అంతర్జాతీయంగా ఒక అనూహ్యమైన గుర్తింపును పొందింది మదర్ థెరిస్సా. చరిత్రలో ఈమే ఈ రంగంలో అత్యంత సేవలందించి జన్మ చరితార్థం చేసుకున్న తొలి మహిళ. ఈమె కూడా విదేశీయురాలే. ఇదే మార్గంలో మరికొందరు ప్రయాణిస్తూ, థెరిస్సా అడుగుజాడల్లో నడుస్తున్నారన్నది యథార్ధం. థెరిస్సా ప్రపంచదేశాల్లో ఎందరికో ఆదర్శంగా, చెరగని ముద్రవేసుకుంది. అదే మార్గంలో పయనిస్తూ రెండో మదర్ థెరిస్సాగా కొనియాడబడుతోంది జీన్..
అసలు పేరు జాక్వెలిన్ జీన్ మెక్‌ఈవాన్. ఎక్కువ గా ఈమె ను జీన్ అని పిలుస్తూవుంటారు. అంతేకా కుండా జీన్, బెంగళూరులో ఉన్న ఈ సుమనహళ్లి వాసులకి మరో థెరిస్సాగా పేరుపడిపోయింది. ఈమె తన సుదీర్గ కాలం తరువాత ఒకమారు తన దేశానికి వెళ్ళాలని అనుకుంది. తీరా అప్పుడు చూస్తే వీసా గడువు అప్పటికే ముగిసింది. అయినా ఈమె కథ కేంద్రమంత్రి వరకూ చేరుకుంది. ఈమె కుష్ఠురోగుల వైద్య సహాయం అందించడం కోసం మొబైల్ వైద్యశాలని నడుపుతోంది. అంతేకాకుండా ఈమె సుమనహళ్లికి అంబులెన్స్‌లో వెళ్ళి అక్కడి కుష్ఠు రోగుల గాయాలను శుభ్రం చేసి, కట్లు కడుతున్నారు. వైద్య రంగంలో చేసిన సేవలకు ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.
ఒక్క కుష్ఠు వ్యాధి గ్రస్తులకు మాత్రమే కాకుండా మధుమేహం ఉన్న వారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది జీన్స్. జీన్ మాట్లాడుతూ, ‘ఇండియాలో కుష్ఠువ్యాధి అరికట్టబడింది. అయినా పూర్తిస్థాయిలో దీనిని నివారించడానికి వైద్యులు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే, కొత్తగా మరికొందరు ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ వ్యాధిని కూకటి వేళ్ళతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ’. అంటూ తన సంతోషాన్ని వ్యక్తీకరించింది. కుష్ఠురోగులకు సేవలందించడంలో జీన్‌కు ఎంతో అనుభవం ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిక్షం ఎత్తుకునే కుష్ఠువాళ్ళను కూడా ఈమె పిలిచి తీసుకువెళ్ళి ప్రత్యేక వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఆదరణ కరువై, సమాజం దృష్టిలో అనాశ్రయులుగా ఉండే వీరి పట్ల జీన్ ఎంతో ఆదరణ చూపెడుతోంది. అంతేకాకుండా ఎంతో శ్రద్ద కూడా కనబరుస్తోంది.
భారతీయ వ్యవహారాల్లో...
ఈమె ఇండియాలో జరుగుతున్న డ్రగ్ మాఫియా, ముఠాతగా దాలు, మద్యపానం, ఇతర వ్యసనాల మీద, వారికి సంబంధించిన అంశాల మీదా ఎంతో విచారాన్ని వ్యక్తప రిచింది. హిందూ-ముస్లింలు భారతదేశంలో సఖ్యతగా ఉండడాన్ని గమనించి ఎంతో సంతోషాన్ని తెలియ చేసింది. తను కుష్ఠువ్యాధి గ్రస్తులకు, ఇతర రోగులకు సేవలందించడం ద్వారా బాధ అనేది ఎలా ఉంటుందో బాగా తెలిసింది అంటుంది. ఈమె ఈ సేవలు అందించడానికి ఎక్కువగా న్యూకాజిల్ నుండి ధన సహాయం అందిందని కృతజ్ఞతా భావంతో అంటుంది. తప గురించి, తన సేవల గురించి పత్రికల్లోను, ఎలక్ట్రానిక్ మీడియాల్లోను రావడం తనకెంతో ఆనందం కలిగించినట్టు తన మాటల్లోనే వ్యక్తపరిచింది.నేటి యువత కొందరు అవగాహనా రాహిత్యంతో నడుచుకోవడం పట్ల ఈమె ఆవేదన వ్యక్తంచేసింది. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేయాలని, అందుకు సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాలు తగిన సత్వర చర్యలు చేపట్టాలని సలహాయిచ్చింది.
వ్యవస్థాపన...
ఈమె స్థాపించిన సుమనహళ్లి సొసైటీ సుమారుగా 120 మంది పేద కుష్ఠు రోగులకు ఆశ్రయాన్ని కల్పించేదిగా ఎంతో విశాల ప్రదేశంలో నిర్మించింది. తన మొబైల్ సేవల ద్వారా సుమారుగా నిత్యం 1000 మంది కుష్ఠు రోగులకు సేవలందిస్తోంది. జీన్ చేస్తున్న ఈ అనుపమాన సేవలకు, తోటి నన్స్‌కి ఇచ్చిన ట్రైనింగ్ కార్యక్రమాలకు గుర్తింపుగా ఎన్నో అవార్డ్‌లు, పురస్కారాలు అందుకుంది. అదే కోవలో ఈ సొసైటీకి ఎందరో ప్రముఖులు, పెద్దపెద్ద సంస్థలు, సేవా నిరతి ఉన్న అనేక మంది వ్యక్తులు ఎన్నో విరాళాలు స్వయంగా అందించారు. ఈ మిషన్‌ని 70ల్లో స్థాపించడం జరిగింది.
ఈ సోసైటీ ద్వారా ఈ గ్రామం కూడా దినదినాభివృద్ది చెందుతూ వచ్చింది. ఈరోజు సుమనహళ్లిలో ఈ మిషన్‌లో కుష్ఠురోగులు తయారుచేస్తున్న తోలు ఉత్పత్తులు, దుస్తులు, ఇతర వ్యాపార వస్తువులు యునైటెడ్ కింగ్ డమ్ లో విరివిగా అమ్ముడుపోతూ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నాయి.జీన్స్ బెంగుళూరులోని నది తీరాన ఎంతో ఆహ్లాదంగా ఉండే కామరాజ్ అనే ఈ ప్రదేశానికి చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. బజ్ ప్రాంతంగా పిలువబడే ఊరి చివరి ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద పెట్రోల్ పంపుల వద్ద చాలా పెద్ద భవంతి నిర్మాణము చేస్తున్నారు. ఆమె టివిఎస్ మోపెడ్‌ను ఉపయోగించేవారు. ప్రస్తుతం దానిని ఒక మూల ఉంచారు. ఇది ఆమెకు నాల్గవ వాహనం. 2000 సంవత్సరం నుండి ఈమె టివిఎస్ వాహనం పైనే తన పనులు చేసుకుంటోంది.
మూలం : తెలుగు విశేష్