telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం

11/24/2013

0 Comments

 
Picture
ఏ అమ్మాయీ తనకై  తాను ఇల్లొదిలి వచ్చేయదు.
 ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు.
 ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు.
 ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు.
 ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు.
 మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా....
 తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి.
 కానీ ఇలాంటి అమ్మాయికి...
 దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి...
 తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు.
 కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు.
 ఎవరి భయం వారిది. ఎవరి కారణాలు వారివి.
 అయితే జయశ్రీ భయపడలేదు.
 ఏ కారణమూ ఆమెను వెనుకంజ వెయ్యనివ్వలేదు.
 ఇల్లొదిలొచ్చిన పిల్లెవరైనా మా ఇంటి పిల్లే అని...
 పట్టెడన్నం పెడుతోంది. పచ్చని జీవితాన్నీ ఇస్తోంది.
 వంచితులకు ఆమె పంచుతున్న అనురాగం, ఆత్మవిశ్వాసమే.....
 
                    తమ వాళ్ల నుంచి తప్పిపోయినవారు, ట్రాఫికింగ్ నుంచి తప్పించుకున్నవారు, వంచనకు గురయినవారు, వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారు... ఇలా రకరకాల కారణాలచేత సమాజానికి దూరమై ఏం చేయాలో పాలుపోని ఒంటరి స్త్రీలకు కరీంనగర్‌లోని ‘స్వధార్‌హోమ్’ కొండంత అండగా నిలుస్తోంది. వారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు పచ్చటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తోంది. ‘బాధిత స్త్రీల పునరావాస కేంద్రం’ పేరుతో ఉన్న ఈ హోమ్‌ని నడిపిస్తోన్న జయశ్రీ ‘ప్రకృతి’ అనే స్వచ్ఛందసంస్థలో భాగంగా ఎనిమిదేళ్లక్రితం స్వధార్ హోమ్‌ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి బాధిత స్త్రీలకు అండగా నిలుస్తూ... వారికి ఆత్మవిశ్వాసం కలిగించి, సమాజానికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తున్నారు.
 
 ‘ప్రకృతి’ నీడలో...
 
                    సమాజం పంచభూతాలకు అండగా నిలబడకపోతే ప్రకృతి పచ్చగా ఉండలేదంటారు జయశ్రీ. అందుకే మొక్కలు నాటడం వంటి పనులతో పచ్చదనాన్ని పోషిస్తూనే... 1997లో ‘ప్రకృతి’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి, మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి శిక్షణల కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో నడుస్తోన్న స్వధార్ హోమ్‌ని తన సొంతిల్లులా భావించి బాధిత మహిళలకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

                 ‘‘స్వధార్ హోమ్‌లో ఒక్కో మహిళది ఒక్కో కష్టం. వారిని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, సమస్యల్ని ఎదుర్కొనేలా కూడా తీర్చిదిద్ది, కొత్త జీవితాలివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 350 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం హోమ్‌లో 50 మంది మహిళలున్నారు. వీరిలో పదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసువారున్నారు’’ అంటూ తమ సంస్థ గురించి వివరించారు జయశ్రీ. లా చదివిన జయశ్రీకి విద్యార్థి వయసు నుంచే సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ, ‘ప్రకృతి’ అనే ఎన్‌జీవోని నడుపుతున్నారు.
 
 ఆశ్రయంతో పాటు...
 
                        ‘‘2005లో స్వధార్ హోమ్ స్థాపించాక... దాని గురించి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే... ఆ అవసరం లేకుండానే బాధిత మహిళలు ఒక్కొక్కరుగా హోమ్‌కి రావడం మొదలుపెట్టారు. అత్యాచారానికి గురైన ఓ నలుగురు అమ్మాయిలకు ఇక్కడే ఆశ్రయం కల్పించాం. వారిలో ఇద్దరు... తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ఇంకో అమ్మాయి కూరగాయల షాపు పెట్టుకుని తన బతుకు తాను బతుకుతోంది.
 
                        అత్తింటి వేధింపులు భరించలేక మా హోమ్‌కి చేరుకున్న మహిళలకు, ఆమె భర్త, అత్త్తమామలకు కౌన్సెలింగ్ చేయడం... ఉమ్మడి కుటుంబంలో కాపురం కష్టమనుకుంటే మేమే దగ్గరుండి వేరు కాపురం పెట్టించడం, అయినా భర్త నుంచి బాధలు తప్పడం లేదంటే మా హోమ్‌లోనే కొన్నాళ్లు ఉంచి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఏదైనా వృత్తిశిక్షణ ఇప్పించడం వంటి పనులు చేస్తున్నాం. భర్త చనిపోయిన మహిళల్లో కొందరు... అందరూ ఉన్న అనాథల్లా ఉన్నారు. వీరినే కాదు, పట్టెడన్నం పెడితే చాలంటూ వచ్చే వృద్ధులను కూడా స్వధార్ హోమ్ అక్కున చేర్చుకుంటోంది. ఏదో ఒక పనిచేసుకుని బతికే ఓపిక ఉన్నవారితో వారికిష్టమైన పనిచేయిస్తున్నాం. అలా ఓ నలుగురు వృద్ధులు ఇక్కడే కూరగాయలు అమ్మి పొట్ట పోసుకుంటున్నారు’’ అంటూ తన హోమ్‌కి వచ్చిన మహిళల గురించి చెప్పారు జయశ్రీ.
 
 చదువు... ఉపాధి...
 
                     స్వధార్ హోమ్‌లో పెద్దవాళ్లే కాదు, విద్యార్థులు సైతం ఉన్నారు. ‘‘తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలతోపాటు విద్యార్థి వయసులోనే ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే చిన్నపిల్లలను ఏళ్ల తరబడి మా దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి, వారికి దారి చూపించడం కొంచెం కష్టమైన పనే. నిజానికి స్వధార్ హోమ్ గైడ్‌లైన్స్ ఏంటంటే... ఇక్కడికి వచ్చిన బాధిత మహిళలు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ ఉండొచ్చు. ఆ లోపు వారికి ఉపాధిమార్గం చూపించి బయటికి పంపేయాలి. పిల్లలు చదువులో పడ్డాక వారు సెటిల్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. వారిని మధ్యలోనే మీ దారి మీరు చూసుకోండంటే ఎక్కడికి వెళతారు? అందుకే మేం ఆ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వడంలేదు. ఇన్ని నెలలు... ఇన్ని సంవత్సరాలు అనే నిబంధనలు పెట్టుకోకుండా వచ్చినవారి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం.
 
                          ఇక్కడ మీకు ఒక కేసు వివరాలు చెబుతాను... స్వప్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఏడోతరగతిలో ఉండగానే మేనమామ మహారాష్ట్రకు చెందిన ఓ నలభైఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశాడు. అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయిని అతను మరోవ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే విషయం అర్థం చేసుకున్న స్వప్న వెంటనే కరీంనగర్‌లో ఉన్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఆ ఊరి సర్పంచ్‌కి తెలియజేస్తే అతను మా చెవిన వేశాడు. మేం పోలీసుల సాయంతో మహారాష్ర్ట నుంచి మా హోమ్‌కి రప్పించుకుని, స్కూల్‌లో చేర్పించాం. ప్రస్తుతం తను నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. కొంత ప్రభుత్వసాయం, కొందరు దాతల చేయూతతో హోమ్‌ని నడుపుతున్నాం. ఇక్కడికి వచ్చే బాధిత మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో హోమ్ కెపాసిటి పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాను’’ అని ముగించారు జయశ్రీ.
 
