telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఎగిరిపోతే ఎంత బాగుందో!

1/23/2014

0 Comments

 
Picture
                  తమ చదువుకు తగిన ఉద్యోగం వస్తేనే చేస్తామంటూ భీష్మించుకుని కూర్చుంటారు కొందరు. చిన్న ఉద్యోగం చేస్తే పరువు పోయినట్టు బాధపడతారు ఇంకొందరు. కాని పూణె అమ్మాయి అపూర్వ గిల్షే తీరు అది కాదు. పైలెట్ శిక్షణ పొందిన అమ్మాయి మొదట విమానంలో సేవలందించే మామూలు ఉద్యోగిగా పనిచేసింది. మూడేళ్ల తర్వాత పట్టు వదలకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది.

                   పూణెలోని అబాసాహెబ్ గర్వారే కాలే జ్‌లో చదువుతున్న సమయంలో అపూర్వ తన స్నేహితులు ఎన్‌సీసీ పెరేడ్‌లో పాల్గొనడం చూసింది. కవాతు చేస్తున్నప్పుడు వాళ్ల యూనిఫామ్, దానిమీద కదిలే పతకాలు - ఎంతో ఠీవిగా ఉన్నట్టనిపించాయి. అంతేకాదు ఎన్‌సీసీలో చేరితే ఫ్లయింగ్, స్కూబా డైవింగ్, పారాసెయిలింగ్ నేర్చుకోవచ్చన్న విషయం కూడా ఆమెకు ఆరోజే తెలిసింది. మర్నాడే వెళ్లి ఎన్‌సీసీ ఎయిర్ యూనిట్‌లో చేరిపోయింది. అక్కడ చాలా కఠినమైన శిక్షణ ఉంటుందని ముందే తెలిసినా భయపడలేదామె.

ఆస్ట్రేలియాకు టేకాఫ్
                      "నాకు భూమ్మీద నిలకడగా కూర్చోవడం ఇష్టం లేదు. పైలెట్ అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నాను'' అని చెప్పే అపూర్వ తన నిర్ణయాన్ని అమల్లోపెట్టి, శిక్షణ కోసం ఆస్ట్రేలియాలోని ఏరోస్పేస్ ఏవియేషన్ సంస్థలో చేరింది. ఈ శిక్షణలో మొదటి రెండు నెలలు గ్రౌండ్ క్లాసులుంటాయి. వాటి తర్వాత మంచి వాతావరణ పరిస్థితులున్నప్పుడు శిక్షకుడు పక్కనుండగా విమానాన్ని నడపడం మొదటి దశ. సొంతంగా ఒక్కరే వెళ్లి నడపడం మలి దశ. "మొదటిరోజు టేకాఫ్, లాండింగ్ సొంతంగా చేస్తుంటే... ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను...'' అంటోందీ అమ్మాయి. వాటి తర్వాత జనరల్ ఫ్లయింగ్ ప్రోగ్రెస్ టెస్ట్, ప్రైవేట్ పైలెట్ లైసెన్స్, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ అందుకుంది అపూర్వ. ఆఖరుగా మల్టీఇంజన్ కమాండ్ ఇన్‌స్ట్రుమెంట్ రేటింగ్ చేతికొచ్చింది. 2008 సంవత్సరానికి బెస్ట్ స్టూడెంట్ అవార్డూ తనకే వచ్చింది. శిక్షణ పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియాలో 250 గంటల విమాన అనుభవం ఆమె సొంతమయింది.

కష్టాల్లోకి ల్యాండింగ్
                        'పైలెట్ లైసెన్స్ ఇలా రాగానే అలా ఉద్యోగం వచ్చేస్తుంది' అనుకుంటారు చాలామంది. కాని అపూర్వ 2009లో స్వదేశంలో కాలుపెట్టే సమయానికి పరిస్థితి వేరేగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల విమానయాన రంగం ఇబ్బందుల్లో పడిపోయింది. దాంతో ఆమెకు కొలువు వెంటనే లభించలేదు. అప్పటిదాకా అపూర్వ చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తండ్రి చేతులెత్తేసాడు. ఆయన కేవలం ఒక ప్రభుత్వోద్యోగి. ఆమె శిక్షణ పూర్తయ్యే సమయానికి రిటైరయ్యాడు కూడా. దాంతో వాళ్లు తీసుకున్న పర్సనల్, ఎడ్యుకేషనల్ లోన్ తీర్చడం కష్టమైపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే తండ్రి స్నేహితులు ఆదుకున్నారు. అపూర్వకు ఒక చెల్లీ తమ్ముడూ కూడా ఉన్నారు. తాను ఖాళీగా కూర్చుంటే వాళ్ల భవిష్యత్తుకు ఆటంకమవుతుందని ఆమెకు అర్థమైపోయింది. సమయం వృథా కాకుండా గ్లైడర్ పైలట్ లైసెన్స్ పొంది, తన ఫ్లయింగ్ నైపుణ్యానికి మెరుగులద్దుకోవటంతో పాటు ఇండిగో వారు కేబిన్ క్రూ కావాలంటూ వేసిన ప్రకటనచూసి దరఖాస్తు పెట్టుకుంది.

మళ్లీ ఆకాశంలోకి
                     కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకున్నా, కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కావాలంటే ఈ ఉద్యోగం తప్పనిసరి అపూర్వకు. 'కాక్‌పిట్‌లో ఉండాల్సిన తను బైట ఉద్యోగం చెయ్యడమేమిటి' అనిపించినా- ఎలాగోలా విమానమైతే ఎక్కాను కదా' అని సరిపెట్టుకుంది. 'పైలెట్లకు అవసరమైన ఆహార పదార్థాలను అందించడానికి కాక్‌పిట్‌లోకి వెళుతుంటాం. అలా వె ళ్లిన ఒక్క నిమిషమే ఎంతో సంతోషంగా అనిపించేది. నేను ఉండాల్సిన ప్రదేశం ఇదే అనుకునేదాన్ని. కేబిన్ క్రూగా పనిచెయ్యడం వల్ల ప్రతిరోజూ ఎంతోమందిని చూసే వీలు కలిగింది. వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఒకేసారి బోలెడన్ని పనులెలా చెయ్యాలి, కలిసికట్టుగా పనిచెయ్యడంలోని కష్టసుఖాలేమిటి ఇవన్నీ బోధపడ్డాయి' అని చెబుతున్న అపూర్వ అలా రెండేళ్లు పనిచేశాక డిసెంబర్ 2012లో కోపైలెట్‌గా చేరింది. నెల రోజుల క్రితమే పూర్తి స్థాయి కో పైలెట్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఇక ఇప్పుడు ఆకాశంలో రెక్కలు చాచి అందినంత మేరా ఎగిరిపోవడమే ఆమె పని.

అర్హతకు తగిన ఉద్యోగం లేదని బాధపడుతున్నవాళ్లెందరో ఉంటారు. అలాంటి వాళ్లు -
- తమలోని నిప్పును ఆరిపోనివ్వకూడదు. లక్ష్యాన్ని మర్చిపోకూడదు.
- సబ్జెక్టును మరిచిపోకుండా తరచూ చదువుతుండాలి, చదువుతున్న విషయానికి పదును పెడుతుండాలి.
- అవకాశాల కోసం ఎదురుచూడటం తప్పదు. కాని అవకాశం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడొస్తే అప్పుడు చటుక్కున దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

0 Comments

అంతర్జాతీయ కీర్తి కిరీటం

12/31/2013

0 Comments

 
Picture
దేశం నుంచి తొలి మహిళగా రికార్డు
2005లో
హార్వార్డ్‌ ఆధ్యాపక బృందంలోకి
హార్వార్డ్‌లో ఇప్పటికి భారత్‌ 25 మంది
తండ్రి మైసూర్‌లో రైతు, వ్యాపారవేత్త
ఆర్థిక సంక్షోభంలో పలు దేశాల్లో పరిశోధనలు


                            ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అయిన అమెరికాలోని
హార్వార్డ్‌ యూనివర్శిటీలో భారతీయ సంతతి మహిళకు తొలిసారిగా ప్రొఫెసర్‌ హోదా లభించింది. అమెరికాలో నివసించడం గొప్పగా భావించే కాలంలో అక్కడి విశ్వవిద్యాలయాలలో ఆర్ధిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించడం గీతా గోపినాథ్‌కు మంచి అవకాశంగా భావించారు.

                     2010 ఫిబ్రవరిలో జరిగిన ఆర్థిక శాస్త్ర విభాగం కార్యవర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై ఒకటి నుంచిపదాయంలో ఒకసారి ప్రొఫెసర్‌ హోదా లభిస్తే అది జీవితకాలం కొనసాగుతుంది. ప్రస్తుతం గీత ఇంటర్నేషనల్‌ మాక్రో ఎకనామిక్స్‌,పైనాన్స్‌ సబ్జెక్టులను బోధిస్తున్నారు.

విద్య
                   గీతా గోపినాథ్‌ తన ఎకనామిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని ఢిల్లీ లోని లేడి శ్రీరామ్‌ కాలేజీలో, మాస్టర్‌ డిగ్రీని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేశారు. ఆ తర్వాత 2001లో ప్రిన్సటన్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు.2005లో హార్వార్డ్‌ యూనివర్సిటీలో చేరక ముందు వరకు చికాగోభూత్‌స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పని చేశారు.‘ఆమె బ్యాచిలర్‌ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ 1990-91లోనే చవిచూసింది. అసలు సంక్షోభం ఎందుకు సంబవిస్తుందో తెలుసుకోవాలన్న ఆకాంక్షే అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర అధ్యయనానికి కారణమైందన్నారు. గీతా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే ఇంటర్నేషనల్‌ ఎకానమిక్‌ జర్నల్‌ అయిన అమెరికన్‌ ఎకానమిక్‌ రివ్యూకు అసోసి యేట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. మాక్రో ఎకనామిక్స్‌ బోధించడంతో పాటు అంతర్జాతీయ ధరల నియంత్రణ, మార్పిడి ధరల నిర్ణయం, అత్యవసర మార్కెట్‌ వ్యాపారం, ఆర్థికమాంధ్యం తదితర అంశాలపై రిచర్చ్‌ చేశారు.

