రమాదేవి పశ్చిమ గోదావరి జిల్లాలోని చేబ్రోలులోని ఉంగుటూరు మండలంలో జనవరి 15 , 1934లో జన్మించారు. రమాదేవి తల్లితండ్రులు వి. సుబ్బయ్య, వి వెంకట రత్నమ్మ. విద్య అంత ఏలూరు, హైదరాబాద్‌లోనే సాగింది. రమాదేవి విఎస్ రామావతార్‌ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మెట్టినిల్లు చేబ్రోలుకు ఆరు కిలోమీటర్ల దూరంలో కాగుపాడు. తన విద్య ఏలూరులోని సెయింట్ థెరిసా, సీఆర్ ఆర్ కాళాశాలల్లో ఇంటర్ దాక చదివారు. తరువాత హైదరాబాద్‌కు వచ్చి ఎమ్‌ఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు.విద్యానంతరం 1959లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాధిగా పనిచేశారు. ఇండియన్ లీగల్ సర్వీస్‌లో చేరి వివిధ హోదాల్లో పని చేశారు. అంతేకాకుండా ప్రత్యేక లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శిగా, లా మిషన్ మెంబర్‌గా విధులు నిర్వర్తించారు. వాటితో పాటు కస్టమ్స్ ఎకై్సజ్ అప్పీళ్ల ట్రీబ్యునల్ సభ్యులుగా కూడా పని చేశారు.
1999 నుంచి కర్ణాటక గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి 2002 వరకు విధులు నిర్వహించారు.
అంతేకాకుండా రమాదేవి కామన్ వెల్త్ అసోషియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి ఆసియా దేశస్తురాలిగా, అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈమె పదవి బాధ్యతలతో పాటు రచయిత్రిగా కవిత్వాలు రచనలు రాశారు. దాదాపు తెలుగు భాషలో ఇరవైకి పైగా గ్రంథాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. అమె రాసిన గ్రంథాలు, రచనలు అఖిల భారత రచయితల సదస్సులో ఉంచారు. ఢిల్లీలోని ఆంధ్ర వనితా మండలి అధ్యక్షురాలిగా పని చేశారు. రమాదేవిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
తన రచనతలతో అందర్ని రంజింప చేసిన రమాదేవి గొప్పతనం అంతా రాజదాని నుంచే ప్రారంభమైనది. తన మొదటిగా రాజధానిలో ఉన్న అకాశవాణిలో పిల్లల కార్యక్రమంతో అందరిని అకట్టుకుంది. అనేక పత్రికల్లోను రమాదేవి వ్యాసాలు ప్రచురమయ్యేవి. దాదాపు 19 పుస్తకాల పై గానే రమాదేవి రాశారు. అమె రాసిన రచనలు ప్రజలలో ఆసక్తిని రెపాయి. రచనల ద్వారా ప్రజలలో మార్పు వస్తుందని భావించి అనేక పుస్తకాలను రాశారు.మహిళలు, చిన్నారులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై, చట్టాలపై ఆమె పలు పుస్తకాలు రాశారు.
పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు. సమాజంలో జరుగుతున్న రుగ్మతులను తన పాఠ్యంశాలలో పొందుపరిచింది. ఒక్క మన రాష్ట్రానికి కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శ మహిళగా కీర్తించబడ్డారు. మహిళా లోకానికి స్ఫూర్తిగా వెలుగొందారు. ఇతర రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన మన రాష్ట్రంలో జరిగే అనేక సాంకేతిక, సాహిత్యా కార్యక్రమాలకు ఆహ్వానం అందిన వెంటనే ఎన్ని కార్యక్రమాలున్న హాజరయేవారు. కామన్ వెల్త్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవి చేపట్టినప్పుడు భాగ్యనగరమంతా సంబరాలతో నిండిపోయింది.
తాను ఎంత ఉన్నత పదవులు చేపట్టినా కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై ఎంతో ప్రేమ ఉండేది. ఏదైనా శుభకార్యాలకుగాని ఇతర బంధు మిత్రులను కలుసుకోవాడానికి తరచుగా వెళ్తుండేవారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేవారు. అవసరమున్న ప్రతిసారి తన సొంత జిల్లాను సందర్శించేవారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల మిషనర్‌గా నవంబర్ 1993 సంవత్సరంలో కొంతకాలం పని చేశారు. 1993 జూలైలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా నియమితులై 1997 వరకు పదవిలో కొనసాగారు. రమాదేవి సేవలు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాలకు తన సేవ చేశారు. 1997 హిమచల్ ప్రదేశ్ గవర్నర్‌గా 1999 వరకు ఆ రాష్ట్రానికి సేవలందిచారు.
ఆంధ్రభూమితో రమాదేవికి సుమారు ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. గోరా శాస్ర్తీ సంపాదకత్వంలో ప్రారంభించిన విపులాచపృథ్వీ కాలమ్‌ను దీర్ఘవిరామం తరవాత ఆమె మళ్లీ కొనసాగించి అనేక సంవత్సరాలు నిర్వహించారు. అందులో సమకాలిక రాజకీయ, సామాజిక పరిణామాలపై ఆమె తనదైన శైలిలో విశ్లేషించిన తీరు పాఠక లోకం మన్నన పొందింది. ఆంధ్రభూమి వార, మాస పత్రికలలో కూడా ఆమె చాలా కాలం కాలమిస్టుగా ఉన్నారు.
మూలం : తెలుగు విశేష్