                  ఆ హోమ్‌కి వెళ్లేంతవరకే బాధ. అక్కడున్న మహిళల సమస్యలు తెలుసుకున్న తోటివారు తమ బాధల్ని మరిచిపోతారు. కాని హోమ్ నిర్వాహకులకు మాత్రం ఒక్కో మహిళా ఒక్కో ఛాలెంజ్. లేదంటే వారి సమస్యల్ని పరిష్కరించి వారిని తిరిగి మళ్లీ జీవితంలో స్థిరపర్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పూటకు ఆశ్రయం కల్పించమని వచ్చిన మహిళలకు భరోసా గల భవిష్యత్తుని ఏర్పాటుచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం.

0 Comments

ఖేల్ రత్న  కుంజరినీ దేవి

11/18/2013

0 Comments

 
Picture
1997లో రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న  అవార్డు
యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు
1990లో అర్జున అవార్డు
ప్రస్తుతం సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ నందు అసిస్టెంటు కమాండెంట్‌

ఇండియన్‌ వెరుుట్‌ లిప్టింగ్‌లో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి కుంజరిని. కుంజరిని మార్చి 1,1968లో మణిపూర్‌ లోని ఇంపాల్‌ నందు గల ెకైరంగ్‌ మయై లేఇెకై నందు జన్మించారు. 1978 ఇంపాల్‌లోని సిండం సిన్శాంగ్‌ రెసిడెంట్‌ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడల పట్ల ఆకర్షితురాలైనది. ఇంపాల్‌లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత ఆమె సమయమంతా వెరుుట్‌ లిఫ్టింగ్‌ నందు ేకటారుుంచినది. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్‌ కమాండెంట్‌గా సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.1996 నుంచి 1998 వరకు రక్షకదళాధిపతిగా క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించినది.

ప్రొఫైల్‌

పేరు       : కుంజరని దేవి
జన్మించినది    : 1 మార్చి, 1968
స్థలం        : మణిపూర్‌,
            భారతదేశం
ప్రాముఖ్యత    : రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న
వృత్తి        : వెయిట్‌ లిఫ్టింగ్‌
            క్రీడాకారిణి



క్రీడా చరిత్ర



  • 1985వ సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల యందు 44 కిలోల, 46 కిలోల చివరగా 48 కిలోల విభాగంలో ఎక్కువగా బంగారు పతకాలు సాధించింది. 1987లో త్రివేండ్రంలో జరిగిన పోటీలలో 2 రికార్డులు నెలకొల్పింది. 1994లో పూణేలో జరిగిన పోటీలలో మొదటిసారిగా 46 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది, తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మణిపూర్‌లో జరిగిన పోటీలలో 48 కిలోల విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
  • 1989లో మాంచెస్టర్లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు కైవసం చేసుకోవడం ఆమెలో ఆత్మస్థైర్యం నింపింది. అప్పటినించి 1993 మేల్బోర్ను పోటీలు మినహా వరుసగా ఏడుసార్లు జరిగిన ప్రపంచపోటీలలో పాల్గొన్న ప్రతిసారి బహుమతి సాధించింది. కానీ ప్రతిసారి వెండిపతకంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
  • 1990లో బీజింగ్‌,1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజతపతకాన్ని సాధించింది. కానీ 1998లో జరిగిన ఆసియా క్రీడలలో పతక సాధనలో విఫలమైంది.
    అదృష్టవశాత్తు కుంజరిని ఆసియా ఖండపు వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల యందు పలు పతకాలు సాధించింది.1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక వెండి, రెండు రజత పతకాలు గెలిచింది. అంతేకాకుండా 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించినది. తరువాత 1992లో థాయిలాండ్‌, 1993లో చైనా పోటీలలో తన రెండవ స్థానాన్ని సంపాదించుకుంది.

  • 1995లో దక్షిణకొరియా పోటీలలో 46 కిలోల విభాగంలో అత్యుత్తమమైన ఆటతీరుతో రెండు బంగారు, ఒక రజతపతకం సాధించింది. కానీ 1996లో జపాన్‌ లో జరిగిన పోటీలలో రెండు వెండి, ఒక రజత పతకంతో సరిపెట్టవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆటపై ఉన్న ఇష్టంతో పతకాలు సాధించగలిగారు. జాతీయ, అంతర్జాతీయంగా పతకాలు సాధించడమే కాకుండా మహిళలకు మరింత స్ఫూర్తిగా నిలిచారు. అంతర్జాతీయంగా ప్రదర్శన చేసేటప్పుడు అనేక సమస్యలు వచ్చేనా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగారు.

    వివాదం
    కుంజరిని దేవి 2001లో నిషేదించిన ష్టిరాయిడ్స్‌ వాడినట్లుగా రుజువైనందున 6 నెలలపాటు తాత్కాలిక నిషేధానికి గురయినది. వివాదం అనంతరం అనేక విజయాలతో ఆమె పై ఉన్న వివాదాలు అణగారిపోయాయి. వివాదాలనంతరం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు.

    ప్రస్తుత పరిస్థితి
    కుంజరిని ప్రస్తుతం సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ నందు అసిస్టెంటు కమాండెంట్‌గా పనిచేయుచున్నది. క్రీడల విరమణ నుంచి ఇప్పటివరకు ఇదే ఉద్యోగం రాణిస్తున్నారు. ఇండియన్‌ వెయిట్‌ లిప్టింగ్‌లో భారతీయ క్రీడాకారిణిగా అనేక విజయాలు నమోదు చేసుకున్నారు. దీంతో అనేక మంది మహిళలు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.

    గుర్తింపు
  • 1990లో ఆమెను అర్జున అవార్డు, లియాండర్‌ పేస్‌తో కలిపి 1996-1997లో రాజీవ్‌ గాంధీ ఖేల్త్న్ర అవార్డులు వరించాయి. అదే సంవత్సరం ఆమె కే.కే బిర్లా అవార్డు గెలుచుకుంది.
ఆమె ఖాతాలో యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. 2006 మెల్బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పింది.


0 Comments

పరుగుల షైనీ

11/16/2013

0 Comments

 
Picture
1991లో చైనీస్‌ జర్నలిస్ట్‌ అవార్డు
1998లో పద్మశ్రీ, 1985లో అర్జున అవార్డు
అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున 75 సార్లు పోటీ
ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీలలో అరుదైన రికార్డు

                 చిన్నప్పటి నుంచి క్రీడలలో రాణించాలని పట్టదల ఉండేది. అదే పట్టుదలతో రాణించి దేశం గర్వించే విధంగా జాతీయ, అంతర్జాతీ చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు సొంతం చేసుకుంది షైనీ. ఆమె అత్యుత్తమ క్రీడా ప్రదర్శనకు ేకంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులతో సత్కరించింది. ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీల నుంచి వరుసగా ఆరుసార్లు ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏెకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

                        1965, మే 8న జన్మించిన షైనీ అబ్రహం, భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్‌ క్రీడాకారిణి. 800 మీటర్ల పరుగు పందెంలో ఆమె 14 సంవత్సరాలపాటు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై 75 సార్లకు పైగా భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 1985 లో జకర్తాలో జరిగిన ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీల నుంచి వరుసగా 6 సార్లు ఆసియా ట్రాక్‌ ఫీల్డ్‌ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ సమయంలో ఆమె 7 బంగారు పతకాలను, 5 వెండి పతకాలను, 2 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఇతర చాంపియన్‌ షిప్‌లలో ఆమె పాల్గొన్న 7 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడలలో 18 బంగారు, 2 వెండి, పతకాలను సాధించింది.