               గీత రాసిన అనేక ఆర్థిక సంబంధ కథనాలు అమెరి కన్‌ ఎకానమిక్‌ రివ్యూ, త్రైమాసిక ఎకానమిక్‌ జర్నల్‌, రాజకీయ ఆర్థిక జర్నల్‌, రివ్యూ ఆఫ్‌ ఎకానమిక్‌ స్టడీస్‌, ఇంటర్నేషనల్‌ ఎకానమిక్‌ తదితర పుస్తకాలలో ప్రచురితమయ్యాయి.గీతా గోపినాథ్‌ ఎకనామిస్ట్‌గా అర్థికసంక్షోభం సమయంలో గ్రీస్‌, ఐస్‌లాండ్‌లలో పరిశోధనలు చేశారు. ఆ అనుభవమే ఆమెకు ప్రొఫెసర్‌గా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడింది. హర్వార్డ్‌ యూనివర్సిటీలో అతి పెద్ద విభాగమైన ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎంపిక కావడం ఒక ఎత్తయితే ఇప్పటివరకు ఆ హోదాను పొందిన మహిళల్లో మూడవ మహిళ కావడం అందులోనూ భారతదేశం నుంచి తొలి మహిళా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.42 సంవత్సరాలలోనే గోపినాథ్‌ అనేక ఆర్థిక సమస్యలను అనుభవంతో పరిష్కరించింది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభ సమయంలో యూరఫ్‌లో అడుగుపెట్టి అక్కడ తన శక్తి యుక్తులతో సమస్యను గట్టెక్కించడంలో తనదైన పాత్రను ఎంతో సమర్థవంతంగా నెరవేర్చారు. మార్కెట్‌ను అభివృద్ధి దిశలో పయనింప జేయడంలో అనుభవం ఎంతగానో ఉపయోగపడింది.

                  మాక్రోఎకనామిక్స్‌, అడ్వాన్స్‌ ఎకనామి క్స్‌లో ఉన్న అనుభవంతో ముందుగానే సమస్యను అర్థం చేసుకోగలగడం గీతాకు ఉన్న ప్రత్యేకత. దానివల్లే ధరలు, వడ్డీరేట్లకు మధ్య తేడాను గుర్తించి వాటిని పరిష్కరించే దిశలో ఎంతగానో కృషి చేశారని హర్వార్డ్‌ యూనివర్సిటీ ఎకనామిక్స్‌, పబ్లిక్‌పాలసీ ప్రొఫెసర్‌, ఐఎంఎఫ్‌ ఎకనామిస్ట్‌ మాజీ చిఫ్‌ కెన్నిత్‌ రగఫ్‌ అన్నారు. గ్రీస్‌లో జరిగిన దేశాలు-ఆర్థికసంక్షోభం అనే అంశం మీదా జరిగిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్న భారత ప్రణాళిక సంఘం సభ్యులకు గోపినాథ్‌ పలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రణాళికలో ఉన్న లోపాలను సవరించాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉందని కూడా సూచిచారు. ఈ సంక్షోభం భారత్‌ మీదా కూడా ప్రభావం చూపుతుంది. దాదాపు 7 శాతం వరకు లోటు బడ్జెట్‌కు ఇది దారి తీస్తుంది. వాస్తవానికి ఇది అమెరికా మీదా పడే ప్రభావంతో పోలిస్తే చాలా తక్కువ కానీ ఆర్థిక పరంగా మాత్రం ఇండియాకు ఎక్కువే ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారుల మూలంగానే ఎక్కువ ప్రభావితమవుతుంది.

                      ఇండియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ అక్కడ చాలా అవకాశాలున్నాయి. సమస్యను సరైన సమయంలో గుర్తిస్తే పరిష్కరించవచ్చు. ఇది రాజకీయంగా ఎదుర్కొనేది కాదు. మొత్తం మీదా భారతీయ మార్కెట్‌లో ఉన్న లోపాలు ఇతర దేశాలతో పొలిస్తే చాలా చిన్నవనే చెప్పాలి ’అని ఈ సందర్భంగా భారతీయ ఆర్థిక వేత్తల నుద్ధేశించి గీతా అన్నారు. గీతా తండ్రి టీవీ గోపినాథ్‌ మైసూర్‌లో రైతు, వ్యాపారవేత్త. అతను చిన్నతనం నుంచి గీతను ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఎంతోమందిని ఆయన చూసి ఉండడం కూడా దీనికి కారణం.‘నా కూతురు మైసూర్‌లో స్కూల్‌కు వెళ్లేది. అయితే ఢిల్లీలో ఎదుర్కున్నంతగా పోటీ ఇక్కడ ఎదురు కాలేదు. అదే ఆమె విజయానికి కారణం. అలా పోటీని ఎదుర్కొనకపోతే ఈ రోజు హార్వార్డ్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా నియమితురాలు కాకుండేదని తండ్రి వివరించారు. ఆమె వాషింగ్టన్‌ యూనివర్సిటీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది.

                   అయితే తనకున్న ఆర్థిక అవగాహన చాలా అమోఘం. ఆ అనుభవమే ఆమెను ఈ రోజు ఈ స్థాయికి చేర్చింది. వివిధ హోదాల్లో పనిచేసిన గీత 2005 నుంచి హార్వాడ్‌ అధ్యాపక బృందంలో కొనసాగుతున్నారు. తరువాత 2009లో అసోసియేటేడ్‌ ప్రొఫెసర్‌ హోదాను పొందారు. ఎదుగుతున్న మార్కెట్లపై ఆమె ఎంతో కీలకమైన అధ్యయనం జరిపారని ఆయా మార్కెట్లలోని వ్యాపార చక్రాలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం దోహదపడుతుందని హార్వార్డ్‌ విశ్వవిద్యాలయం సోషల్‌ సైన్స్‌ డీన్‌ స్టీపెన్‌ కోస్లిన్‌ అన్నారు.ఒక భారతీయ వనిత అతి చిన్న వయస్సులో అత్యున్నత స్థానంలో నిలవడంతో పాటు ఈ పదవిని అలంకరించిన తొలి భారతీయు రాలుగా కీర్తిని గడించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

                   గోపినాథ్‌ భారత్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తొలుత ఢిల్లీయూనివర్సిటీలో విద్యనభ్యసించారు. గీతకు ముందు నితిన్‌ నోహరియా 10వ డీన్‌గా కొనసాగారు. 102 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలోనే ఒక భారతీయ సంతతి మహిళ ఈ పదవికి ఎంపిక కావడం విశేషం. సుమారు 200 మంది ప్రొఫెసర్లు గల హార్వార్డ్‌ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన వారు కేవలం 25 మంది మాత్రమే ఉండడం గమనార్హం.


0 Comments

సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది

12/24/2013

1 Comment

 
Picture
ఆమెది వెలకట్టలేని ప్రతిభ...
వ్యవసాయ సాగులో ఆమెకు ఆమేసాటి....
కన్న వారి కలలు కొడుకులు మాత్రమే తీరుస్తారని అనుకుంటారు...

                  
కాని కూతుళ్లు కూడా సాకారం చేస్తారని నిరూపించిందో చిన్నమ్మీ. ఆడవాళ్లంటే అబల అని మగాడే ఏదయినా చేయగలడని అంటుంది మనపురుషాధిక్య సమాజం. కాని అది నిజం కాదు అన్నింటిలోనూ మేమున్నామని అనేక సందర్భాల్లో మహిళలు నిలిచిన సంఘటనలున్నాయి. నాట్లేయడం, కలుపుతీయడం, కోతకోయడం, నూర్పిడి చేయడం వంటి పనుల వరకే వ్యవసాయంలో మహిళలున్నారని తెలుసు కాని మహబూబ్‌నగర్‌ జిల్లా తెలకపల్లి మండలంలో ఓ చిన్నమ్మ అరకదున్నడం, విత్తనం సాలు దున్నడం, గుంటక పాయడం, బరువులు మోయడం లాంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు మగపిల్లలు పుట్టలేదనే ఆలోచన రాకుండా చేస్తోంది.

                         మా నాన్నకు నలుగురం ఆడపిల్లలం. నేనే చిన్నదాన్ని. మాది నిరుపేద కుటుంబం. మగపిల్లలు లేనిదే కుటుంబం నిలబడదని మా నాన్న చింతించేవాడు. మా అక్కల పెళ్లి కోసం అప్పు చేశాడు. అప్పులను తీర్చేదారి లేక మా నాన్న మంచం పట్టాడు. ఉన్న నాలుగు ఎకరాల భూమి రెండేళ్లు పడావుపడింది. తినడానికి కూడా తిండి లేక ఉపవాసం ఉండే పరిస్థితి ఉండేది. నాకప్పుడు పద్నాలుగేళ్లు. నాన్న కష్టాలు చూసి ఉండలేకపోయాను. చిన్న వయసు నుండే పొలం పనులకు వెళ్లేదాన్ని మగ సంతానం ఉంటే నాకు కొంతైనా ఆసరా అయ్యేవాడని కుమిలి పోయేవాడు. ఇది చూసి ఉండలేకపోయాను. ఈ పొలం పనులు నేను చేయలేనా నాన్న అంటే.. ఆడపిల్లవు కదా బిడ్డా.. నీకేమొస్తది అంటూ సమాధానం చెప్పేవారు. కాని నాన్న మాటల్లో ఎక్కడో నిరాశ కనిపించింది. ఎలాగైనా వ్యవసాయం చేయాలని నాన్న వెంట ఉండి గమనించాను. మొదట చిన్నచిన్న పనులకు సహాయపడ్డాను. తర్వాత పొలం పనులన్నీ నేనే చూసుకుంటున్నాను అంటూ 19ఏళ్ల చిన్నమ్మ చెప్పింది.

