యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు
1990లో అర్జున అవార్డు
ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు అసిస్టెంటు కమాండెంట్
ఇండియన్ వెరుుట్ లిప్టింగ్‌లో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి కుంజరిని. కుంజరిని మార్చి 1,1968లో మణిపూర్ లోని ఇంపాల్ నందు గల ెకైరంగ్ మయై లేఇెకై నందు జన్మించారు. 1978 ఇంపాల్‌లోని సిండం సిన్శాంగ్ రెసిడెంట్ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడల పట్ల ఆకర్షితురాలైనది. ఇంపాల్‌లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఆమె సమయమంతా వెరుుట్ లిఫ్టింగ్ నందు ేకటారుుంచినది. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ కమాండెంట్‌గా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.1996 నుంచి 1998 వరకు రక్షకదళాధిపతిగా క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించినది.
ప్రొఫైల్
పేరు : కుంజరని దేవి
జన్మించినది : 1 మార్చి, 1968
స్థలం : మణిపూర్,
భారతదేశం
ప్రాముఖ్యత : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
వృత్తి : వెయిట్ లిఫ్టింగ్
క్రీడాకారిణి
క్రీడా చరిత్ర
- 1985వ సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల యందు 44 కిలోల, 46 కిలోల చివరగా 48 కిలోల విభాగంలో ఎక్కువగా బంగారు పతకాలు సాధించింది. 1987లో త్రివేండ్రంలో జరిగిన పోటీలలో 2 రికార్డులు నెలకొల్పింది. 1994లో పూణేలో జరిగిన పోటీలలో మొదటిసారిగా 46 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది, తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మణిపూర్‌లో జరిగిన పోటీలలో 48 కిలోల విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
- 1989లో మాంచెస్టర్లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు కైవసం చేసుకోవడం ఆమెలో ఆత్మస్థైర్యం నింపింది. అప్పటినించి 1993 మేల్బోర్ను పోటీలు మినహా వరుసగా ఏడుసార్లు జరిగిన ప్రపంచపోటీలలో పాల్గొన్న ప్రతిసారి బహుమతి సాధించింది. కానీ ప్రతిసారి వెండిపతకంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
- 1990లో బీజింగ్,1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజతపతకాన్ని సాధించింది. కానీ 1998లో జరిగిన ఆసియా క్రీడలలో పతక సాధనలో విఫలమైంది.
అదృష్టవశాత్తు కుంజరిని ఆసియా ఖండపు వెయిట్ లిఫ్టింగ్ పోటీల యందు పలు పతకాలు సాధించింది.1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక వెండి, రెండు రజత పతకాలు గెలిచింది. అంతేకాకుండా 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించినది. తరువాత 1992లో థాయిలాండ్, 1993లో చైనా పోటీలలో తన రెండవ స్థానాన్ని సంపాదించుకుంది.
- 1995లో దక్షిణకొరియా పోటీలలో 46 కిలోల విభాగంలో అత్యుత్తమమైన ఆటతీరుతో రెండు బంగారు, ఒక రజతపతకం సాధించింది. కానీ 1996లో జపాన్ లో జరిగిన పోటీలలో రెండు వెండి, ఒక రజత పతకంతో సరిపెట్టవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆటపై ఉన్న ఇష్టంతో పతకాలు సాధించగలిగారు. జాతీయ, అంతర్జాతీయంగా పతకాలు సాధించడమే కాకుండా మహిళలకు మరింత స్ఫూర్తిగా నిలిచారు. అంతర్జాతీయంగా ప్రదర్శన చేసేటప్పుడు అనేక సమస్యలు వచ్చేనా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగారు.
వివాదం
కుంజరిని దేవి 2001లో నిషేదించిన ష్టిరాయిడ్స్ వాడినట్లుగా రుజువైనందున 6 నెలలపాటు తాత్కాలిక నిషేధానికి గురయినది. వివాదం అనంతరం అనేక విజయాలతో ఆమె పై ఉన్న వివాదాలు అణగారిపోయాయి. వివాదాలనంతరం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు.
ప్రస్తుత పరిస్థితి
కుంజరిని ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు అసిస్టెంటు కమాండెంట్‌గా పనిచేయుచున్నది. క్రీడల విరమణ నుంచి ఇప్పటివరకు ఇదే ఉద్యోగం రాణిస్తున్నారు. ఇండియన్ వెయిట్ లిప్టింగ్‌లో భారతీయ క్రీడాకారిణిగా అనేక విజయాలు నమోదు చేసుకున్నారు. దీంతో అనేక మంది మహిళలు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.
గుర్తింపు - 1990లో ఆమెను అర్జున అవార్డు, లియాండర్ పేస్‌తో కలిపి 1996-1997లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డులు వరించాయి. అదే సంవత్సరం ఆమె కే.కే బిర్లా అవార్డు గెలుచుకుంది.