క్రీడా జీవితం
                     షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలతో వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్‌ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్‌ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆమె 4 ఒలింపిక్‌ క్రీడలతో పాటు 3 ఆసియా క్రీడలలో పాల్గొంది. 1984లో లాస్‌ ఏంజిల్స్‌ లో జరిగిన ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 1986లో సియోల్‌ లో జరిగిన ఆసియా క్రీడలలో పరుగు పందెంలో తన ట్రాక్‌ లైన్‌ను దాటినందుకు అనర్హత పొందింది. ఆమె ఆ సమయంలో పతకం సాధించే దిశలో ఉండింది.

                 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకొని ఒలింపిక్‌ క్రీడల మార్‌‌‌‌చఫాస్ట్‌ లో జాతీయ పతాకాన్ని పట్టిన తొలి భారతీయ మహిళగా పేరు సంపాదించింది. ఆమె సాధించిన అత్యుత్తమ ప్రతిభ 1:58.8 నిమిషాలు. దీన్ని 1995లో చెన్నైలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో నమోదు చేసింది. ఆమె ఆ సమయంలో తన కూతురు శిల్పాకు జన్మనిచ్చింది. అయినా మెరుగైన సమయాన్ని నమోదు చేయడం విషేశం. రెండు నిమిషాల లోపు సమయాన్ని నమోదుచేయడం కూడా ఇదే ప్రథమం.

వ్యక్తిగత జీవితం
         
షైనీ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత అయిన చెరియన్‌ విల్సన్‌ ను వివాహం చేసుకుంది. అతడు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌ (క్రీడల)గా పనిచేస్తున్నాడు.

ప్రారంభ జీవితం
                   షైనీ అబ్రహం 1965, మే 8న కేరళలోని ఇడుక్కి జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్‌ పై మక్కువ ఉన్ననూ కొట్టాయంలోని స్పోర్ట్‌‌స డివిజన్‌ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైనీ అబ్రహం, పి.టి.ఉష, ఎండి.వల్సమ్మలు ఒకే డివిజన్‌ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్‌ పి.జె.దేవెస్లా.

అవార్డులు

  • షైనీ అబ్రహంకు 1985లో క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు లభించింది.
  • 1996లో షైనీకు బిర్లా అవార్డు లభించింది
  • 1998లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది.
  • 1991లో చైనీస్‌ జర్నలిస్ట్‌ అవార్డు లభించింది.

0 Comments

ఆటో కుమారి

11/14/2013

0 Comments

 
Picture
           రోడ్డుకు గతుకుపూంత సహజమో... జీవితంలో ఒడిదుడుకులు కూడా అంతే! వాహనం నడిపేటప్పుడు... వీథి మలుపులను, స్పీడ్‌వూబేకర్లను దాటితేనే గమ్యాన్ని చేరుతాం... బతుకు బాటలో కన్నీళ్లు, కష్టాలను అధిగమిస్తేనే... విజయంతో నిలుస్తాం... అక్షరం రాకున్నా.. చేతిలో ఉన్న పనిని నమ్ముకుంది... జీవన పోరాటంలో రోజూ ఎన్నో వ్యూహాలను ఛేదిస్తోంది... ఆటోడ్రైవర్‌గా రాణిస్తూ... సాటి మహిళలకు స్ఫూర్తినిస్తోంది కరీంనగర్‌కి చెందిన రాజకుమారి.

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో.. తెలంగాణ ఎక్స్‌వూపెస్ కూత పెట్టుకుంటూ స్టేషన్‌ని చేరుకుంది.

                        పెద్దపల్లి నుంచి యైంటిక్లయిన్ కాలనీ వెళ్లే ఆటోలు వరుసగా బారులు తీరి ఉన్నాయి. ఆ దారి అధ్వాన్నంగా ఉంటుంది. అందుకే అటు వైపు తక్కువ ఆటోలు వెళతాయి. ఆటోడ్రైవర్‌లంతా వచ్చే ప్రయాణికుల కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో కుమారి కూడా ఉంది. అక్కడి డ్రైవర్‌లు ముందు కుమారి ఆటో నిండిన తర్వాతే తమ ఆటోలోకి ఎక్కించుకుంటారు ప్రయాణికులని. అక్కడి నుంచి ఆమె ప్రయాణం మొదలవుతుంది. అలా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కనీసం నాలుగు ట్రిప్పులు వేస్తుంది. ఆరు సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ఆమె సుపరిచితురాలు. ఆమె పేరులోనే రాజరికం ఉంది, కానీ ఆమె మాత్రం పేదరికాన్ని అనుభవిస్తున్నది. మగవాళ్ళకు ఏ మాత్రం తీసిపోకుండా తన సత్తాను చాటుతోంది. ఆటోడ్రైవర్ అంటే మగవాళ్లే అన్న మాటను కుమారి తిరగరాసింది. జిల్లాలోనే మొదటి ఆటోడ్రైవర్‌గా డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా పొందింది. త్వరలో హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకొని బస్సు స్టీరింగ్ తిప్పాలని కలలు కంటోంది.


అక్షరాలు నేర్వలేదు..
                రాజకుమారి సొంత ఊరు కేరళలోని కొల్లెం. ఆమెకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే కుటుంబమంతా బతుకుదెరువు కోసం కరీంనగర్‌జిల్లాలోని యైంటిక్లయిన్ కాలనీకి చేరుకుంది. కుమారికి ఒక తమ్ముడు. ఆ కుటుంబం ముందు చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆ తర్వాత తల్లిదంవూడులు ఒక చిన్న హోటల్ పెట్టారు. అందులో వాళ్ళకు చేదోడువాదోడుగా ఉండేది కుమారి. దాంతో బడి బాట పట్టలేదు. పైగా ‘ఆడపిల్లలకు చదువు అవసరం లేదు’ అంటూ తల్లిదంవూడులు అనడంతో ఆ ఊసే ఎత్తలేదామె. ఆమెకు చదువు మీద మాత్రం చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఖాళీ దొరికినప్పుడు పక్కింటి పిల్లల దగ్గరకు వెళ్ళి చదువు చెప్పమనేది. వాళ్ళు అక్షరాలు దిద్దుతుంటే చూసేది. అలా వాళ్లు చెప్పిన అక్షరాలను గుర్తుంచుకొని గోడల మీద పేర్లు, కరపవూతాలు చదవడం మాత్రం నేర్చుకుంది. కానీ రాయడం మాత్రం ఇప్పటికీ తెలియదు.

                     కుమారి తండ్రి దగ్గర చిన్న లూనా ఉండేది. ఆమెకు ముందు నుంచే కాస్త దూకుడెక్కువ. చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత చురుగ్గా ఉండేది. ఆ లూనా వేసుకొని కాలనీ అంతా చుట్టేది. అలా ద్విచక్ర వాహనం నడపడం అలవాటైంది. ఏవైనా పనులు చేయాలంటే బండి చేతికి ఇస్తేనే చేసేది. ఈ దూకుడుకు కల్లెం పడింది గోపీ పరిచయంతో. కుమారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేవాడు అతను. వాళ్ళది కూడా ఎక్కడి నుంచో వచ్చి జీవనం సాగిస్తున్న కుటుంబం. అతని తండ్రికి ఎస్టీడీ బూత్ ఉండేది. అందులోనే ఉండేవాడు ఆ అబ్బాయి. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు చెబితే ముందు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత వీళ్లు పట్టుబట్టడంతో ‘ఊ’ అనక తప్పలేదు వాళ్లు. అలా పదమూడేళ్ళకే సంసార జీవితంలోకి అడుగుపెట్టింది కుమారి.