                          తెలకపల్లి మండలం నడిగడ్డలో ఎరుకలి కాశన్న నిరంజనమ్మ దంపతులకు నాలుగో సంతానం చిన్నమ్మ. పెద్ద కూతురు జంగమ్మ, రెండో కూతురు చంద్రకళ, మూడో కూతురు కృష్ణవేణి, నాలుగో సంతానం చిన్నమ్మ. అప్పుచేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేశాడు. చిన్నకూతురుకు ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకున్నారు. వ్యవసాయం, పనులు చేయడానికి తనకు వయసు సహకరించకపోవడం పొలం పనులు చేసేవారు లేక కాశన్న దిగాలు చెందారు. ఇంకా మైనార్టీ తీరని చిన్నమ్మ తండ్రికి అన్నివిధాలుగా సహాయసహకారాలు అందిస్తూ వస్తోంది. ఇక పొలం పనులు అన్నీ చేస్తూ చేదోడువాదోడుగా ఉంటూ వచ్చింది. ఆరేళ్లుగా వ్యవసాయం పనులుచేస్తూ మగరాయుడు అనిపించుకుంటోంది. విత్తనం సాలు నుంచి అచ్చు పనుల వరకు ఆమే చేస్తుంది. పత్తి చేను మనిషిలోతు ఉన్నా గుంటుక కొట్టడంలో ఆమె ఆరితేరింది. అనుభవం ఉన్న వ్యవసాయదారులే పత్తి చేలో గుంటుక కొడితే పత్తి చెట్లను విరగకొడుతారు. చిన్నమ్మ గుంటక పడితే ఒక్క చెట్టు కూడా విరిగిపోకుండా పొలం పనులు చేస్తుంది. కాడెద్దులు సైతం చిన్నమ్మ పిలుపునకు నిలిచిఉంటాయి. పత్తిచేను వేయడానికి అచ్చు గొడితే అవతల కోడి గుడ్డు కూడా కనపడుతుంది. సాలు కొట్టిన విధానాన్ని చూస్తే పెద్ద రైతులు సైతం అబ్బురపడుతారు. ఉదయం ఆరున్నరకు పొలంలోకి వస్తే సాయంత్రం 7 వరకు పొలం నుండి ఇంటికిపోదు. అమ్మ తెచ్చిన సద్ది తిని పొలం పనులు చక్కగా చేసుకుంటుంది. నాలుగు ఎకరాలకు తోడుగా మరింత భూమిని కౌలుకు తీసుకొని పొలం పనులు చేస్తుంది. వ్యవసాయ పనుల్లో ఏనాడు కూడా అలసటకు గురికాలేదు. విత్తనం వేసే అచ్చు కొట్టడమంటే ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఒకే రోజు నాలుగు ఎకరాలు అచ్చు కొడుతుంది. విత్తనాలు వేయడంలోనూ ఆమెది అందెవేసిన చెయ్యే. కరిగెటలో(మడిదున్నడం) ఇరువాలు అయితే ఎకరం, ఒంటిసాలు అయితే రెండు ఎకరాలు దున్నుతానని ఆమె అంటోంది. మోకాళ్లలోతు దిగబడినా ఆమె కరిగెటలో సునాయసంగా గడెం కొట్టగలదు. గొర్రు తోలడంలోనూ ఆమెకు మంచి ప్రావీణ్యత ఉంది. వేసవి కాలంలో కరెంటు లోవోల్టేజీ ఉన్నప్పుడు రాత్రీపగలు నిద్రకాసి నీళ్లు పెడుతుంది. గడెం పనులు పూర్తి అయిన తర్వాత ఎడ్లకు పచ్చిక మేపుతుంటుంది. పశువులకు నీళ్లు తాపడం, మేత వేయడం మొదలుకొని వ్యవసాయ పనులు పూర్తిగా ఆమెనే చేస్తుంది. భుజానికి పంపు వేసుకొని మందు పిచికారి కూడా సునాయసంగా చేస్తుంది. పిండి చల్లడంలో మగవారికంటే ముందు వరసలో ఉంటుంది. పంటపొలాలకు వచ్చే తెగుళ్లను గుర్తించి వాటికి ఏ మందులు వాడాలో కూడా తానే నిర్ణయించి చెబుతుంది. పోయిన ఖరీఫ్‌లో ఒక పత్తిలోనే రూ.80వేల పంటను పండించింది. మిగితా పంటలు మరో రూ.50వేల వరకు పండించింది. ఏ సమయంలో ఏ పంటలు వేయాలో కూడా ఆమెకు తెలుసు. రెండేళ్ల క్రితం రూ.5లక్షలు అప్పు ఉన్న ఆ కుటుంబానికి ప్రస్తుతం ఎలాంటి అప్పు లేదు.

ఎత్తిపొడుపుల మాటలు భరించాను : చిన్నమ్మ
                              నేను గడెం పట్టి వ్యవసాయం చేస్తుంటే మగరాయుడు అంటూహేళన చేసేవారు. తాత, అవ్వ, వదిన వరస ఉన్న వారయితే అనేక రకాలుగా మాటలనేవారు. ఏందే మొగోనిలా గడెం దున్నుతున్నవ్‌ అనేవారు. కుటుంబం కోసం ఎవరెన్ని అన్నా భరించాను. వ్యవసాయ పనులు చేయడంలో నాకు సంతోషం తప్ప ఏనాడు బాధ లేదు. కొన్నిసార్లు పొలం పనులకు కొంతమంది ఆటంకం కలిగించేలా చేశారు. అయినా అదరలేదు బెదరలేదు. పొలం పనులు చేసుకుంటూ ఇంటి పనులు కూడా సులభంగా చూసుకునేదాన్ని. పొలంలో ఏనాడు కూడా యంత్రాలు ఉపయోగించలేదు. నేనే స్వయంగా పొలం పనులు అన్నీ చేసుకునేదాన్ని. యంత్రాలు అయితే ఖర్చవుతుంది. చేతిలో చిల్లి గవ్వలేదు. అందుకే పొలం పనులు అన్నీ నేనే స్వయంగా చేసేదాన్ని.

మగ బిడ్డలేని లోటు తీర్చింది : కాశన్న, తండ్రి
                      తనకు మగబిడ్డలు లేని లోటును నా చిన్న కూతురు చిన్నమ్మ తీర్చింది. మగ పిల్లలు చేసే పనులన్నీ చిన్నమ్మ చేస్తుంది. ఆమె పనులు చూసి చాలా సంతోషంగా ఉన్నాను. పొలం పనులు చేయాలంటే తనకు సత్తువ ఉండేది కాదు. రెండేళ్లు భూమిని పడావుపెట్టాను. ఇప్పుడు తన భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని చేస్తున్నార. నాకు సపోర్టుగా నా కూతురు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా బిడ్డకు ఇల్లరికం పెట్టుకుంటున్నాను. అల్లుడు బిడ్డా సుఖ సంతోషాలతో ఉండటమే నాకు కావాల్సింది.

చిన్నమ్మను చూసుంటే సంతోషంగా ఉంటుంది అంటారు ఇరుగుపొరుగు వారు.

                      మగవారు సైతం వ్యవసాయంలో నానాతంటాలు పడుతుంటే చిన్నమ్మ వ్యవసాయ పనులన్నీ చకచకా చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఆడ వ్యవసాయంలో ఆరితేరిన వారికంటే అన్ని రకాలుగా సాగు చేయడం ఆమెకు ఆమెనే సాటి. ఏంటమ్మా సాగు చేస్తుంటే ఎవరైనా ఎత్తిపొడుపు మాటలు అన్నారా అంటే.. ఎన్నో అన్నారు.. వారే నోరు మూసుకున్నారు.. అనడం ఆమె నిబద్ధతకు నిదర్శనం.

1 Comment

మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం

12/17/2013

0 Comments

 
Picture
                        ఆమె పుట్టుకతో అంధురాలు. అంధత్వం ఆమెకు కేవలం శారీరక వైకల్యమే. ఆమె జీవనగమనానికి అదెక్కడా ఆటంకంగా అనిపించలేదు. ఆమె మనో నేత్రమే జీవితనౌకకు ఆలంబనగా నిలిచింది. ఐదు పదుల జీవితాన్ని మానసిక ధైర్యంతో ఆమె మున్ముందుకు నడిపిస్తోంది. ఎవరి ఆసరా అవసరం లేకుండా నే జీవనసాగరాన్ని ఒంటి చేత్తో ఈదడం ఆమెలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత.
 
                       ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనురాలి జీవనరేఖ ఇది. ఆమె పేరు పొలమంచి సింగమ్మ. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. భర్త చేయి పట్టుకొని వెళ్ళే అదృష్టం లేదు. అయినా అన్నిపనులూ చలాకీగా చేసుకుంటుంది. ఊళ్ళో కొందరి ఇళ్లలో అంట్లు తోమి నెలకు మూడువందలు సంపాదిస్తోంది. ప్రభుత్వం అందించే ఐదువందలు పెన్షన్‌గా అందుతోంది. ఈ ఎనిమిదివందలతో నెలరోజులపాటు జీవనం సాగిస్తోంది. పూటగడవని రోజు పస్తులుంటుంది. ఎవరి సహాయం లేకుండానే స్వయంగా కూరగాయలు కోస్తుంది.

