగా మార్పించింది. తన నియోజక వర్గంలో విపరీతంగా ఉన్న మలేరియాను అరికట్టేందుకు ఆమె ఎంతగానో పాటుపడింది.తన ఆహ్వానాన్ని ఇందిర అంగీకరించకపోతే విజయలక్ష్మి పండిట్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని శాస్ర్తి భావించాట. అయితే నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని మేనత్త విజయలక్ష్మి పండిట్ ఎక్కడ తన్నుకుపోతుందోనన్న భయాందోళనే ఇందిరను కేంద్ర మంత్రిని అంగీకరించాట.
విజయలక్ష్మి పండిట్‌కు సభలూ, సమావేశాల్లోనూ పాల్గొనకూడదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఒక రోజు అలహాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో స్వరూపరాణి ఉపన్యసిస్తుంటే ప్రభుత్వం లాఠీచార్జీ, అరెస్టులు జరిపించింది. మరుసటి రోజు ఆనందభవన్ వద్ద ఆమెను అరెస్టు చేశారు. దేశం కోసం జైలుకు వెళ్లడం చాలా ఘనతగా భావించారామె. సంవత్సరం జైలు శిక్షను లక్నోలోఅనుభవించారు. పూణెలో ఉన్న సమయంలో యార్యాడ జైలులో ఉన్న గాంధీజీని అనేక సార్లు చూశారామె.
విజయలక్ష్మి పండిట్
జన్మ నామం : స్వరూప కుమారి
జననం : 1900, ఆగష్టు 18
ప్రాంతం : ఢిల్లీ
స్వస్థలం : అలహాబాద్
మరణం : 1990, డిసెంబర్ 1
నివాసం : అలహాబాద్
ఇతర పేర్లు : విజయలక్ష్మి పండిట్
వృత్తి : రాజకీయ నాయకురాలు
మహారాష్ట్ర గవర్నర్
యు.ఎస్.ఎ.రాయబారి
సోవియట్ యూనియన్ రాయబారి
మెక్సికో రాయబారి
స్పెయిన్ రాయబారి
ఐర్లండ్ రాయబారి
యునైటెడ్ కింగ్‌డం హై కమీషనర్
మొదటి మహిళా మంత్రి
రాజకీయ పార్టీ : భారత జాతీయ కాంగ్రెస్
భార్య/భర్త : రంజిత్ సీతారామ్ పండిట్
సంతానం : చంద్రలేఖ, నయనతార, రీటా
తండ్రి : మోతీలాల్ నెహ్రూ
తల్లి : స్వరూపరాణి నెహ్రూ
మూలం : సూర్య దినపత్రిక