ఆటో ప్రయాణం..
                       చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నా పెద్దగా అవి ఆమెను బాధించలేదు. కానీ పెళ్ళయ్యాక ఏ ఉద్యోగం లేని భర్త, పైగా పెద్దలు వద్దన్నా చేసుకున్న పెళ్ళి కావడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే భర్త ఆటో నడపడం మొదలుపెట్టాడు. కుమారి తల్లిదంవూడుల హోటల్లోనే పనిచేసేది. అలా కొన్ని సంవత్సరాలు జీవనాన్ని సాగించారు. కానీ అరకొర డబ్బులతో సంసారం కష్టమైపోయింది. అందుకే ఇనుప సామాన్ల దుకాణం పెట్టారు. అదీ వాళ్ళకు అచ్చిరాలేదు. ఆ దందాలో భర్త జైలుకు కూడా పోయాడు. ఆ సమయంలో ఎవ్వరూ వాళ్ళని ఆదుకోలేదు.

                        ఆ క్షణమే ఏమైనా చేయాలనుకుంది. కానీ ఏమీ చేయలేని నిస్సత్తువ. దాదాపు మూడు సంవత్సరాలు భర్తకు దూరంగా బతికింది. ఆ సమయంలోనే తల్లి కూడా చనిపోవడంతో హోటల్‌ని తనే చూసుకుంది. భర్త తిరిగి వచ్చాడు. మళ్లీ ఆటో నడపడం మొదలుపెట్టాడు. కుమారి అలాగే హోటల్‌నే నమ్ముకుంది. అయితే ఈ చాలీచాలని బతుకులు ఎందుకనుకునేది ప్రతిరోజూ. పైగా అప్పటికే ముగ్గురు పిల్లలు. రోజురోజుకు ఖర్చులు ఎక్కువ అవ్వడంతో ఏం చేయాలని రాత్రింబవళ్లు ఆలోచించేది. అలా వచ్చిన ఆలోచనే ఆటో నడపడం. రాత్రి భర్త ఆటోను ఇంటి ముందు పెట్టేవాడు. ఆటో ఖాళీగా ఉంటుంది కాబట్టి నేర్చుకుంటానని భర్తని అడిగింది. మొదలు ఒప్పుకోలేదు. కానీ ఆమె పట్టుబట్టడంతో అతను నేర్పించక తప్పలేదు. అలా రాత్రుళ్ళు ఆటో నడపడం నేర్చుకుంది మెల్లమెల్లగా. ఆ తర్వాత వాళ్ల పక్కింటి వాళ్ళ ఆటోను అడిగి ఉదయం కూడా ప్రాక్టీస్ చేసేది.

బ్యాంకు రుణంతో..
                     ఆటో నడపడమైతే అలవోకగా నేర్చుకుంది. లైసెన్స్ కోసమే చాలా కష్టాలు పడింది. చివరకు ఎలాగోలా లైసెన్స్ సంపాదించింది, కానీ ఆటో! అక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అమ్మాయి ఆటో నడపడమేంటి? బండి నడిపి క్షేమంగా తిరిగి తమ చేతికి ఇస్తుందా? అని చాలామంది చాలా సందేహాలు వెలిబుచ్చారు. ఆటో అద్దెకు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సొంత ఆటో అయితే ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదనుకుంది. బ్యాంకు రుణం కోసం దరఖాస్తు పెట్టుకుంది. బ్యాంకు వాళ్లు సానుకూలంగా స్పందించి ఆమెకు లోను ఇప్పించారు. ఇచ్చేముందు ఒక షరతు విధించారు. కచ్చితంగా ఆమె నడుపుతానం ఇస్తామని. అంతేకాదు, మధ్యలో చెక్ చేస్తామని కూడా చెప్పారు. అలా ఆమె ఆటో రోడ్డు మీదకు వచ్చేసింది. ఉదయం ఆటో ఆమె నడిపితే, రాత్రుళ్ళు అదే ఆటోను భర్త నడిపేవాడు.

సీఐ సహకారంతో..
                      ఆటోను రోడ్డయితే ఎక్కించింది కానీ మిగతా ఆటోవాళ్ళను, ప్రయాణికులను మెప్పించలేకపోయింది. అంటే.. ఒక అమ్మాయి ఆటో నడపడమేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒక్కరిద్దరినే ఎక్కించుకునైనా వెళ్ళిపోయేది. అలా.. అలా.. ఆమె డ్రైవింగ్ మీద నమ్మకం ఏర్పడింది అక్కడున్న వాళ్ళందరికీ. దాంతో ఆమె ఆటోలో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. కొన్ని రోజులు సాయంత్రం ఆరు, ఏడు వరకు కూడా ఆ లైన్లలో ఉండి ఆటో నిండాక కాని బయలుదేరకపోయేది. పెద్దపల్లి సీఐ ఇదంతా గమనించాడు. అక్కడున్న వాళ్ళతో ముందు కుమారి ఆటో నింపి పంపించేసి ఆ తర్వాత లైన్లు చూసుకోమన్నాడు. అప్పటి నుంచి ఆమె ఆటో నిండిన తర్వాతే అక్కడున్న మిగతా ఆటోలు కదులుతాయి.

అంతా పిల్లల కోసమే..
                   ‘‘నేను మొట్టమొదటిసారి మా ఆయనకు తెలియకుండా ఒకసారి ఆటో తీశాను. ఉదయం ఐదు గంటలకు నిద్రపట్టక ఆటో నడపుదామని అనుకున్నాను. అప్పుడే కాలనీలో రౌండ్లు వేస్తుంటే సింగరేణి వాళ్ళు పనులకు వెళుతూ ఆటో కోసం చూస్తున్నారు. నేను వెళ్లి తీసుకెళతాను అంటే ముందు తటపటాయించినా ఎక్కి కూర్చున్నారు. క్షేమంగా వాళ్ళని దించాను. దాంతో నా మీద నమ్మకం కుదిరింది వాళ్ళకి, నాకు కూడా. అలా ఆటో నడిపి 42 రూపాయలు సంపాదించాను. అప్పటిదాకా హోటల్ నడిపినప్పుడు వచ్చిన డబ్బులకంటే ఈ డబ్బులను చూస్తే ఎంతో గర్వంగా అనిపించింది.

                        ఎంతో సంతోషమేసింది కూడా! ఆ డబ్బులను తీసుకొచ్చి మా ఆయనకిచ్చాను. ముందు కాస్త మందలించారు చెప్పకుండా ఆటో తీసుకెళ్ళినందుకు కానీ ఆ తర్వాత సంతోషించారు. నేను ఇంత కష్టపడేది నా పిల్లల కోసమే. నాకెలాగూ చదువూసంధ్యా లేదు. కనీసం వాళ్ళనైనా మంచి కొలువుల్లో చూడాలి. వాళ్లు కూడా బాగా చదువుతున్నారు. అదే నేను ఎంతటి కష్టన్నైనా ఇష్టపడేలా చేస్తోంది. ఈ మధ్యే సాయంవూతంపూట కుట్టు మిషన్ కూడా నేర్చుకుంటున్నాను. అది కూడా ఏదో ఒకలా సాయంగా ఉంటుంది కదా! ఇంకా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. కానీ దానికి పదవతరగతి పాస్ కావాలంటా! నాకేమో అక్షరం కూడా రాదు. చదువుతానంటే పిల్లలేమో వద్దంటున్నారు. కానీ ఎలాగైనా చదివి తీరాలని నాకనిపిస్తోంది. ఏ రోజుకారోజు సంపాదిస్తేనే పూట గడవడం కష్టంగా ఉంది. ఇంకా చదువు మీద ధ్యాసే ఏముంటది? అందుకే ఆలోచిస్తున్నాను.’’