                      అన్నం వండుకుం టుంది. చేరువలోని కుళాయి నుండి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. తన ఇంటిని తానే శుభ్రం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కాళ్ళ స్పర్శతో దారులను గుర్తుపెట్టుకొని నడుస్తుంది. ఒకసారి మాట వింటే చాలు ‘‘ఏం బాగున్నావా!’’ అంటూ పేర్లతో  పలకరిస్తుంది. కళ్ళు లేని లోటుతప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.ఊళ్ళో ఏ ఇంటికైనా సులువుగా వెళ్ళిపోతుంది సింగమ్మ. బయటి ఊరికి ఎప్పుడూ వెళ్ళలేదు. ‘‘నాకు ఏ ఊర్లు తెలియదయ్యా. నా ఊరుదాటి వెళ్ళలేనయ్యా...’’ అని చెబుతుంది.
 
 ఒంటరి పయనమే...
                     ఆది నుండి సింగమ్మది ఒంటరి జీవన ప్రయాణమే. మేడేపల్లి గ్రామానికి చెందిన పొలమంచి రాజులు బుల్లెమ్మలకు మొత్తం ఐదుగురు సంతానం వెంకమ్మ, పాపమ్మ, రామమ్మ, కన్నమ్మ, సింగమ్మలు. మగసంతానం లేదు. అందరిలో సింగమ్మ చిన్నది. తోబుట్టువులు నలుగురికి వివాహాలు అయిపోయాయి.
 
                      తల్లిదండ్రులు ఉన్నంతకాలం సింగమ్మను కంటికిరెప్పలా చూసుకున్నారు. ఆమెకు 12 ఏళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం గ్రామంలో రోజుకో ఇంటివాళ్ళు అన్నం పెడితే తిని, పొట్ట నింపుకునేది. తన వాటాకు రావలసిన ఎకరం పొలం ఆమెకు దక్కలేదు. పొలానికి వచ్చే కౌలు కూడా అందలేదు. ఓ గ్రామస్థురాలు దయతో ఇచ్చిన పూరిగుడిసే ఆమెకు నిలువనీడ అయింది. ఆ గుడిసెలో ఒంటరిగా జీవిస్తోంది. సింగమ్మ జీవితం చూస్తే... మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మహానుభావుడి మాటలు గుర్తుకు వస్తాయి.
 
 నాకెవ్వర్ లేరయ్య...!
                      నా అనే వాల్లు ఎవరూ లేరయ్య... దేవుడే దిక్కు. నావాళ్లందరూ ‘వెల్లిపో గుడ్డిదానా అంటారయ. నా వాటా భూమి లాగేసుకుంటిరయ్య’ అని కళ్ళ నీళ్ళు తెచ్చుకుంది సింగమ్మ.
 
                     అన్ని అవయవాలూ ఉన్నవారు సైతం ఏ పనీ సరిగా చేసుకోని ఈ రోజుల్లో సింగమ్మను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అయినవారు అన్యాయం చేసినా, దేవుడు చిన్నచూపు చూసినా ఆమెలోని ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలలేదు. తన పని తాను చేసుకోవడమే కాకుండా, ఇతరులకూ సహాయపడుతోంది. తిండి కోసం ఎవ్వరి మీదా ఆధారపడకుండా, తన జీవనానికి కావలసిన ధనం తానే సంపాదించుకుంటోంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

0 Comments

నవయువం : పరదేశంలో చదువు మనదేశంలో సేవ

12/1/2013

0 Comments

 
Picture
                      విద్యార్థి దశలోనే సమాజ హితం కోసం కృషి చేస్తోంది మోనికా బాడ్. పుట్టింది, పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం మోనిక 12వ తరగతి చదువుతోంది. స్వదేశంలో, విదేశాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
                       విజయవాడకు చెందిన యాన్ ఫణి బాడ్, విజయ దంపతులు గత 27 ఏళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని శాన్‌హొజేలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురే మోనికా బాడ్.
 

 చిన్న నాటి నుంచే...
                  చిన్నతనం నుంచే మోనికలో సేవాదృక్పథం ఉండేది. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించాలనే తపన ఆమెలో కనిపించేది.
 
                       ‘‘మోనిక రెండేళ్ల వయస్సులో  ఇండియాకు వచ్చాం. చెన్నై రైల్వేస్టేషన్‌లో తనకు బిస్కెట్లు ఇస్తే తీసుకువెళ్లి ప్లాట్‌ఫామ్‌పై బిక్షం ఎత్తుకుంటున్న చిన్నారులకు ఇచ్చింది, ‘‘వారు ఆకలి అంటున్నారు అందుకే ఇచ్చా..’’ అంటూ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’’ అని మోనిక తల్లి విజయ బాడ్ చెప్పారు.
 
  దత్తత తీసుకుంది...
                           మోనిక విద్యనభ్యసిస్తున్న వ్యాలీ క్రిస్టియన్ హైస్కూల్‌లో నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థ్ధీ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ నిబంధన ఆమె లోని సామాజిక సేవాకార్యకర్తకు మరింత ప్రోత్సాహం లభించేలా చేసింది. దీంతో పాఠశాల పరిసరాలు, నగరంలోని పలుప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘వరల్డ్ విజన్’ సంస్థ చిన్నారులకు సాయం అందించేందుకు పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఏడేళ్ల కోబితా దాస్‌ను దత్తత తీసుకుంది మోనిక. కోబితా దాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో చదువుకుంటోంది. దాస్ చదువుకు అవసరమైన ఖర్చును మోనికానే భరిస్తోంది. ఇందుకు ప్రతినెలా 30 డాలర్లు కోబితాకు పంపుతోంది.
 
 ఉపకార వేతనంతో సేవ...
                          సామాజిక సేవాకార్యక్రమాలకు తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకున్న డబ్బును కాకుండా, తనకు లభించిన ఉపకార వేతనాలనే వెచ్చిస్తుంది మోనిక. పాఠ్యాంశాల్లో ప్రతిభ చూపటం ద్వారా  లభించిన ఉపకార వేతనాలను సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంది. మోనిక, ఆమె తల్లిదండ్రులు విజయ, ఫణి బాడ్‌లు విజయవాడ వచ్చిపోయే క్రమంలో నగరంలో నడుపుతున్న చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఆవాసం పొందుతున్న విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో నృత్యం మొదలు రకరకాల క్రీడలు నేర్పటంతో పాటుగా, వారికి అవసరమైన దుస్తులను అందించేవారు. ఇందుకోసం  మోనిక తన పాఠశాలలోని మిత్రుల సాయంతో దుస్తులు, క్రీడాసామగ్రి, మందులు సేకరించి చిన్నారులకు అందిస్తోంది. మోనికా చేపట్టే ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలోనూ ఆమె తల్లిదండ్రులు కూడా భాగస్వాములవుతూ కుమార్తెకు  సహకరిస్తున్నారు.
   
 నూతన క్రియేషన్స్‌తో...
                           తాను చేపట్టిన సామాజిక సేవాకార్యక్రమాలను విస్తరించే పనిలో భాగంగా  గత ఏడాది సొంతంగా ‘నూతన క్రియేషన్స్’ను ప్రారంభించింది మోనిక. నేటితరం అభిరుచులకు అనుగుణంగా ఉన్న ఫ్యాన్సీ నగలను ప్రదర్శించి, వాటి విక్రయాలద్వారా వచ్చిన డబ్బుతో సేవాకార్యక్రమాలను విస్తరింపచేయాలనే ఆలోచనతో మోనిక ఈ వ్యాపారసంస్థను స్థ్ధాపించింది.
 
 నానో టెక్నాలజీ క్లబ్‌తో...
                                నానో టెక్నాలజీ క్లబ్ మెంబర్ అయిన మోనిక అంతర్జాతీయ స్పేస్ టీమ్‌లో సభ్యురాలు కూడా. అతి తక్కువ ప్రదేశంలో వ్యాయామం చేసేందుకు ఉపకరించే కంప్రెషన్ కూలింగ్ టెక్నాలజీని కనుగొనేందుకు సాగే పరిశోధనా బృందంలో కూడా ఆమె ఉంది. చదువు, పరిశోధనలతో పాటుగా బాస్కెట్ బాల్ కెప్టెన్‌గా క్రీడల్లోనూ రాణిస్తోంది మోనిక.
 
 ఆంకాలజిస్ట్ కావాలని...
                   విదేశంలో ఉన్నా స్వదేశం పట్ల ఉన్న ఆపేక్షతో అక్కడా, ఇక్కడా  సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోనిక ఆంకాలజిస్ట్ కావాలనేది తన లక్ష్యమని చెబుతోంది.
 
                        ‘‘క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి, దానిని నిరోధించకపోవటంతో అనేక ప్రాణాలు పోతున్నాయి. దీనివల్ల కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి. ఈ సమస్య నుంచి మనిషిని కాపాడాలి. క్యాన్సర్‌ను నిరోధించటంతో పాటుగా, గ్రామీణపేదలకు మెరుగైన వైద్యం అందించాలనేది నా ఆకాంక్ష’’ అంటోంది మోనిక.

