ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా సేవలు
1985లో కాంగ్రెస్‌లో చేరిక
1990లో తొలిసారిగా రాజస్థాన్ మంత్రిగా బాధ్యతలు
తాజాగా వరించిన కేంద్ర మంత్రి పదవి
సోనియాగాంధీతో సన్నిహిత సంబంధాలు
రాజకీయాల్లో తనదైన ముద్ర
రాజకీయ నాయకులిగా, రచయిత్రిగా, ఫ్రొఫెసర్‌గా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు గిరిజా వ్యాస్. ఫిలాసఫీలో డాక్టర్ చదివి ఫ్రొఫెసర్‌గా మంచి ఉద్యోగంలో ఉన్నా అది చాలు అని అనుకోలేదు. ఏదో సాధించాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చింది. ఎంతో మంది మహిళలకు తన వంతు సాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా అత్యున్నత పార్టీ పదవులను కూడా అలంకరించింది. పలువురి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికి ఉదయ్‌పూర్ యూనివర్శిటిలో ఆమెను ప్రొఫెసర్‌గానే అనుకుంటారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆమె గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత రాజకీయాలలో గిరిజా వ్యాస్ ఒకరు. ఈమె రచయిత్రి కూడా. గిరిజా ప్రస్తుతం 15వ లోక్‌సభలో దిగువ సభకు చిత్తోర్‌ఘర్ నియోజకవర్గం నుంచి పోటీి చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళ కమిషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఈమె గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. గిరిజా జూలై 8న 1946లో కృష్ణశర్మ, శ్రీమతి జమున దేవి లకు జన్మించారు. చదువులో డాక్టరేట్‌లో ఫిలాసఫీ చేశారు. తరువాత ఆమె బోధించడానికి ఉదయ్‌పూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్శిటికి, యూనివర్శిటీ ఆఫ్ దెలవేర్‌లకు వెళ్లారు. 1985లో గిరిజా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990లో రాజస్థాన్ ప్రభుత్వానికి మంత్రిగా అనేక సేవలందించారు. 1991లో ఉదయ్‌పూర్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశారు.
తదనంతరం డిప్యూటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1993లో పివి నరసింహారావు ప్రభుత్వంలో అల్ ఇండియా మహిళ కాంగ్రెస్‌కు అధ్యక్షరాలిగా వ్యవహరించారు. అంతేకాకుండా 1993-96 వరకు సంప్రదింపుల కమిటీ, పెట్రోలియం, నాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు. 1996లో మళ్లీ 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికలకు కూడా పోటీ చేసి గెలుపొందారు. 1999-2000 సంవత్సరంలో పెట్రోలియం, కెమికల్‌కు సభ్యురాలిగా కీలక పాత్ర పోషించారు. 2004లో రాజస్థాన్ ప్రోవిన్షీయల్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షరాలిగా పని చేశారు. గిరిజా వ్యాస్ ప్రస్తుతం ఇండో ఇయు సివిల్ సోసైటీ, అల్ ఇండియా కాంగ్రెస్ మిటీ, మీడియా వ్యవహారాలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యుపిఎపై పైచేయి సాధించింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభత్వంలో గిరిజ జాతీయ మహిళ కమిషన్‌కు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు 2011 వరకు అదే స్థానంలో కొనసాగారు. 2008లో కూడా రాజస్థాన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అంతేకాకుండా రాజకీయాల్లో రాణిస్తూ కూడా వారి కళపోషణకు మెరుగులు దిద్దారు. గిరిజా వ్యాస్ దాదాపు ఎనిమిది పుస్తకాలు రాశారు. ఎహ్సాస్ ఇస్ కే పర్ అనేది పద్యం ఉర్దులో రాశారు. సిప్, సముందర్ ఔర్ మోటి అనే హిందీ పద్యాలు కూడా ఉన్నాయి. నోస్టాల్జియా అనే ఇంగ్లీష్ శ్లోకాలు కూడా ఉన్నాయి. 1971లో ఉదయ్‌పూర్ విశ్వవిద్యాలయానికి ప్రోఫెసర్‌గా చేశారు. బోధన నిమిత్తం ఇతర దేశాలకు గెస్ట్ ప్రోఫెసర్‌గా గోల్డ్ మోడలిస్ట్ అందుకున్నారు. ఉదయ్‌పూర్ యూనివర్శిటీలో తిరుగులేని ప్రొఫెసర్‌గా కొనసాగారు. 1967లో యుజిసి ఫెలోషిప్ అందించే స్కాలర్‌షిప్‌లను కూడా పొందుకునేవారు. 1967-69 వరకు స్టుడెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అంతేకాకుండా 1963-65 వరకు క్రింది ఇతర బాధ్యలు కూడా చేపట్టారు. అల్ ఇండియా ఫిలాసఫీ అసోషియేషన్, అఖిల భారతీయ దర్శన్ పరిషత్, ఇంటర్‌నేషనల్ నియోప్లాటోనిక్ సోసైటి, అమెరికన్ ఫిలోసాఫికల్ అసోషియేషన్, అసోషియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్ వాటితో పాటు పుస్తి భక్తి అనే పత్రికను కూడా నడిపారు. ఇది 1982లో చంఢిఘర్‌లో అల్ ఇండియా ఫిలాసాఫికల్ కాంగ్రెస్ అధ్వర్యంలో జరిగేవి.
మూలం : సూర్య దినపత్రిక