0 Comments

రుక్మిణి త్యాగం

11/13/2013

0 Comments

 
Picture
రుక్మిణి దేవి మధురై లో ఒక ఎగువ తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904 న జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠ శాస్త్రి, ఒక పండితుడు మరియు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా, పని చేసేవాడు. అతను ఒక బదిలీ ఉద్యోగం ఉంది మరియు కుటుంబం తరచుగా మారుతూ. అతను 1901 లో దివ్యజ్ఞాన సమాజం ప్రవేశపెట్టారు. లోతుగా డాక్టర్ అనిబిసెంట్ ఒక అనుచరులుగా దివ్యజ్ఞాన ఉద్యమంలో ప్రభావితం, నీలకంఠ శాస్త్రి అతను దివ్యజ్ఞాన సమాజం అడయార్ యొక్క ప్రధాన కార్యాలయం సమీపంలో తన ఇంటి నిర్మించాడు విరమణ మీద చెన్నై, అడయార్ తరలించబడింది. ఇది యువ రుక్మిణి కేవలం దివ్యజ్ఞాన ఆలోచన బారినపడ్డారు ఇక్కడ, కానీ సంస్కృతిపై కూడా కొత్త ఆలోచనలు, తరువాత థియేటర్, సంగీతం మరియు నృత్య, మరియు అన్నే బిసెంట్ అత్యంత సన్నిహితుడు మరియు తరువాత ప్రఖ్యాత బ్రిటీష్ Theosophist డాక్టర్ జార్జ్ Arundale కలుసుకున్నారు వారణాసి లో సెంట్రల్ హిందూ మతం కాలేజ్ యొక్క ప్రధాన, మరియు వెంటనే అతనితో శాశ్వత బాండ్ నిర్మించడానికి. [3]

వారు అప్పుడు సాంప్రదాయ సమాజంలో షాక్ చాలా 1920 లో పెళ్లి చేసుకున్నాడు. వివాహం తరువాత, ఆమె అధ్యాపకురాలు అయిన మరియా మాంటిస్సోరి, మరియు కవి జేమ్స్ కజిన్స్ తో సహ దివ్యజ్ఞాన మరియు అనుకరించారు స్నేహాలు సమావేశం, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించారు. 1923 లో, ఆమె యంగ్ దివ్యజ్ఞాన అన్ని భారతదేశం సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన [4], మరియు 1925 లో యంగ్ దివ్యజ్ఞాన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అధ్యక్షుడు. [5]

1928 లో, ప్రముఖ రష్యన్ నృత్య కళాకారిణి అన్నా పావ్లోవా బాంబే సందర్శించిన మరియు Arundale జంట ఆమె నటన వెళ్లిన, మరియు తరువాత ఆమె తదుపరి చేయటానికి అక్కడ ఆస్ట్రేలియా తన అదే ఓడ, ప్రయాణము జరిగింది; ప్రయాణ సమయములో వారి స్నేహం పెరిగింది , మరియు వెంటనే రుక్మిణి దేవి అన్నా ప్రముఖ సోలో నృత్యకారులు ఒకటి, క్లియో Nordi. [6] నుండి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది ఇది రుక్మిణి దేవి అపఖ్యాతి పడిపోయింది మరియు అంకితం చేసిన సాంప్రదాయ భారతీయ నృత్య రూపాలు ఆవిష్కరించడం ఆమె దృష్టి సారించింది ఆ అన్నా అభ్యర్ధనపై తరువాత వారి పునరుద్ధరణ లోకి ఆమె జీవితం మిగిలిన. [7]

రుక్మిణి దేవి ఏప్రిల్ 1952 లో రాష్ట్రాల భారత పార్లమెంటు యొక్క కౌన్సిల్, రాజ్యసభ సభ్యునిగా నామినేట్ మరియు 1956 లో తిరిగి ఎంపికయ్యాడు. [20] అతనికి జంతు సంక్షేమ ఆసక్తి, ఆమె వివిధ మానవతావాద సంస్థలైన సంబంధం, మరియు సభ్యుడిగా జరిగినది రాజ్య సభ, జంతువులు చట్టం టు అనిమల్ నివారణ చట్టం, 1960 వాయిద్య మరియు తరువాత 1962 లో ఆమె ఆధ్వర్యంలో, భారతదేశం యొక్క యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ఆమె 1986 లో ఆమె మరణానికి వరకు, దాని బోర్డులో ఉంటాయి.

ఆమె ఒక ఖచ్చితమైన శాకాహారి మరియు చాలా దేశంలో శాకాహార ప్రోత్సహించడానికి పని లేదు. ఆమె 1955 నుండి, 1986 లో ఆమె మరణించే వరకు 31 సంవత్సరాలు అంతర్జాతీయ శాఖాహారం యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. [21]

1977 లో, మొరార్జీ దేశాయి ఆమె తిరస్కరించింది ఇది భారతదేశం యొక్క అధ్యక్షుడు పోస్ట్ కోసం ఆమె ఎంపిక ఇచ్చింది. [22] రుక్మిణి దేవి Arundale చెన్నై ఫిబ్రవరి 1986 24 న మరణించాడు. 1978 లో, 'Kalamkari సెంటర్' ("pencraft) వంటి టెక్స్టైల్ ప్రింటింగ్ భారతీయ ప్రాచీన క్రాఫ్ట్ పునరుద్ధరణ Kalakshetra వద్ద ఏర్పాటు. [23]

'మన దేశ అత్యున్నత పదవినిస్తాం రండి, రాష్ట్రపతిని చేస్తాం రారండి' అంటే వద్దనేవాళ్లుంటారా? దేశప్రథమ పౌరుడి హోదాను పొందడానికి జీవితమల్లా వేచిచూసేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ 'ఆ పదవి వద్దు, అక్కడి హంగూఆర్భాటాలను నేను భరించలేను' అనేవాళ్లు ఉంటారా? 'ఉన్నారు. రుక్మిణీదేవి అరండేల్ ఆ పదవిని తృణప్రాయంగా త్యజించారు. అటువంటి మహిళ గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియాలి' అన్నారు మన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

భరతనాట్య కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ చెన్నైలో స్థాపించిన 'కళాక్షేత్ర'లో ఆమె స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ, తాను సిద్ధం చేసుకున్న ప్రసంగం మధ్యలో ఈ సంగతులను గుర్తుచేసుకుని మరీ చెప్పడం పెద్ద విశేషం!

