ఓ పార్టీలో హుస్సేన్‌తో పరిచయం
పెళ్లి తరువాత రాణిగా పలు సంస్కరణలు
మతఛాందసవాదుల నుంచి బెదిరింపులు
లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న రానియా
గౌరవ కల్నల్‌ెదానిచ్చిన జోర్డాన్ ప్రభుత్వం
జాతీయం... అంతర్జాతీయం... ఏ అందాల పోటీలో గెలిచిన వనితలైనా చెప్పే మెుదటి మాట సామాజానికి తన వంతు సాయం చేస్తామని... అందగత్తె కిరీటాన్ని దక్కించుకుని సేవకు సమయాన్ని ేకటారుుంచిన వారు మాత్రం చాలా తక్కువే. అరుుతే ప్రపంచ వందమంది అందగత్తెల జాబితాలో చోటు సంపారుుంచుకున్న రానియా మాత్రం సేవ చేయడానికి వెనకాడదు. ఇటు జోర్డాన్ రాణిగా బాధ్యతని, ెదాని నిలబెట్టుకుంటూ సేవల్లోనూ మహారాణిగానే నిరూపించుకుంది. అంతే కాకుండా ఫోర్బ్‌స పత్రిక ప్రకటించిన అంతర్జాతీయంగా శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం సంపాదించుకుంది.
సేవలోనూ రాణే
అందగత్తెల పోటీల్లో సౌందర్యరాశులంతా మాటల్లో ‘సేవాభావం’ కురిపిస్తారు. తరువాత బాలీవుడ్‌లోనో, హాలీవుడ్‌లోనో ప్రత్యక్షమవుతుంటారు. మరికొంత మంది వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లతో, షోరూంల ప్రారంభోత్సవాలతో తీరిక లేకుండా ఉంటారు. అయితే బ్రిటిష్ యువరాణి డయానా వంటి వారు బహు అరుదుగా సమాజసేవలో నిమగ్నమవుతారు. ఇటువంటి వర్గంలోకి జోర్డాన్ రాణి రానియా చేరుతారు. మహిళల, బాలల హక్కుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు.
అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్న రానియా రాజుల కుటుంబంలో జన్మించలేదు. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచే వచ్చారు. కువైట్‌లో స్థిరపడిన పాలస్తీనీయుల కుటుంబంలో పుట్టింది రానియా. తండ్రి వైద్యుడు. చిన్నప్పటి నుంచే చదువులో అమిత ప్రతిభాపాటవాలు చూపిన ఆమె కైరోలోని అమెరికన్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొన్నాళ్లు సిటీ బ్యాంకులో ఉద్యోగం చేశాక యాపిల్ కంపెనీకి మారింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక పార్టీకి వెళ్లడమే రానియా జీవితాన్ని మార్చేసింది. ఆ పార్టీకి వచ్చిన జోర్డాన్ యువరాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్‌తో చూపు కలిసింది. తొలిచూపు ప్రేమ అవునో కాదో వాళ్లెప్పుడూ బయటికి చెప్పలేదు కానీ... సరిగ్గా ఐదునెలలు తిరిగే సరికి వాళ్ల పెళ్లయిపోయింది. తర్వాత కొద్ది రోజులే అబ్దుల్లాకు జోర్డాన్ రాజుగా పట్టాభిషేకం జరిగింది. అలా మూడుపదుల వయసు నిండకముందే ఒక దేశానికి మహారాణి అయింది రానియా.
ప్రొఫైల్
పేరు : రానియా ఆల్ అబ్దుల్లాహ్
తండ్రి పేరు : ఫైసల్ సేద్కి ఆల్ యాసిన్
తల్లి : ఇహం యాసిన్
పుట్టిన తేది : 31 ఆగస్టు 1970
జన్మస్థలం : కువైట్
భర్త : అబ్దుల్లా బిల్ ఆల్ హుస్సేన్
పిల్లలు : నలుగురు. యువరాజులు హుస్సేన్,
హషీమ్, యువరాణిలు ఇమాన్, సల్మా
ఎంత మహారాణి అయినా, సంప్రదాయాలనూ కట్టుబాట్లనూ దాటి ఒక మహిళ ఇలా నలుగుర్లోకీ రావడం. వాటికి విరుద్ధంగా గొంతెత్తడం అక్కడి మతఛాందసవాదులకు నచ్చలేదు. వారి బెదిరింపులను ఖాతరుచేయకుండా ధైర్యంగా తాను ఎంచుకున్న బాటలోనే నడుస్తోంది రానియా. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్దెనిమిది అంతర్జా తీయ సంస్థల్లో సభ్యురాలిగా కీలక పాత్ర పోషిస్తోంది. యునైట్‌డ్ నేషన్స్ ఫండ్, యునిసెఫ్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, ఇంటర్నేషనల్ యూత్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అసిస్టెన్స్ వంటి ప్రముఖ సంస్థల్లో రానియా సేవలు కీలకం. ఆమె సేవలకు మెచ్చి జోర్డాన్ ప్రభుత్వం గౌరవ కల్నల్‌హోదా కూడా ఇవ్వడం విశేషం.
అరబ్ దేశాలలో మహిళలూ చిన్నపిల్లల కష్టాలను చూస్తూ పెరిగిన రానియాలో బాల్యం నుంచే ఎన్నో ఆలోచనలు. రాణి అవగానే తన ఆలోచనలు అమల్లో పెట్టేందుకు గొప్ప అవకాశం వచ్చిందని భావించారు. వెంటనే జోర్డాన్‌లోని అన్ని పాఠశాలల్లోనూ విద్యాసంస్కరణలు ప్రారంభించేలా రాణి హోదాలో చర్యలు తీసుకున్నారు. భర్త కూడా అందుకు సహకరించడంతో రానియాకు మరింత ప్రోత్సాహం లభించింది. మహిళల హక్కును కాలరాసే కట్టుబాట్లకు వ్యతిరేకంగా గొంతెత్తింది. ‘జోర్డాన్ రివర్ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించి మహిళలూ పిల్లల సంక్షేమం దిశగా కృషిచేస్తోంది.