0 Comments

స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం

11/24/2013

0 Comments

 
Picture
ఏ అమ్మాయీ తనకై  తాను ఇల్లొదిలి వచ్చేయదు.
 ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు.
 ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు.
 ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు.
 ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు.
 మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా....
 తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి.
 కానీ ఇలాంటి అమ్మాయికి...
 దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి...
 తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు.
 కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు.
 ఎవరి భయం వారిది. ఎవరి కారణాలు వారివి.
 అయితే జయశ్రీ భయపడలేదు.
 ఏ కారణమూ ఆమెను వెనుకంజ వెయ్యనివ్వలేదు.
 ఇల్లొదిలొచ్చిన పిల్లెవరైనా మా ఇంటి పిల్లే అని...
 పట్టెడన్నం పెడుతోంది. పచ్చని జీవితాన్నీ ఇస్తోంది.
 వంచితులకు ఆమె పంచుతున్న అనురాగం, ఆత్మవిశ్వాసమే.....
 
                    తమ వాళ్ల నుంచి తప్పిపోయినవారు, ట్రాఫికింగ్ నుంచి తప్పించుకున్నవారు, వంచనకు గురయినవారు, వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారు... ఇలా రకరకాల కారణాలచేత సమాజానికి దూరమై ఏం చేయాలో పాలుపోని ఒంటరి స్త్రీలకు కరీంనగర్‌లోని ‘స్వధార్‌హోమ్’ కొండంత అండగా నిలుస్తోంది. వారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు పచ్చటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తోంది. ‘బాధిత స్త్రీల పునరావాస కేంద్రం’ పేరుతో ఉన్న ఈ హోమ్‌ని నడిపిస్తోన్న జయశ్రీ ‘ప్రకృతి’ అనే స్వచ్ఛందసంస్థలో భాగంగా ఎనిమిదేళ్లక్రితం స్వధార్ హోమ్‌ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి బాధిత స్త్రీలకు అండగా నిలుస్తూ... వారికి ఆత్మవిశ్వాసం కలిగించి, సమాజానికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తున్నారు.
 
 ‘ప్రకృతి’ నీడలో...
 
                    సమాజం పంచభూతాలకు అండగా నిలబడకపోతే ప్రకృతి పచ్చగా ఉండలేదంటారు జయశ్రీ. అందుకే మొక్కలు నాటడం వంటి పనులతో పచ్చదనాన్ని పోషిస్తూనే... 1997లో ‘ప్రకృతి’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి, మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి శిక్షణల కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో నడుస్తోన్న స్వధార్ హోమ్‌ని తన సొంతిల్లులా భావించి బాధిత మహిళలకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

                 ‘‘స్వధార్ హోమ్‌లో ఒక్కో మహిళది ఒక్కో కష్టం. వారిని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, సమస్యల్ని ఎదుర్కొనేలా కూడా తీర్చిదిద్ది, కొత్త జీవితాలివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 350 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం హోమ్‌లో 50 మంది మహిళలున్నారు. వీరిలో పదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసువారున్నారు’’ అంటూ తమ సంస్థ గురించి వివరించారు జయశ్రీ. లా చదివిన జయశ్రీకి విద్యార్థి వయసు నుంచే సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ, ‘ప్రకృతి’ అనే ఎన్‌జీవోని నడుపుతున్నారు.
 
 ఆశ్రయంతో పాటు...
 
                        ‘‘2005లో స్వధార్ హోమ్ స్థాపించాక... దాని గురించి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే... ఆ అవసరం లేకుండానే బాధిత మహిళలు ఒక్కొక్కరుగా హోమ్‌కి రావడం మొదలుపెట్టారు. అత్యాచారానికి గురైన ఓ నలుగురు అమ్మాయిలకు ఇక్కడే ఆశ్రయం కల్పించాం. వారిలో ఇద్దరు... తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ఇంకో అమ్మాయి కూరగాయల షాపు పెట్టుకుని తన బతుకు తాను బతుకుతోంది.
 
                        అత్తింటి వేధింపులు భరించలేక మా హోమ్‌కి చేరుకున్న మహిళలకు, ఆమె భర్త, అత్త్తమామలకు కౌన్సెలింగ్ చేయడం... ఉమ్మడి కుటుంబంలో కాపురం కష్టమనుకుంటే మేమే దగ్గరుండి వేరు కాపురం పెట్టించడం, అయినా భర్త నుంచి బాధలు తప్పడం లేదంటే మా హోమ్‌లోనే కొన్నాళ్లు ఉంచి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఏదైనా వృత్తిశిక్షణ ఇప్పించడం వంటి పనులు చేస్తున్నాం. భర్త చనిపోయిన మహిళల్లో కొందరు... అందరూ ఉన్న అనాథల్లా ఉన్నారు. వీరినే కాదు, పట్టెడన్నం పెడితే చాలంటూ వచ్చే వృద్ధులను కూడా స్వధార్ హోమ్ అక్కున చేర్చుకుంటోంది. ఏదో ఒక పనిచేసుకుని బతికే ఓపిక ఉన్నవారితో వారికిష్టమైన పనిచేయిస్తున్నాం. అలా ఓ నలుగురు వృద్ధులు ఇక్కడే కూరగాయలు అమ్మి పొట్ట పోసుకుంటున్నారు’’ అంటూ తన హోమ్‌కి వచ్చిన మహిళల గురించి చెప్పారు జయశ్రీ.
 
 చదువు... ఉపాధి...
 
                     స్వధార్ హోమ్‌లో పెద్దవాళ్లే కాదు, విద్యార్థులు సైతం ఉన్నారు. ‘‘తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలతోపాటు విద్యార్థి వయసులోనే ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే చిన్నపిల్లలను ఏళ్ల తరబడి మా దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి, వారికి దారి చూపించడం కొంచెం కష్టమైన పనే. నిజానికి స్వధార్ హోమ్ గైడ్‌లైన్స్ ఏంటంటే... ఇక్కడికి వచ్చిన బాధిత మహిళలు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ ఉండొచ్చు. ఆ లోపు వారికి ఉపాధిమార్గం చూపించి బయటికి పంపేయాలి. పిల్లలు చదువులో పడ్డాక వారు సెటిల్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. వారిని మధ్యలోనే మీ దారి మీరు చూసుకోండంటే ఎక్కడికి వెళతారు? అందుకే మేం ఆ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వడంలేదు. ఇన్ని నెలలు... ఇన్ని సంవత్సరాలు అనే నిబంధనలు పెట్టుకోకుండా వచ్చినవారి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం.
 
                          ఇక్కడ మీకు ఒక కేసు వివరాలు చెబుతాను... స్వప్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఏడోతరగతిలో ఉండగానే మేనమామ మహారాష్ట్రకు చెందిన ఓ నలభైఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశాడు. అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయిని అతను మరోవ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే విషయం అర్థం చేసుకున్న స్వప్న వెంటనే కరీంనగర్‌లో ఉన్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఆ ఊరి సర్పంచ్‌కి తెలియజేస్తే అతను మా చెవిన వేశాడు. మేం పోలీసుల సాయంతో మహారాష్ర్ట నుంచి మా హోమ్‌కి రప్పించుకుని, స్కూల్‌లో చేర్పించాం. ప్రస్తుతం తను నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. కొంత ప్రభుత్వసాయం, కొందరు దాతల చేయూతతో హోమ్‌ని నడుపుతున్నాం. ఇక్కడికి వచ్చే బాధిత మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో హోమ్ కెపాసిటి పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాను’’ అని ముగించారు జయశ్రీ.
 
                  ఆ హోమ్‌కి వెళ్లేంతవరకే బాధ. అక్కడున్న మహిళల సమస్యలు తెలుసుకున్న తోటివారు తమ బాధల్ని మరిచిపోతారు. కాని హోమ్ నిర్వాహకులకు మాత్రం ఒక్కో మహిళా ఒక్కో ఛాలెంజ్. లేదంటే వారి సమస్యల్ని పరిష్కరించి వారిని తిరిగి మళ్లీ జీవితంలో స్థిరపర్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పూటకు ఆశ్రయం కల్పించమని వచ్చిన మహిళలకు భరోసా గల భవిష్యత్తుని ఏర్పాటుచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం.

0 Comments

ఖేల్ రత్న  కుంజరినీ దేవి

11/18/2013

0 Comments

 
Picture
1997లో రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న  అవార్డు
యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు
1990లో అర్జున అవార్డు
ప్రస్తుతం సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ నందు అసిస్టెంటు కమాండెంట్‌

ఇండియన్‌ వెరుుట్‌ లిప్టింగ్‌లో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి కుంజరిని. కుంజరిని మార్చి 1,1968లో మణిపూర్‌ లోని ఇంపాల్‌ నందు గల ెకైరంగ్‌ మయై లేఇెకై నందు జన్మించారు. 1978 ఇంపాల్‌లోని సిండం సిన్శాంగ్‌ రెసిడెంట్‌ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడల పట్ల ఆకర్షితురాలైనది. ఇంపాల్‌లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత ఆమె సమయమంతా వెరుుట్‌ లిఫ్టింగ్‌ నందు ేకటారుుంచినది. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్‌ కమాండెంట్‌గా సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.1996 నుంచి 1998 వరకు రక్షకదళాధిపతిగా క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించినది.