'1977లో నేను కాంగ్రెస్ ఎంపీని. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. దాన్ని భర్తీ చెయ్యమని ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ స్వయంగా రుక్మిణీదేవి అరండేల్‌ను ఆహ్వానించారు. ఆయన నిర్ణయానికి ఒక్కరు కూడా ఎదురుచెప్పలేదంటే ఆమె ఎంత ఉన్నతమైన మహిళో అర్థమవుతుంది. అంత అత్యున్నతమైన పదవి అడక్కుండానే వచ్చినా కూడా రుక్మిణీదేవి దాన్ని తృణప్రాయంగా త్యజించడం అనేది ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞానం, స్థిరచిత్తం, ఎంతటి త్యాగానికైనా వెనుదియ్యకపోవడం అనే భారతీయ విలువలు ఆమెలో మూర్తీభవించాయి...' అంటూ రుక్మిణీదేవిని గురించి విద్యార్థులకు తెలియజేశారు ప్రణబ్ ముఖర్జీ. 'ఆమె రాష్ట్రపతి పదవిని కాదన్నారు, కానీ కళాక్షేత్రలో ఎందరో రాష్ట్రపతులకు ఆతిథ్యమిచ్చారు...' అంటూ చమత్కరించారు.

ఇంతలో ప్రణబ్‌కు తన మాతృభూమి కూడా గుర్తుకొచ్చింది. 'మన దేశంలో కళలకు కొత్తరూపునివ్వాలన్న రుక్మిణీదేవి ప్రయత్నానికి మొట్టమొదట వత్తాసు పలికింది రవీంద్రనాథ్ ఠాగూరే. కళాక్షేత్ర అన్న పేరు ఆయనకెంత నచ్చిందంటే, శాంతినికేతన్ ప్రారంభించక ముందుగానీ తనకా పేరు తట్టి ఉంటే, అదే పెట్టేవాణ్నని ఆయన అనేవారు' అంటూ గుర్తుచేసుకున్నారు ప్రణబ్ దా. 'కళాక్షేత్ర, శాంతినికేతన్ - రెండూ భూమ్మీది రెండు శాంతిధామాలు. కళలకు దేవాలయాలు...' అంటూ పొగిడారాయన


0 Comments

తండ్రిని మించిన తనయ

11/12/2013

0 Comments

 
Picture
తొలిసారే 1,72,043 మెజారిటీ
ఎఐసిసి సెక్రటరీగా నియామకం
సమస్యలపై నిరంతర పోరాటం
ట్రస్టుతో ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు
  చేయడం అంటే ఎంతో అభిమానం

ప్రియాదత్‌ యువ రాజకీయ నేతల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. సునీల్‌ దత్‌ కూతురిగా, సంజయ్‌దత్‌ సోదరిగా రాజకీయాల్లోకి వచ్చినా తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మెుదటిసారి 14వ లోక్‌సభకు ముంబయ్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం 15వ లోక్‌సభలోనూ కొనసాగుతున్నారు.

బాలీవుడ్‌లో పేరుపొందిన నటుడు సునీల్‌ దత్‌ కూతరు ప్రియాదత్‌. తల్లి నర్గీస్‌ కూడా పేరుపొందిన నటి. వీరిద్దరూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. సునీత్‌ దత్‌ మంత్రిగా కూడా పనిచేశారు. సంజయ్‌ నటనను వారసత్వంగా ఎంచుకోగా ప్రియా మాత్రం రాజకీయాలను ఎంచుకుంది. తండ్రి నుంచి ఎన్నో రాజకీయ పాఠాలు నేర్చుకుంది. రాజకీయ నాయకురాలు అనే హోదా కోసం కాదని ప్రజా సేవ చేయడమే తన పరమార్థం అని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ పూర్తికాగానే టెలివిజన్‌ అండ్‌ వీడియో రంగంలో కొంత కాలం పనిచేసింది. తరువాత న్యూయార్క్‌లో మీడియా ఆర్ట్‌‌సలో విద్యను అభ్యసించింది. 1992-93లో జరిగిన అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయిన ముస్లిం శరనార్థుల కోసం ఆమె సహాయ చర్యలు తీసుకున్నారు. 2005లో రాజకీయ అరంగేట్రం చేసిన ముంబయ్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. శివసేన పార్టీ లీడర్‌పై 1,72,043 ఓట్ల మెజారీటీ సాధించింది.

ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ విజయం సాధించిన మహిళగా ఈమె పలువురి ప్రశంసలు పొందారు. దీంతో ముంబయ్‌లో మీడియా వర్గాలు దత్‌ విజయంపైనే ఫోకస్‌ చేశాయి. అన్యూహ్య విజయం అంటూ పొడగ్తల వర్షం కురిపించాయి. తండ్రిని మించిన తనయ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. కానీ ఆమె ఈ రాతలకు, ప్రశంసలకు ఏ మాత్రం పొంగిపోలేదు. అంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తాను ఏం చేయగలనో అన్న దానిపైనే ఆమె దృష్టి పెట్టారు. విచిత్రంగా ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె ఓ బాబుకు జన్మనివ్వడం జరిగింది. దీంతో కొంత ప్రచారానికి ఇబ్బంది ఏర్పడింది. తరువాత ప్రియా ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆమె పరిధిలోని శాసనసభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులతో నిరంతరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. అదో టైంటేబుల్‌లా ఏర్పాటు చేసుకున్నారంటే ఆమె చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఉత్తమ పాలన అందించడం కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉండేది. అంతేకాదు పేదలకు సాయం చేయడం కోసం తల్లి నర్గీస్‌ పేరు మీద ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2008 బీహార్‌లో వరదలు వచ్చి ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు.

మన రాష్ట్రం కాదు కదా .. మనకెందుకు అని అనుకోకుండా వందలాది మంది వంటపాత్రలు, బియ్యం అందజేయడంలో ఈ ట్రస్టు కీలకపాత్ర పోషించింది. నేరుగా భర్తతో కలిసి ప్రియా సహాయ శిబిరాలను సందర్శించి వస్తుసామగ్రిని పంపిణీ చేశారు. కామతిపుర ప్రాంతంలోని సెక్స్‌ వర్కర్లను ఆ ఊబిలోంచి బయటకు తీసుకుని వచ్చి వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తన విన్నపాన్ని తెలియజేశారు. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఓవెన్‌ రాన్‌కాన్‌ను వివాహం చేసుకుంది. ఓరాన్జాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈయన వాటాదారుడు. ఇది వివిధ దేశాల్లో మ్యూజిక్‌ను అందించే కంపెనీ. రాన్‌కాన్‌, ప్రియాలకు ఇద్దరు సంతానం సిదార్థ, సుమీర్‌.


0 Comments

ఆత్మరక్షణ పాఠాలతో అండ

11/8/2013

0 Comments

 
Picture
చిన్నప్పుడే నాన్న చనిపోయారు. తాను చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో, చుట్టుపక్కల గ్రామాల్లోని ఎందరో అమ్మాయిల్ని చదువుల బాటలో నడిపించిన వైభవి... యునిసెఫ్‌ నుంచి నవజ్యోతి అవార్డు గెలుచుకుంది.

          మాది మారుమూల గ్రామం. అమ్మాయిలకు రక్షణ తక్కువ. ఈ కారణాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేవారుకాదు. మా అమ్మానాన్నలు రోజు కూలీలే. కానీ నన్ను బాగా చదివించాలని కలలు కన్నారు. ఇబ్బంది అయినా బడికి పంపేవారు. నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. తట్టుకోలేకపోయా. బడికెళ్లడం మానేశా. అమ్మ ఓదార్చింది. 'నువ్వు చదువుకుని ఈ గ్రామం వాళ్లకీ దారి చూపిస్తావని నాన్న అనుకుంటే ఇలా చేస్తావేం..' అని కోప్పడింది. దాంతో స్కూలు దూరమైనా ధైర్యంగా వెళ్లేదాన్ని.

