1988లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
దేశ, అంతర్జాతీయంగా పాపులారిటీ తెచ్చిన నవలలు
రచయిత్రిగా చెరగని ముద్ర
మహిళా రచయితలకు స్ఫూర్తి
జర్నలిజంలోనూ రాణింపు
వలస రచయిత్రిగా వెళ్లినా భారతీ ముఖర్జీ, అమెరికా రచయిత్రిగాగుర్తింపు పొంది, ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని పొందారు . దేశ, అంతర్జాతీయంగా పలు నవలలు, చిన్నకథలు, వ్యాసాలు రాయడంలో దిట్ట అనే ముద్ర వేయించుకున్నారు. చిన్న పిల్లలకు కథలు పలువురి ఎంతగానో అకట్టుకున్నాయి. దేశ విదేశాల్లో ఇప్పటికీ ఈమె పుస్తకాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారత రచయిత్రిగా కంటే అమెరిక రచయిత్రిగానే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు భారతీ.
ఇండియాలో పుట్టి, అమెరికా రచయిత్రిగా పేరొందిన భారతి ముఖర్జీ ప్రస్తుతం బెర్కెలిలో యూనివర్శిటీి ఆఫ్ కాలిఫొర్నియాలో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.
కలకత్తాలో జన్మించిన భారతి ముఖర్జీ స్వాతంత్య్రనంతరం తల్లిదండ్రులతో యూరప్కు వెళ్లిపోయారు. 1950 తిరిగి కలకత్తాకు రావడం జరిగింది. కలకత్తాలోని లోరిటో పాఠశాలలో విద్యనభ్యసించారు. 1959లో కలకత్తా విశ్వవిద్యాలయంలోని లోరిటో కళాశాలలో బిఎను పూర్తి చేశారు. 1961లో బరోడా విశ్వవిద్యాలయంలో యంఎను పూర్తి చేశారు. అ తదనంతరం పై చదువుల కోసం అమెరికా పయణం పట్టారు. అమెరికాలోని లోవా యూనివర్శిటీలో ఎంఎఫ్ఎను పూర్తి చేశారు. 1963లో అదే విశ్వవిద్యాలయంలో లోవా రైటర్స్ వర్క్షాప్ను చేశారు. అంతేకాకుండా 1969లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంపారటివ్ లెక్చర్లో పిహెచ్డి కూడా చేశారు.
తరువాత కెనాడాలోని టోరోంటో పట్టణం,మోంట్రియల్లలో కొన్ని సంవత్సరాలు నివాసం అక్కడే భర్త క్లార్క్ బ్లేజ్తో పాటు ఉన్నారు. తిరిగి అమెరికా వచ్చిన తరువాత 1981లో ఆమె రాసిన యాన్ ఇన్విజబుల్ ఉమెన్ పబ్లిష్ కావడం జరిగింది. 1977లో భర్త బ్లేజ్తో కలిసి డేస్ అండ్ నైట్ ఇన్ కలకత్తా రాయడం జరిగింది. అంతేకాకుండా వారిద్దరూ కలిసి 1987లో ద శారో అండ్ ద టెర్రర్, ద హంటింగ్ లిగసి ఆఫ్ ద ఎయిర్ ఇండియా ట్రాజడీ ( ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182) రాశారు.
జీవితం
భారతీ ముఖర్జీ బర్కిలేలో చేరకముందు ఇతర దేశాల కళాశాలలోనూ బోధించడం జరిగింది. ఎంసీ గిల్ యూనివర్శిటీ, స్కీడ్మోర్ కళాశాల, క్వీన్ కళాశాల, సిటి యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ లలో గెస్ట్ ప్రొఫెసర్గా బోధించడం జరిగింది. భారతీ ముఖర్జీ అమెరికా రచయిత్రిగా అనేక గొప్ప నవలలను రాయడంతో అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోను పాపులారిటిని సంపాదించారు. 1989లో భారతీ ముఖర్జీని అమండా మీర్ ఇంటర్యూ చేయడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువగా అమెరిక రచయితగా ఉండటమే నాకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఆమె జీవితంలో ప్రయాణాలు చేసిన అనేక విషయాలను నవల రూపంలో పొందుపరచడం జరిగింది. చదువుకుంటున్న సమయంలోనే రచయిత్రిగా రాణించాలని పట్టుదలతో ఉండేవారు. వివాహనంతరం భర్త కూడా సపొర్టుగా నిలవడంతో ఇంకా అనేక నవలలు, చిన్న కథలు రాయడం జరిగింది.
అంతేకాకుండా భారత్ నుంచి అనేక మంది నవల రచయితలు వచ్చిన వారికంటే భారతి ముఖర్జీ అమెరికా రచయిత్రిగా గుర్తింపు పొందారు. భారత్ నుంచి వలస వచ్చిన రచయిత్రిగా గుర్తింపు ఉన్నా ఆమెకు, రాసిన నవలలో ఆమె హావాభాలను వ్యక్తపరుస్తూ, అమెరికా రచయిత్రిగానే ఎక్కువగా గుర్తింపు పొందడం జరిగింది. అమెరికాలో స్థిర పడిన తరువాత జర్నలిజం రంగంలోనూ రాణించారు. సామాజిక వేత్తగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, ప్రజల్లో సామాజిక అవగాహనకు తోడ్పడేవారు.
నవలలు
1971లో ద టైగర్స్ డాటర్స్
1975లో వైఫ్
1989లో జాస్మిన్
1993లో ద హోల్డర్ ఆఫ్ ద వరల్డ్
1997లో లీవ్ ఇట్ టూ మి
2002లో డిజైరబుల్ డాటర్స్
2004లో ద ట్రీ బ్రైడ్
2011లో మిస్ న్యూ ఇండియా
1991లో పొలిటికల్ కల్చర్ అండ్ లీడర్షిప్ ఇన్ ఇండియా
1992లో రిజైనాలిజం ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్
చిన్న కథలు
1985లో డార్క్నెస్
1988లో ద మిడిల్మెన్ అండ్ అదర్స్ స్టోరీస్
ఎ ఫాదర్
అవార్డు
1988లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు (ద మిడిల్మెన్ అండ్ అదర్ స్టోరిస్) నవలకు
మూలం : సూర్య దినపత్రిక