ప్రొఫైల్‌

పేరు       : కుంజరని దేవి
జన్మించినది    : 1 మార్చి, 1968
స్థలం        : మణిపూర్‌,
            భారతదేశం
ప్రాముఖ్యత    : రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న
వృత్తి        : వెయిట్‌ లిఫ్టింగ్‌
            క్రీడాకారిణి



క్రీడా చరిత్ర



  • 1985వ సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల యందు 44 కిలోల, 46 కిలోల చివరగా 48 కిలోల విభాగంలో ఎక్కువగా బంగారు పతకాలు సాధించింది. 1987లో త్రివేండ్రంలో జరిగిన పోటీలలో 2 రికార్డులు నెలకొల్పింది. 1994లో పూణేలో జరిగిన పోటీలలో మొదటిసారిగా 46 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది, తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మణిపూర్‌లో జరిగిన పోటీలలో 48 కిలోల విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
  • 1989లో మాంచెస్టర్లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు కైవసం చేసుకోవడం ఆమెలో ఆత్మస్థైర్యం నింపింది. అప్పటినించి 1993 మేల్బోర్ను పోటీలు మినహా వరుసగా ఏడుసార్లు జరిగిన ప్రపంచపోటీలలో పాల్గొన్న ప్రతిసారి బహుమతి సాధించింది. కానీ ప్రతిసారి వెండిపతకంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
  • 1990లో బీజింగ్‌,1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజతపతకాన్ని సాధించింది. కానీ 1998లో జరిగిన ఆసియా క్రీడలలో పతక సాధనలో విఫలమైంది.
    అదృష్టవశాత్తు కుంజరిని ఆసియా ఖండపు వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల యందు పలు పతకాలు సాధించింది.1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక వెండి, రెండు రజత పతకాలు గెలిచింది. అంతేకాకుండా 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించినది. తరువాత 1992లో థాయిలాండ్‌, 1993లో చైనా పోటీలలో తన రెండవ స్థానాన్ని సంపాదించుకుంది.

  • 1995లో దక్షిణకొరియా పోటీలలో 46 కిలోల విభాగంలో అత్యుత్తమమైన ఆటతీరుతో రెండు బంగారు, ఒక రజతపతకం సాధించింది. కానీ 1996లో జపాన్‌ లో జరిగిన పోటీలలో రెండు వెండి, ఒక రజత పతకంతో సరిపెట్టవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆటపై ఉన్న ఇష్టంతో పతకాలు సాధించగలిగారు. జాతీయ, అంతర్జాతీయంగా పతకాలు సాధించడమే కాకుండా మహిళలకు మరింత స్ఫూర్తిగా నిలిచారు. అంతర్జాతీయంగా ప్రదర్శన చేసేటప్పుడు అనేక సమస్యలు వచ్చేనా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగారు.

    వివాదం
    కుంజరిని దేవి 2001లో నిషేదించిన ష్టిరాయిడ్స్‌ వాడినట్లుగా రుజువైనందున 6 నెలలపాటు తాత్కాలిక నిషేధానికి గురయినది. వివాదం అనంతరం అనేక విజయాలతో ఆమె పై ఉన్న వివాదాలు అణగారిపోయాయి. వివాదాలనంతరం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు.

    ప్రస్తుత పరిస్థితి
    కుంజరిని ప్రస్తుతం సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ నందు అసిస్టెంటు కమాండెంట్‌గా పనిచేయుచున్నది. క్రీడల విరమణ నుంచి ఇప్పటివరకు ఇదే ఉద్యోగం రాణిస్తున్నారు. ఇండియన్‌ వెయిట్‌ లిప్టింగ్‌లో భారతీయ క్రీడాకారిణిగా అనేక విజయాలు నమోదు చేసుకున్నారు. దీంతో అనేక మంది మహిళలు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.

    గుర్తింపు
  • 1990లో ఆమెను అర్జున అవార్డు, లియాండర్‌ పేస్‌తో కలిపి 1996-1997లో రాజీవ్‌ గాంధీ ఖేల్త్న్ర అవార్డులు వరించాయి. అదే సంవత్సరం ఆమె కే.కే బిర్లా అవార్డు గెలుచుకుంది.
ఆమె ఖాతాలో యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. 2006 మెల్బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పింది.


0 Comments

పరుగుల షైనీ

11/16/2013

0 Comments

 
Picture
1991లో చైనీస్‌ జర్నలిస్ట్‌ అవార్డు
1998లో పద్మశ్రీ, 1985లో అర్జున అవార్డు
అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున 75 సార్లు పోటీ
ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీలలో అరుదైన రికార్డు

                 చిన్నప్పటి నుంచి క్రీడలలో రాణించాలని పట్టదల ఉండేది. అదే పట్టుదలతో రాణించి దేశం గర్వించే విధంగా జాతీయ, అంతర్జాతీ చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు సొంతం చేసుకుంది షైనీ. ఆమె అత్యుత్తమ క్రీడా ప్రదర్శనకు ేకంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులతో సత్కరించింది. ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీల నుంచి వరుసగా ఆరుసార్లు ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏెకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

                        1965, మే 8న జన్మించిన షైనీ అబ్రహం, భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్‌ క్రీడాకారిణి. 800 మీటర్ల పరుగు పందెంలో ఆమె 14 సంవత్సరాలపాటు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై 75 సార్లకు పైగా భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 1985 లో జకర్తాలో జరిగిన ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీల నుంచి వరుసగా 6 సార్లు ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ సమయంలో ఆమె 7 బంగారు పతకాలను, 5 వెండి పతకాలను, 2 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఇతర చాంపియన్‌ షిప్‌లలో ఆమె పాల్గొన్న 7 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడలలో 18 బంగారు, 2 వెండి, పతకాలను సాధించింది.

క్రీడా జీవితం
                     షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలతో వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్‌ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్‌ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆమె 4 ఒలింపిక్‌ క్రీడలతో పాటు 3 ఆసియా క్రీడలలో పాల్గొంది. 1984లో లాస్‌ ఏంజిల్స్‌ లో జరిగిన ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 1986లో సియోల్‌ లో జరిగిన ఆసియా క్రీడలలో పరుగు పందెంలో తన ట్రాక్‌ లైన్‌ను దాటినందుకు అనర్హత పొందింది. ఆమె ఆ సమయంలో పతకం సాధించే దిశలో ఉండింది.

                 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకొని ఒలింపిక్‌ క్రీడల మార్‌‌‌‌చఫాస్ట్‌ లో జాతీయ పతాకాన్ని పట్టిన తొలి భారతీయ మహిళగా పేరు సంపాదించింది. ఆమె సాధించిన అత్యుత్తమ ప్రతిభ 1:58.8 నిమిషాలు. దీన్ని 1995లో చెన్నైలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో నమోదు చేసింది. ఆమె ఆ సమయంలో తన కూతురు శిల్పాకు జన్మనిచ్చింది. అయినా మెరుగైన సమయాన్ని నమోదు చేయడం విషేశం. రెండు నిమిషాల లోపు సమయాన్ని నమోదుచేయడం కూడా ఇదే ప్రథమం.

వ్యక్తిగత జీవితం
         
షైనీ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత అయిన చెరియన్‌ విల్సన్‌ ను వివాహం చేసుకుంది. అతడు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌ (క్రీడల)గా పనిచేస్తున్నాడు.

ప్రారంభ జీవితం
                   షైనీ అబ్రహం 1965, మే 8న కేరళలోని ఇడుక్కి జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్‌ పై మక్కువ ఉన్ననూ కొట్టాయంలోని స్పోర్ట్‌‌స డివిజన్‌ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైనీ అబ్రహం, పి.టి.ఉష, ఎండి.వల్సమ్మలు ఒకే డివిజన్‌ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్‌ పి.జె.దేవెస్లా.

అవార్డులు

  • షైనీ అబ్రహంకు 1985లో క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు లభించింది.
  • 1996లో షైనీకు బిర్లా అవార్డు లభించింది
  • 1998లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది.
  • 1991లో చైనీస్‌ జర్నలిస్ట్‌ అవార్డు లభించింది.

0 Comments

ఆటో కుమారి

11/14/2013

0 Comments

 
Picture
           రోడ్డుకు గతుకుపూంత సహజమో... జీవితంలో ఒడిదుడుకులు కూడా అంతే! వాహనం నడిపేటప్పుడు... వీథి మలుపులను, స్పీడ్‌వూబేకర్లను దాటితేనే గమ్యాన్ని చేరుతాం... బతుకు బాటలో కన్నీళ్లు, కష్టాలను అధిగమిస్తేనే... విజయంతో నిలుస్తాం... అక్షరం రాకున్నా.. చేతిలో ఉన్న పనిని నమ్ముకుంది... జీవన పోరాటంలో రోజూ ఎన్నో వ్యూహాలను ఛేదిస్తోంది... ఆటోడ్రైవర్‌గా రాణిస్తూ... సాటి మహిళలకు స్ఫూర్తినిస్తోంది కరీంనగర్‌కి చెందిన రాజకుమారి.

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో.. తెలంగాణ ఎక్స్‌వూపెస్ కూత పెట్టుకుంటూ స్టేషన్‌ని చేరుకుంది.

                        పెద్దపల్లి నుంచి యైంటిక్లయిన్ కాలనీ వెళ్లే ఆటోలు వరుసగా బారులు తీరి ఉన్నాయి. ఆ దారి అధ్వాన్నంగా ఉంటుంది. అందుకే అటు వైపు తక్కువ ఆటోలు వెళతాయి. ఆటోడ్రైవర్‌లంతా వచ్చే ప్రయాణికుల కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో కుమారి కూడా ఉంది. అక్కడి డ్రైవర్‌లు ముందు కుమారి ఆటో నిండిన తర్వాతే తమ ఆటోలోకి ఎక్కించుకుంటారు ప్రయాణికులని. అక్కడి నుంచి ఆమె ప్రయాణం మొదలవుతుంది. అలా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కనీసం నాలుగు ట్రిప్పులు వేస్తుంది. ఆరు సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ఆమె సుపరిచితురాలు. ఆమె పేరులోనే రాజరికం ఉంది, కానీ ఆమె మాత్రం పేదరికాన్ని అనుభవిస్తున్నది. మగవాళ్ళకు ఏ మాత్రం తీసిపోకుండా తన సత్తాను చాటుతోంది. ఆటోడ్రైవర్ అంటే మగవాళ్లే అన్న మాటను కుమారి తిరగరాసింది. జిల్లాలోనే మొదటి ఆటోడ్రైవర్‌గా డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా పొందింది. త్వరలో హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకొని బస్సు స్టీరింగ్ తిప్పాలని కలలు కంటోంది.