                ఒకసారి దారి మధ్యలో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేయబోయాడు. అమ్మ నూరిపోసిన ధైర్యం గుర్తొచ్చింది. బ్యాగుతో బలవంతంగా అతని తలమీద కొట్టి తప్పించుకున్నా. తరవాత గ్రామంలోని అమ్మాయిలతో మాట్లాడితే 'ఇంట్లోంచి కాలు బయటపెట్టాక ఇలాంటి బాధలు చాలానే పడ్డాం' అని చెప్పారు. ఈ అన్యాయాని ఎన్ని రోజులు భరించాలి... కచ్చితంగా అడ్డుకోవాలి అనుకున్నా. వూళ్లో అమ్మాయిలందర్నీ ఒకచోటికి చేర్చాను. వేధింపులనీ, అఘాయిత్యాలనీ, బాల్యవివాహాల్నీ ఎదుర్కొందాం అని ధైర్యం నూరిపోశాను. అందర్నీ ఒప్పించడానికి రెండు నెలలు పట్టింది. 'నలుగురైదుగురు కలిసి వెళ్లండి. పుస్తకాల బ్యాగుల్నే ఆయుధాలుగా చేసుకోండి. చదువు మాత్రం మానొద్దు' అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టా. దారికాచి అడ్డుకునే వాళ్లకి, బ్యాగులతో ఎలా బుద్ధి చెప్పొచ్చో శిక్షణ ఇప్పించా. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతో మాట్లాడా. చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎన్ని సమస్యలొస్తాయో వైద్య నిపుణులతో చెప్పించా. అలా చాలా పెళ్లిళ్ళు ఆపగలిగా. కిందటేడాది ఇంటర్‌ పూర్తయింది. ఇప్పుడు మా సొంతూరు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో నా పేరు తెలియని వాళ్లుండరు. వేల మంది చదువుకునేలా స్ఫూర్తిని అందించినందుకు గాను యునిసెఫ్‌ 'నవజ్యోతి' అవార్డు నాకు లభించింది.

0 Comments

మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి

11/7/2013

0 Comments

 
Picture
తొలిసారిగా పత్రికా రంగంలో ప్రవేశం
తరువాత రాజకీయాల్లోకి...
యుపిఏ హయాంలో రాజ్యసభకు నామినేట్‌
బాల్య వివాహాల రద్దుకు పోరాటం
వ్యాపార దక్షతలోనూ తనకు తానే సాటి


              దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలో ఒకరైన ేకేక బిర్లాకు కుమార్తెగా శోభన భార్టీయా అందిరికీ తెలుసు. తన పుట్టినిల్లే కాదు, మెట్టినిల్లు సంపన్న కుటుంబమే. అరుున తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని చిన్ననాటి నుంచే తపించేవారు. పత్రికా రంగంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా సేవలను అందించారు. రాజ్యసభలోనూ అడుగుపెట్టి బాల్య వివాహాలను అరికట్టాలని తన గళాన్ని బలంగా వినిపించారు. ఇలా చేపట్టిన ప్రతి పనిలో తన శైలితో ముందుకు దూసుకుపోతున్నారు శోభన. 2009 ఫోర్బ్‌‌స పత్రిక వెల్లడించిన దేశంలోని ధనికుల తొలి వంద మంది జాబితాలో 76 స్థానాన్ని ెకైవసం చేసుకున్నారు. అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా నిలిచారు.

                    2006లో ది హిందూస్థాన్‌ టైమ్స్‌ గ్రూప్‌కి చైర్‌ పర్సన్‌గా, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు శోభన చేపట్టారు. శోభనా భార్టియా 1957లో జన్మించారు. పారిశ్రామిక నేత కేకే బిర్లా కుమార్తె. జీడీ బిర్లాకు మనవరాలు. బిర్లా కుటుంబంలో ఆడపిల్లగా జన్మించినా ఆ వ్యాపార చతురత ఈమెకి వంటబట్టింది. కేకే బిర్లా కుటుంబం హెచ్‌టీ మీడియాలో 75.36 శాతం స్టాక్‌ను కలిగి ఉంది. దీని విలువ దాదాపు రూ.834 కోట్లు (2004) కలకత్తా యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్‌ని శోభన పూర్తి చేశారు. శ్యాంసుందర్‌ భాటియాను పెళ్లి చేసుకుంది. ఇతను రూ.14 బిలియన్‌ విలువ కలిగిన ఫార్మా సంస్థ జూబిలాంట్‌ ఆర్గానోసిస్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌. శ్యాం సుందర్‌ భార్టియా తండ్రి లేట్‌ మోహన్‌ లాల్‌ భార్టియా. వారి కుమారుడు షమిత్‌ భార్టియా హెచ్‌టీ మీడియా గ్రూప్‌కు డైరెక్టర్‌. శోభన మెట్టినింటి వారు కూడా ప్రముఖ వ్యాపార వేత్తలు కావడంతో తనకున్న ఆలోచనలు అమలు చేయడానికి అవకాశం దొరికింది. శ్యాం సుందర్‌లకు పలు వ్యాపారాలున్నాయి. డోమినో పిజ్జా ఫ్రాంచీజ్‌ వంటి లైఫ్‌ స్టైల్‌ బిజినెస్‌ లను ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరులో స్టోర్‌ చెయిన్‌ నడిపిస్తున్నారు.

                   1986 సంవత్సరం హిందూస్తాన్‌ టైమ్స్‌లో శోభన ఉద్యోగంలో చేరారు. ఒక జాతీయ దినపత్రికలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన తొలి మహిళగా శోభన నిలిచారు. అంతే కాకుండా తక్కువ వయసులో ఆ బాధ్యతను నిర్వర్తించిన మగువగా పేరుగాంచారు. జర్నలిజంలో ప్రవేశం లేకపోయినా తన బాధ్యతను చక్కగా నెరవేర్చేవారు.2006 ఫిబ్రవరిలో శోభన రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియాగాంధీ ప్రోత్సాహంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ స్థానాన్ని సైన్స్‌, ఆర్ట్‌, సామాజిక సేవల్లో నిపుణులైన వారికి కేటాయిస్తారు. మీడియాలో సేవ కేటగిరిలో ఆ స్థానం దక్కించుకున్నారు. సామాజిక సేవ విభాగంలో ఆమెను ఎన్నుకున్నారు. 2006లో బాల్యవివాహాలను రద్దు చేయాలని రాజ్యసభలో తన వాదాన్ని శోభన గట్టిగా వినిపించారు.వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(1996) నుంచి గ్లోబల్‌ లీడర్‌ ఆఫ్‌ టుమారో అవార్డును తీసుకుంది. 2001లో పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యాపార వేత్తగా నిలిచారు. నేషనల్‌ ప్రెస్‌ ఇండియా అవార్డు 1992 తీసుకున్నారు.

                           బిజినెస్‌ వుమన్‌ అవార్డు, ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డ్‌‌స ఫర్‌ కార్పొరేట్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్‌‌స 2007 తీసుకున్నారు. ప్రస్తుతం ఎండీవర్‌ ఇండియాకు చైర్మన్‌గా ఉన్నారు. 2001లో పంజాబ్‌, హర్యాన, ఢిల్లీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నుంచి బిజినెస్‌ ఉమెన్‌ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 2003లో భారతీయ మీడియా శక్తివంతురాలైన 50 మంది మహిళా జాబితాలో చోటు చేసుకున్నారు. శోభన హిందూస్థాన్‌ టైమ్స్‌ అండ్‌ హిందూస్థాన్‌లో ప్రముఖ పదవిలో కొనసాగారు. హెచ్‌టీని శోభన తాతయ్య ఘన్‌శ్యామ్‌ దాస్‌ బిర్లా స్థాపించారు. దీనిని మహాత్మ గాంధీ 1924లో ప్రారంభించారు.

