ఫ్యాషన్ డిజైనర్‌గా జాతీయ స్థారుులో కీర్తి
పాత పోస్టర్లపై మక్కువ ఎక్కువ
‘న్యూ ఇండియా బయోస్కోప్’ స్థాపన
ప్రస్తుతం యువతలో చాలా మంది టెక్నాలజీ అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సరికొత్త పరిజ్ఞానంతో వినూత్నమైన వస్తువులు తయారు చేయడమే కాదు. వాటితో సమయాన్ని ఎలా పొదుపు చేసుకోవాలో ఆలోచిస్తున్నారు. చేసే పని వేగంగా పూర్తయ్యే మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అరుుతే అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారంటే పొరబాటే. ఈ నాటి కాలంలోని కురక్రారులోనూ పాత కళాకృతులపై మక్కువ చూపే వారు ఉన్నారు. వాటికి నేటి పరిజ్ఞానాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వారిలో నిదా మహ్మూద్ ఒకరు. తనకి డిజైన్‌పై ఉన్న మక్కువతో పాత చిత్రాల పోస్టర్లను రూపొందిన కళాకారులను అన్వేషిస్తున్నారు. వారి చేత ఆకర్షణీయమైన రూపాలను డిజైన్ చేరుుస్తున్నారు. ఆనాటి కళాకారులకు ఉపాధిని కల్పిస్తున్నారు.
వివిధ రకాల కళాకారుల కలయిక చిత్రరంగం. ఇందులో పోస్టర్లను రూపొందించే వారు కూడా ఒకరు. కాని నేటి కాలంలో చేతితో పోస్టర్లను చిత్రీకరించేవారు కనుమరుగైపోతున్నారు. అంతా టెక్నాలజీ మహిమతో డిజిటల్ ప్రింట్లు దర్శనమిస్తున్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా, పాత చిత్రాల్లోని వస్తువులు, వాటి పోస్టర్లకు నేటి డిజిటల్ ప్రింట్లు జీవం పోయలేవని భావిస్తారు ఫ్యాషన్ డిజైనర్ నిదా మహ్మూద్. తను అనేక చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేయడమే కాకుండా, చిత్రీకరణకు ఉపయోగమైన సామాగ్రిని కూడా డిజైన్ చేశారు. అయితే ఈమెకు పాత పోస్టర్లపై మక్కువ ఎక్కువ. అందులో ఎంతో అందం ఉంటుందని చెబుతుంటారు. అందుకే వాటిని రూపొందించిన కళాకారులను అన్వేషించి, వారి చేత అనేక కళాకృతులను సృష్టింపజేస్తున్నారు. వాటికి నేటి ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత ఆకర్షణ తీసుకొస్తున్నారు నిదా. ఆనాటి కళను నేటి వారికి పరిచయం చేయడానిి కృషి చేస్తున్నారు.
నిదా ఆలోచనలు విభిన్నమైనవి. ఈమె న్యూ ఇండియా బయోస్కోప్ అనే కంపెనీని స్థాపించింది. దీన్ని ఒక ప్రొడక్ట్ డిజైన్ హౌస్‌గా తీర్చిదిద్దింది. దీనికి పెద్ద కాన్వాస్‌గా భావించి బాలీవుడ్ చిత్ర వైభవాన్ని చాటాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగా పాత చిత్రాల్లోని కుర్చీలు, టేబుల్స్, బ్యాగ్స్, షూస్, డైరీలు, పోస్టర్లు, ఇలా ఎన్నో వస్తువుల సేకరణలో మునిగిపోయింది నిదా మహ్మూద్.ఇలా పాత చిత్రాల్లోని వస్తువులను సేకరించడమే కాకుండా వాటిని రూపొందించిన కళాకారులను కూడా అన్వేషించారు నిదా. ‘గత వేసవిలో, మా ఆయన రావుల్ చంద్రతో కలిసి పాత ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాం. అక్కడ కళాకారుల కోసం వెతికాం. పాత ఢిల్లీలో ఐదు మంది పోస్టర్ ఆర్టిస్ట్‌లను కలుసుకోగలిగాం. చాలా మంది కురువృద్ధులై పోయారు. మరణానికి దగ్గరి పరిస్థితిలో ఉన్నారు.
అక్కడ వారు ఆర్టిస్టులు ముంబాయి, వడోదరాలో ఉంటారని చెప్పారు. దాంతో మేం అక్కడికి వెళ్లి వారి కోసం అన్వేషించాం. వరికి కొంతమందిని కనుగొన్నాం. అందులో 85 సంవత్సరాల వయసు గలిగిన పోస్టర్ ఆర్టిస్ట్‌ను గుర్తించాను. అతను ప్రస్తుతం ఏమీ గీయలేరు. కాని ఆయన ఎన్నో వివరాలు చెప్పారు. అవి నాకు ప్రోత్సాహాన్నిచ్చింది’ అని నిదా అన్నారు.
ఈ పోస్టర్ కళాకారుల గురించి నిదా వివరించారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి హ్యాండ్ పెయింట్‌తో చేసిన పోస్టర్ లేదు. ఈ కళాకారులు తమ వృత్తిని వదులుకొని వివిధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ఆర్టిస్ట్‌లు పెద్ద భవనాల వద్ద వాచ్‌మెన్‌లుగా స్థిరపడ్డారు. మరికొంత మంది ఇంట్లో గోడలకు పెయింట్‌లు వేసుకుని కడుపు నింపుకుంటున్నారు. నేను వారిని కలిసి... మీరు అభిమానించే పాత వృత్తిని చేపట్టండని వారిని చెప్పాను.
యూరోపియన్‌లు పాత తరహా డిజైన్‌తో రూపొందిన ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. విదేశాల నుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి అని నిదా చెప్పారు.
చిత్ర నిర్మాణానికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల చిత్రాలను చిత్రీకరించడానికి, వెడ్డింగ్ కార్డుల డిజైన్‌కు ఈ శైలిని కోరుకుంటున్నారని అన్నారు.వీటిని ఇష్టపడే వారు రోజురోజుకి పెరిగిపోతుండంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఫ్‌బీట్ చిత్రాలకు డిజైన్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. వాటికి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అలాగే గృహోపలంకరణ వస్తువులు, రెస్టారెంట్‌లోని కళాకృతులను చేయాలన్నా చాలా ఆసక్తి.నా జీవితంలో ఇది మంచి నిర్ణయం. నేను ఇలాంటి రంగంలోకి వెళతాను అనిచెప్పేసరికి మా పేరెంట్స్ అంతా మొదట షాక్ తిన్నారు. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వృత్తి చేపట్టాలని భావించాను. దానికి నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. దాంతో నేను ఇప్పుడు నేను ప్రస్తుత స్థాయిలో ఉన్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో మంచిదని నేను భావిస్తుంటాను.
నా లాగా పాత సినిమాలోని వస్తువులను సేకరించి భద్రంగా దాచిపెట్టిన వారిని కలిసాను. వారి వద్ద ఉన్నవాటికి మరలా పెయింటింగ్ చేశాను. ఇవి చాలా మందిని ఆకట్టుకుంది. అప్పుడు వారు దీవార్ పోస్టర్లు, బసంతి బ్యాగ్‌లు, గబ్బార్, జీనత్ కుర్చీలు కోరారు. ఇలా అనేక రకాల పోస్టర్లకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో పోస్టర్ పెయింటింగ్ కళాకారులకు మంచి ఉపాధి దొరికింది.