అక్షరాలు నేర్వలేదు..
                రాజకుమారి సొంత ఊరు కేరళలోని కొల్లెం. ఆమెకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే కుటుంబమంతా బతుకుదెరువు కోసం కరీంనగర్‌జిల్లాలోని యైంటిక్లయిన్ కాలనీకి చేరుకుంది. కుమారికి ఒక తమ్ముడు. ఆ కుటుంబం ముందు చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆ తర్వాత తల్లిదంవూడులు ఒక చిన్న హోటల్ పెట్టారు. అందులో వాళ్ళకు చేదోడువాదోడుగా ఉండేది కుమారి. దాంతో బడి బాట పట్టలేదు. పైగా ‘ఆడపిల్లలకు చదువు అవసరం లేదు’ అంటూ తల్లిదంవూడులు అనడంతో ఆ ఊసే ఎత్తలేదామె. ఆమెకు చదువు మీద మాత్రం చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఖాళీ దొరికినప్పుడు పక్కింటి పిల్లల దగ్గరకు వెళ్ళి చదువు చెప్పమనేది. వాళ్ళు అక్షరాలు దిద్దుతుంటే చూసేది. అలా వాళ్లు చెప్పిన అక్షరాలను గుర్తుంచుకొని గోడల మీద పేర్లు, కరపవూతాలు చదవడం మాత్రం నేర్చుకుంది. కానీ రాయడం మాత్రం ఇప్పటికీ తెలియదు.

                     కుమారి తండ్రి దగ్గర చిన్న లూనా ఉండేది. ఆమెకు ముందు నుంచే కాస్త దూకుడెక్కువ. చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత చురుగ్గా ఉండేది. ఆ లూనా వేసుకొని కాలనీ అంతా చుట్టేది. అలా ద్విచక్ర వాహనం నడపడం అలవాటైంది. ఏవైనా పనులు చేయాలంటే బండి చేతికి ఇస్తేనే చేసేది. ఈ దూకుడుకు కల్లెం పడింది గోపీ పరిచయంతో. కుమారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేవాడు అతను. వాళ్ళది కూడా ఎక్కడి నుంచో వచ్చి జీవనం సాగిస్తున్న కుటుంబం. అతని తండ్రికి ఎస్టీడీ బూత్ ఉండేది. అందులోనే ఉండేవాడు ఆ అబ్బాయి. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు చెబితే ముందు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత వీళ్లు పట్టుబట్టడంతో ‘ఊ’ అనక తప్పలేదు వాళ్లు. అలా పదమూడేళ్ళకే సంసార జీవితంలోకి అడుగుపెట్టింది కుమారి.

ఆటో ప్రయాణం..
                       చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నా పెద్దగా అవి ఆమెను బాధించలేదు. కానీ పెళ్ళయ్యాక ఏ ఉద్యోగం లేని భర్త, పైగా పెద్దలు వద్దన్నా చేసుకున్న పెళ్ళి కావడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే భర్త ఆటో నడపడం మొదలుపెట్టాడు. కుమారి తల్లిదంవూడుల హోటల్లోనే పనిచేసేది. అలా కొన్ని సంవత్సరాలు జీవనాన్ని సాగించారు. కానీ అరకొర డబ్బులతో సంసారం కష్టమైపోయింది. అందుకే ఇనుప సామాన్ల దుకాణం పెట్టారు. అదీ వాళ్ళకు అచ్చిరాలేదు. ఆ దందాలో భర్త జైలుకు కూడా పోయాడు. ఆ సమయంలో ఎవ్వరూ వాళ్ళని ఆదుకోలేదు.

                        ఆ క్షణమే ఏమైనా చేయాలనుకుంది. కానీ ఏమీ చేయలేని నిస్సత్తువ. దాదాపు మూడు సంవత్సరాలు భర్తకు దూరంగా బతికింది. ఆ సమయంలోనే తల్లి కూడా చనిపోవడంతో హోటల్‌ని తనే చూసుకుంది. భర్త తిరిగి వచ్చాడు. మళ్లీ ఆటో నడపడం మొదలుపెట్టాడు. కుమారి అలాగే హోటల్‌నే నమ్ముకుంది. అయితే ఈ చాలీచాలని బతుకులు ఎందుకనుకునేది ప్రతిరోజూ. పైగా అప్పటికే ముగ్గురు పిల్లలు. రోజురోజుకు ఖర్చులు ఎక్కువ అవ్వడంతో ఏం చేయాలని రాత్రింబవళ్లు ఆలోచించేది. అలా వచ్చిన ఆలోచనే ఆటో నడపడం. రాత్రి భర్త ఆటోను ఇంటి ముందు పెట్టేవాడు. ఆటో ఖాళీగా ఉంటుంది కాబట్టి నేర్చుకుంటానని భర్తని అడిగింది. మొదలు ఒప్పుకోలేదు. కానీ ఆమె పట్టుబట్టడంతో అతను నేర్పించక తప్పలేదు. అలా రాత్రుళ్ళు ఆటో నడపడం నేర్చుకుంది మెల్లమెల్లగా. ఆ తర్వాత వాళ్ల పక్కింటి వాళ్ళ ఆటోను అడిగి ఉదయం కూడా ప్రాక్టీస్ చేసేది.

బ్యాంకు రుణంతో..
                     ఆటో నడపడమైతే అలవోకగా నేర్చుకుంది. లైసెన్స్ కోసమే చాలా కష్టాలు పడింది. చివరకు ఎలాగోలా లైసెన్స్ సంపాదించింది, కానీ ఆటో! అక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అమ్మాయి ఆటో నడపడమేంటి? బండి నడిపి క్షేమంగా తిరిగి తమ చేతికి ఇస్తుందా? అని చాలామంది చాలా సందేహాలు వెలిబుచ్చారు. ఆటో అద్దెకు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సొంత ఆటో అయితే ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదనుకుంది. బ్యాంకు రుణం కోసం దరఖాస్తు పెట్టుకుంది. బ్యాంకు వాళ్లు సానుకూలంగా స్పందించి ఆమెకు లోను ఇప్పించారు. ఇచ్చేముందు ఒక షరతు విధించారు. కచ్చితంగా ఆమె నడుపుతానం ఇస్తామని. అంతేకాదు, మధ్యలో చెక్ చేస్తామని కూడా చెప్పారు. అలా ఆమె ఆటో రోడ్డు మీదకు వచ్చేసింది. ఉదయం ఆటో ఆమె నడిపితే, రాత్రుళ్ళు అదే ఆటోను భర్త నడిపేవాడు.

సీఐ సహకారంతో..
                      ఆటోను రోడ్డయితే ఎక్కించింది కానీ మిగతా ఆటోవాళ్ళను, ప్రయాణికులను మెప్పించలేకపోయింది. అంటే.. ఒక అమ్మాయి ఆటో నడపడమేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒక్కరిద్దరినే ఎక్కించుకునైనా వెళ్ళిపోయేది. అలా.. అలా.. ఆమె డ్రైవింగ్ మీద నమ్మకం ఏర్పడింది అక్కడున్న వాళ్ళందరికీ. దాంతో ఆమె ఆటోలో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. కొన్ని రోజులు సాయంత్రం ఆరు, ఏడు వరకు కూడా ఆ లైన్లలో ఉండి ఆటో నిండాక కాని బయలుదేరకపోయేది. పెద్దపల్లి సీఐ ఇదంతా గమనించాడు. అక్కడున్న వాళ్ళతో ముందు కుమారి ఆటో నింపి పంపించేసి ఆ తర్వాత లైన్లు చూసుకోమన్నాడు. అప్పటి నుంచి ఆమె ఆటో నిండిన తర్వాతే అక్కడున్న మిగతా ఆటోలు కదులుతాయి.

అంతా పిల్లల కోసమే..
                   ‘‘నేను మొట్టమొదటిసారి మా ఆయనకు తెలియకుండా ఒకసారి ఆటో తీశాను. ఉదయం ఐదు గంటలకు నిద్రపట్టక ఆటో నడపుదామని అనుకున్నాను. అప్పుడే కాలనీలో రౌండ్లు వేస్తుంటే సింగరేణి వాళ్ళు పనులకు వెళుతూ ఆటో కోసం చూస్తున్నారు. నేను వెళ్లి తీసుకెళతాను అంటే ముందు తటపటాయించినా ఎక్కి కూర్చున్నారు. క్షేమంగా వాళ్ళని దించాను. దాంతో నా మీద నమ్మకం కుదిరింది వాళ్ళకి, నాకు కూడా. అలా ఆటో నడిపి 42 రూపాయలు సంపాదించాను. అప్పటిదాకా హోటల్ నడిపినప్పుడు వచ్చిన డబ్బులకంటే ఈ డబ్బులను చూస్తే ఎంతో గర్వంగా అనిపించింది.

