వారిని ఎలాగైనా రక్షించాలని ఈదుకుంటూ వెళ్లి తొలుత మహ్మద్ ఫరాన్ (7)ను ఒడ్డున పడేసింది. ఆ తర్వాత మెహక్ ఆరా(6), డాలీఖాటూన్ (8), మహ్మద్ జెహన్ (9), మహ్మద్ సమీర్ (8)లను రక్షించింది. ఒక చేత్తో మునిగిపోతున్న చిన్నారులను పట్టుకుని, మరోచేత్తో ఈతకొడుతూ ఎలాగో ఐదుగురిని ఒడ్డుకు చేర్చేసరికి రోజీలో శక్తి సన్నగిల్లింది. అయనా, బలాన్నంతా కూడదీసుకుని ఆరో చిన్నారి ఫర్హాన్ (7)ని రక్షించాలని మళ్లీ నీళ్లలోకి దూకింది. అప్పటికే నీళ్లు తాగేసి బరువెక్కి పోయన ఫర్హాన్‌ని మోస్తూ ఒడ్డుకు చేర్చేసరికి రోజీ స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే గుమిగూడిన గ్రామస్థులు రోజీతో పాటు పిల్లలందరినీ ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అయతే, ఫర్హాన్ ప్రాణాలు కోల్పోయింది. ఏడో తరగతి చదువుతున్న రోజీ ఐదుగురి జీవితాలకు ప్రాణం పోసింది. అనన్య ధైర్య సాహసాలు చూపిన ఆమెను గ్రామస్థులందరూ అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె మానవత్వం చూపడంలో ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ఆమె సాహసానికి ఏమి ఇచ్చినా తక్కువేనని, జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటామని బతికి బయటపడ్డ బాలికల తల్లిదండ్రులు అంటున్నారు.
ఇపుడు ఆ గ్రామంలో అందరూ రోజీ సాహసాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. గతంలో జిల్లా స్థాయి ఈత పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్నప్పటికీ తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లలను రక్షించేలా ఆమె ఎంతో తెగువ చూపింది. కష్టపడి చదివించి రోజీని ఆర్మీలో చేర్పిస్తానని దినసరి కూలీ అయన ఆమె తండ్రి గర్వంగా చెబుతున్నాడు. రోజీకి సాహస బాలల అవార్డు ఇవ్వాలంటూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు.