ప్రొఫైల్
పూర్తి పేరు : అర్పితా సింగ్
పుట్టిన సంవత్సరం : 1937
ప్రస్తుత నివాసం : కొత్త ఢిల్లీ
భర్త : పరంజీత్ సింగ్ (పేయింటర్)
కూతురు : అంజుమ్ సింగ్ (కళాకారిణి)
వృత్తి : పెయింటర్
ఆవార్డులు : ‘పద్మభూషణ్ ’ (2011)
అర్పిత సింగ్ ఒక పెయింటర్ అనే విషయం పక్కన ఉన్న పెయింటింగ్స్ బట్టి తెలుస్తుంది. కాని అర్పిత గురించి తెలుసు కోవాల్సిన ఆసక్తి కరమైన విషయాలు చాలా ఉన్నాయి.ఆమె పెయింటింగ్ ‘విష్ డ్రీమ్’ 9 కోట్ల 60 లక్షలు పలికిందంటే అమె పెయింటింగ్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పాపులారిటి ఉందో అర్థం చేసుకోవచ్చు. అమె చిత్ర కళా ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం భారత పౌరులకు అందించే అత్యున్నత పురస్కారలలో ఒకటైన ‘పద్మభూషణ్’తో గౌరవించింది. అర్పిత భర్త ప్రఖ్యాత చిత్రకారుడైన ‘పరంజీత్ సింగ్’ . వారి కూతురు ‘అంజుమ్ సింగ్’ కూడా చిత్ర కళలో ప్రవేశం ఉంది.
పెయింటింగ్‌పై ఆసక్తి కలిగిందిలా...
అర్పితా సింగ్ పశ్చిమ బెంగాల్‌లో 1937లో జన్మించారు. చిన్న నాటినుంచే అర్పితకు చిత్రకళ అంటే అమితాసక్తి ఉండేది. ఢిల్లీలోని పాలిటెక్నిక్ కళశాలలో స్కూల్ ఆఫ్ ఆర్ట్‌స విభాగంలో చిత్రకళలో ఓనమాలు నేర్చుకున్నారు. 1954 నుంచి 1959 వరకు సాగిన ఈ కోర్సులో చిత్రకళా వాతావరణం అర్పితలోని చిత్రకళాకారిణిని మేల్కోలిపింది.గ్రాడ్యువేషన్ పూర్తయ్యాక భారత ప్రభుత్వ ఇండస్ట్రీస్ రెస్టారేషన్ ప్రోగ్రామ్‌లో ఉద్యోగం చేసింది. ఈ సమయంలోనే అనేక మంది సంప్రదాయ కళాకారులను, నేత వృత్తికారులను లిసే అవకాశం కలిగింది.అమె జీవితంపై ప్రభావం చూపిన అంశాలలో ఇదే ప్రధానం.1970 మధ్యలో ఆమె గీసిన చిత్రాలు ప్రధానంగా నలుపు , తెలుపు రంగులతో అలరించేవి. సింపుల్‌గానే ఉంటూ ఆలోచింపచేయడం అర్పిత కళాఖండాల ప్రత్యేకత.
అంతర్జాతీయ ప్రఖ్యాతి
1990 తరువాత అర్పిత గీసిన చిత్రాలకు మంచి పాపులారిటీ వచ్చింది. సాధారణ వ్యక్తి కూడా సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలను గీయడం ఆమె ప్రత్యేకత.నిజానికి చిత్రకళ అనేది అందరికీ అర్థం అయ్యేలా ఉంటే తన ప్రస్థానాన్ని మరింత విజయవంతంగా కొనసాగించవచ్చు. అయితే ఇది ఒక చిత్రకారుడికీ మరో చిత్రకారుడికీ మధ్య ఉన్న ప్రత్యేకత. చిత్రకారుడు ఏం ఫీలవుతాడో అదే కాన్వాస్‌పై వాలుతుంది. కొన్ని సార్లు ఒక థీమ్‌ను ఎంచుకుని కూడా పెయింటింగ్ ఉంటుంది. ప్రతీ కళాఖండానికి థీమ్ ఉంటుందనేది మరో వాదన కూడా. ఏదేమైన కళాకారుడి ఆంతరంగిమై చిత్రకళకు ఆది. అర్పిత కూడా తన పెయింటింగ్స్‌లో వివిధ రకాలైన థీమ్స్‌ను ప్రదర్శించే వారు. 1990 తరువాత అర్పిత పెయింటింగ్స్‌ను అనేక జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించింది. అందుకు గుర్తింపుగా అమెకు ‘పద్మభూషణ’్ అవార్డు కూడా లభించింది.
టర్నింగ్ ‘పెయింట్’
అర్పితా సింగ్ మాత్రమే కాదు సాటి మహిళా కళాకారులు కూడా పీకల్దాకా హ్యాప్పీగా ఫీలైంది ఎప్పుడో తెలుసా? అర్పిత గీసిన ‘విష్ డ్రీమ్’ అనే పెయింటింగ్ ఏకంగా 9 కోట్ల 60 లక్షలు (2.24 మిలియన్ అమెరికన్ డాలర్లు) పలికినప్పుడు.సాఫ్రాన్ ఆర్ట్ ఆన్‌లైన్ వేలం పాటలో 2010లో ఈ చిత్రాన్ని ఒక కళాభిమాని సొంతం చేసుకున్నాడు. దీంతో దేశంలోనే ఈ స్థాయిలో పాపులారిటీ ( వేలం పాటలో విజయం) సాధించిన తొలి మహిళా చిత్రకారిణిగా అర్పితా రికార్డు సృష్టించారు.అయితే ఈ సందర్భంలో అర్పితా మాట్లాడుతూ ‘ కళాకారుడు వేలం పాటను దృష్టిలో ఉంచుకుని చిత్రాలను గీయరు. అయితే చిత్రకళకు నేటికీ ఇంత ఆధరణ ఉండటమనేది నిజంగా హర్షించదగ్గ విషయం.’ అని తెలిపారు.
భారతీయ మగువల మానస చిత్రం...
1980లో అర్పిత బెంగాలీ జనపద దృశ్యాలను పెయింటింగ్‌గా మలచడం ప్రారంభించింది.ఈ పెయింటింగ్స్‌ను మహిళనే ప్రధానంగా చేసుకుని చిత్రించే వారు.ఆమె చిత్రాలలో అధిక శాతం గృహిణీ స్త్రీలు తమ పని చేసుకునే విధానాన్ని...వారు ఇంటి పనులలో ఉన్నప్పుడు ఉన్న సందర్భాన్ని చిత్రీకరించే వారు.ఈ కోణంలో చిత్రాలను గీసి మహిళల అభిమానాన్ని సొంతంచేసుకున్నారు. ప్రారంభంలో భారత సంప్రదాయ చిత్రకళా విధనమైన వాటర్ కలర్స్‌ను వినియోగించి పేపర్‌పై పేయింటింగ్స్ వేసే వారు.1990 నుంచి అర్పిత సింగ్ ఆయిల్ పెయింటింగ్ వేయడం ప్రారంభించారు. అమె చిత్రాలలో స్ర్తీలను సహజంగా చూపించేవారు. అర్పితా పెయింటింగ్‌లను భారతీయ మగువల మానసచిత్రంగా అభివర్ణిస్తారు.
అవార్డులు
- పద్మభూషణ్ (2011) తో భారత ప్రభుత్వం అమెను సత్కరించింది.
- పరిషద్ సమ్మాన్(1991) తో సాహిత్య కళా పరిషద్ సత్కరించింది.
- అల్జేరియా బైనియల్ (1987)తో అల్జేరియా ప్రభుత్వం గౌరవించింది.
- అఖిల భారత చిత్రకళా పోటీ విజేత (1981,1992)