                        ఎంతో సంతోషమేసింది కూడా! ఆ డబ్బులను తీసుకొచ్చి మా ఆయనకిచ్చాను. ముందు కాస్త మందలించారు చెప్పకుండా ఆటో తీసుకెళ్ళినందుకు కానీ ఆ తర్వాత సంతోషించారు. నేను ఇంత కష్టపడేది నా పిల్లల కోసమే. నాకెలాగూ చదువూసంధ్యా లేదు. కనీసం వాళ్ళనైనా మంచి కొలువుల్లో చూడాలి. వాళ్లు కూడా బాగా చదువుతున్నారు. అదే నేను ఎంతటి కష్టన్నైనా ఇష్టపడేలా చేస్తోంది. ఈ మధ్యే సాయంవూతంపూట కుట్టు మిషన్ కూడా నేర్చుకుంటున్నాను. అది కూడా ఏదో ఒకలా సాయంగా ఉంటుంది కదా! ఇంకా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. కానీ దానికి పదవతరగతి పాస్ కావాలంటా! నాకేమో అక్షరం కూడా రాదు. చదువుతానంటే పిల్లలేమో వద్దంటున్నారు. కానీ ఎలాగైనా చదివి తీరాలని నాకనిపిస్తోంది. ఏ రోజుకారోజు సంపాదిస్తేనే పూట గడవడం కష్టంగా ఉంది. ఇంకా చదువు మీద ధ్యాసే ఏముంటది? అందుకే ఆలోచిస్తున్నాను.’’


0 Comments

రుక్మిణి త్యాగం

11/13/2013

0 Comments

 
Picture
రుక్మిణి దేవి మధురై లో ఒక ఎగువ తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904 న జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠ శాస్త్రి, ఒక పండితుడు మరియు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా, పని చేసేవాడు. అతను ఒక బదిలీ ఉద్యోగం ఉంది మరియు కుటుంబం తరచుగా మారుతూ. అతను 1901 లో దివ్యజ్ఞాన సమాజం ప్రవేశపెట్టారు. లోతుగా డాక్టర్ అనిబిసెంట్ ఒక అనుచరులుగా దివ్యజ్ఞాన ఉద్యమంలో ప్రభావితం, నీలకంఠ శాస్త్రి అతను దివ్యజ్ఞాన సమాజం అడయార్ యొక్క ప్రధాన కార్యాలయం సమీపంలో తన ఇంటి నిర్మించాడు విరమణ మీద చెన్నై, అడయార్ తరలించబడింది. ఇది యువ రుక్మిణి కేవలం దివ్యజ్ఞాన ఆలోచన బారినపడ్డారు ఇక్కడ, కానీ సంస్కృతిపై కూడా కొత్త ఆలోచనలు, తరువాత థియేటర్, సంగీతం మరియు నృత్య, మరియు అన్నే బిసెంట్ అత్యంత సన్నిహితుడు మరియు తరువాత ప్రఖ్యాత బ్రిటీష్ Theosophist డాక్టర్ జార్జ్ Arundale కలుసుకున్నారు వారణాసి లో సెంట్రల్ హిందూ మతం కాలేజ్ యొక్క ప్రధాన, మరియు వెంటనే అతనితో శాశ్వత బాండ్ నిర్మించడానికి. [3]

వారు అప్పుడు సాంప్రదాయ సమాజంలో షాక్ చాలా 1920 లో పెళ్లి చేసుకున్నాడు. వివాహం తరువాత, ఆమె అధ్యాపకురాలు అయిన మరియా మాంటిస్సోరి, మరియు కవి జేమ్స్ కజిన్స్ తో సహ దివ్యజ్ఞాన మరియు అనుకరించారు స్నేహాలు సమావేశం, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించారు. 1923 లో, ఆమె యంగ్ దివ్యజ్ఞాన అన్ని భారతదేశం సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన [4], మరియు 1925 లో యంగ్ దివ్యజ్ఞాన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అధ్యక్షుడు. [5]

1928 లో, ప్రముఖ రష్యన్ నృత్య కళాకారిణి అన్నా పావ్లోవా బాంబే సందర్శించిన మరియు Arundale జంట ఆమె నటన వెళ్లిన, మరియు తరువాత ఆమె తదుపరి చేయటానికి అక్కడ ఆస్ట్రేలియా తన అదే ఓడ, ప్రయాణము జరిగింది; ప్రయాణ సమయములో వారి స్నేహం పెరిగింది , మరియు వెంటనే రుక్మిణి దేవి అన్నా ప్రముఖ సోలో నృత్యకారులు ఒకటి, క్లియో Nordi. [6] నుండి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది ఇది రుక్మిణి దేవి అపఖ్యాతి పడిపోయింది మరియు అంకితం చేసిన సాంప్రదాయ భారతీయ నృత్య రూపాలు ఆవిష్కరించడం ఆమె దృష్టి సారించింది ఆ అన్నా అభ్యర్ధనపై తరువాత వారి పునరుద్ధరణ లోకి ఆమె జీవితం మిగిలిన. [7]

రుక్మిణి దేవి ఏప్రిల్ 1952 లో రాష్ట్రాల భారత పార్లమెంటు యొక్క కౌన్సిల్, రాజ్యసభ సభ్యునిగా నామినేట్ మరియు 1956 లో తిరిగి ఎంపికయ్యాడు. [20] అతనికి జంతు సంక్షేమ ఆసక్తి, ఆమె వివిధ మానవతావాద సంస్థలైన సంబంధం, మరియు సభ్యుడిగా జరిగినది రాజ్య సభ, జంతువులు చట్టం టు అనిమల్ నివారణ చట్టం, 1960 వాయిద్య మరియు తరువాత 1962 లో ఆమె ఆధ్వర్యంలో, భారతదేశం యొక్క యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ఆమె 1986 లో ఆమె మరణానికి వరకు, దాని బోర్డులో ఉంటాయి.

ఆమె ఒక ఖచ్చితమైన శాకాహారి మరియు చాలా దేశంలో శాకాహార ప్రోత్సహించడానికి పని లేదు. ఆమె 1955 నుండి, 1986 లో ఆమె మరణించే వరకు 31 సంవత్సరాలు అంతర్జాతీయ శాఖాహారం యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. [21]

1977 లో, మొరార్జీ దేశాయి ఆమె తిరస్కరించింది ఇది భారతదేశం యొక్క అధ్యక్షుడు పోస్ట్ కోసం ఆమె ఎంపిక ఇచ్చింది. [22] రుక్మిణి దేవి Arundale చెన్నై ఫిబ్రవరి 1986 24 న మరణించాడు. 1978 లో, 'Kalamkari సెంటర్' ("pencraft) వంటి టెక్స్టైల్ ప్రింటింగ్ భారతీయ ప్రాచీన క్రాఫ్ట్ పునరుద్ధరణ Kalakshetra వద్ద ఏర్పాటు. [23]

'మన దేశ అత్యున్నత పదవినిస్తాం రండి, రాష్ట్రపతిని చేస్తాం రారండి' అంటే వద్దనేవాళ్లుంటారా? దేశప్రథమ పౌరుడి హోదాను పొందడానికి జీవితమల్లా వేచిచూసేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ 'ఆ పదవి వద్దు, అక్కడి హంగూఆర్భాటాలను నేను భరించలేను' అనేవాళ్లు ఉంటారా? 'ఉన్నారు. రుక్మిణీదేవి అరండేల్ ఆ పదవిని తృణప్రాయంగా త్యజించారు. అటువంటి మహిళ గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియాలి' అన్నారు మన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

భరతనాట్య కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ చెన్నైలో స్థాపించిన 'కళాక్షేత్ర'లో ఆమె స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ, తాను సిద్ధం చేసుకున్న ప్రసంగం మధ్యలో ఈ సంగతులను గుర్తుచేసుకుని మరీ చెప్పడం పెద్ద విశేషం!

'1977లో నేను కాంగ్రెస్ ఎంపీని. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. దాన్ని భర్తీ చెయ్యమని ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ స్వయంగా రుక్మిణీదేవి అరండేల్‌ను ఆహ్వానించారు. ఆయన నిర్ణయానికి ఒక్కరు కూడా ఎదురుచెప్పలేదంటే ఆమె ఎంత ఉన్నతమైన మహిళో అర్థమవుతుంది. అంత అత్యున్నతమైన పదవి అడక్కుండానే వచ్చినా కూడా రుక్మిణీదేవి దాన్ని తృణప్రాయంగా త్యజించడం అనేది ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞానం, స్థిరచిత్తం, ఎంతటి త్యాగానికైనా వెనుదియ్యకపోవడం అనే భారతీయ విలువలు ఆమెలో మూర్తీభవించాయి...' అంటూ రుక్మిణీదేవిని గురించి విద్యార్థులకు తెలియజేశారు ప్రణబ్ ముఖర్జీ. 'ఆమె రాష్ట్రపతి పదవిని కాదన్నారు, కానీ కళాక్షేత్రలో ఎందరో రాష్ట్రపతులకు ఆతిథ్యమిచ్చారు...' అంటూ చమత్కరించారు.

ఇంతలో ప్రణబ్‌కు తన మాతృభూమి కూడా గుర్తుకొచ్చింది. 'మన దేశంలో కళలకు కొత్తరూపునివ్వాలన్న రుక్మిణీదేవి ప్రయత్నానికి మొట్టమొదట వత్తాసు పలికింది రవీంద్రనాథ్ ఠాగూరే. కళాక్షేత్ర అన్న పేరు ఆయనకెంత నచ్చిందంటే, శాంతినికేతన్ ప్రారంభించక ముందుగానీ తనకా పేరు తట్టి ఉంటే, అదే పెట్టేవాణ్నని ఆయన అనేవారు' అంటూ గుర్తుచేసుకున్నారు ప్రణబ్ దా. 'కళాక్షేత్ర, శాంతినికేతన్ - రెండూ భూమ్మీది రెండు శాంతిధామాలు. కళలకు దేవాలయాలు...' అంటూ పొగిడారాయన


0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.