                           తన తండ్రి మీడియా బిజినెస్‌లో కొనసాగారు. ఈమె వివాహం అనంతరం 1985లో పదవిలో చేరారు. భర్త శ్యామ్‌ భార్టియా ఈ ఫోర్బ్‌‌స జాబితాలో 54వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక్కడ పత్రికలే కాకుండా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ని 2007లో భాగస్వామి తీసుకున్నారు. అలాగే పబ్లిస్‌ మింట్‌, డెయిలీ బిజినెస్‌ న్యూస్‌ పేపర్‌. ఎఫ్‌ రేడియో చానల్‌ను నడిపించేందుకు వర్జిన్‌ రేడియోతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమె ఇద్దరూ కొడుకులు తనతో పాటే కలిసి పని చేస్తున్నారు. ఈమె శాఖాహారి. అయినా ఎంతో ఫిట్‌గా ఉంటారు.

                2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత 2005లో మొదటిసారి పద్మశ్రీ అవార్డుకు శోభన నామినేట్‌ అయ్యింది. ఈ అవార్డు జర్నలిజంలో పనిచేసిన వారి ఇస్తారు. కాని జర్నలిస్ట్‌ కంటే ఈమె పారిశ్రామిక వేత్తగానే ఎక్కువగా ఉందని కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు, రాజ్యసభ నామినేషన్‌ రెండూ యూపీఏ ప్రభుత్వం పరిపాలన కాలంలో జరిగాయి.

0 Comments

ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ

11/5/2013

0 Comments

 
Picture
జైలంటే శిక్షలూ, బాధలూ అన్న భావనను దూరం చేస్తూ... ఉదయ్‌పూర్‌లోని జైలు ఒక ఆశ్రమంలా కనిపిస్తుంది. ఉదయం లేచింది మొదలు అక్కడున్న ఖైదీల దినచర్య యోగా, ధ్యానంతో మొదలై... రాత్రి పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో చాలామంది చదువులతో రాణించారు. బయటికొచ్చాక ఉద్యోగాలు సాధించారు. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే... వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చిన ఇందిర గురించి చదవాల్సిందే! ఉదయపూర్  జైల్లో ఎవర్ని అడిగినా వాళ్లంతా చెప్పే పేరు ఇందిర.

జైలంటే శిక్షలూ, బాధలూ అన్న భావనను దూరం చేస్తూ... ఉదయ్‌పూర్‌లోని జైలు ఒక ఆశ్రమంలా కనిపిస్తుంది. ఉదయం లేచింది మొదలు అక్కడున్న ఖైదీల దినచర్య యోగా, ధ్యానంతో మొదలై... రాత్రి పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో చాలామంది చదువులతో రాణించారు. బయటికొచ్చాక ఉద్యోగాలు సాధించారు. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే... వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చిన ఇందిర గురించి చదవాల్సిందే! దయ్‌పూర్‌ జైల్లో ఎవర్ని అడిగినా వాళ్లంతా చెప్పే పేరు ఇందిర.

                       మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖైదీల్లో మార్పు కోసం కృషి చేసింది. అందుకోసం రోజూ జైలుకి వచ్చి శిక్ష అనుభవిస్తున్న వారిని గమనించేది. కొందరు అపరాధ భావంతో కుంగిపోయేవారు. ఇంకొందరు కోపంతో వింత చేష్టలతో జైలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టేవారు. అలాగని వారి చేష్టలకు ఇందిర విసిగిపోలేదు. క్షణికావేశంలో నేరాలు చేసి అక్కడికొచ్చిన వారి జీవితాలు పూర్తిగా పాడయిపోకుండా చూడాలనుకుంది. ఆమె 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' గురు రవిశంకర్‌ శిష్యురాలు. యోగా, ధ్యానంతో వారిలో మార్పు తీసుకురావడం సాధ్యమే అనుకుంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా? మొదట ఖైదీలు మాట వినాలి. అధికారులూ అనుమతి ఇవ్వాలి. ఈ రెండింట్లో మొదటిది జరిగితే, రెండోదాన్ని సాధించొచ్చు. అందుకే మొదట మహిళా ఖైదీలకు దగ్గరవ్వడానికి ప్రయత్నించింది.

                       కొందరు భయపడి దూరం జరిగారు. మరికొందరు తనపై దాడి చేసి, హింసాత్మకంగా ప్రవర్తించారు. ఇందిర అన్నీ ఓపిగ్గా భరించింది. తరచూ వారి మంచీచెడులూ కనుక్కొంటూ.. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు తెలుసుకుని వూరటనిచ్చేలా మాట్లాడేది.ఇలా ఏడాది పాటు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒక్కొక్కరుగా అందరూ తనని అర్థం చేసుకుని, ఆమె చెప్పినట్టు వినడం, మంచి పద్ధతులు పాటించడం చేశారు. సరిగ్గా అప్పుడు, వారికి రకరకాల నైపుణ్యాలు నేర్పించడానికి జైలు అధికారుల అనుమతి కోరింది. మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ మహిళా ఖైదీలు, ఆమె మాటలకిచ్చే విలువను ప్రత్యక్షంగా చూశాక ఒప్పుకోక తప్పలేదు. దాంతో జైల్లో యోగా, ధ్యానం తరగతులు మొదలయ్యాయి. కోపావేశాలను తగ్గించుకుని ఆనందంగా జీవించేలా 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' గురించి అవగాహన కల్పించింది.

                     నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించింది. ఆర్నెల్లు తిరిగేసరికి జైలు వాతావరణంలో మార్పొచ్చింది. అల్లర్లూ, గొడవలూ తగ్గాయి. ఖైదీలలో జీవితం పట్ల కొత్త ఆశలు కలిగాయి. ఇదంతా గమనించిన అధికారులు ఆశ్చర్యపోవడమే కాదు... మరిన్ని మంచి పనులు చేయమని ఇందిరను ప్రోత్సహించారు. నెలకు రెండుసార్లు సైకాలజీ వర్క్‌షాపులూ... ప్రతి ఆదివారం యోగాకు సంబంధించిన సెమినార్లూ ప్రారంభమయ్యాయి. కళాశాల సెలవుల్లో విద్యార్థులనూ, లెక్చరర్లనూ పిలిపించి ఆసక్తి ఉన్నవారికి ఆంగ్లం, కంప్యూటర్‌ తరగతులూ... ఉన్నత విద్యావంతులకు ఫ్రెంచ్‌, జర్మన్‌ క్లాసులూ ఏర్పాటు చేసింది. జైలులో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులతో మాట్లాడి వేల పుస్తకాలు తెప్పించి అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్కరూ రాత్రిపూట పడుకొనే ముందు కచ్చితంగా కాసేపయినా చదువుకోవాలనే నిబంధన పెట్టింది.

                         ఈ విధంగా మీ ప్రవర్తనలో తెచ్చుకునే మార్పుల వల్ల త్వరగా జైలు నుంచి బయటపడే అవకాశం ఉంది అంటూ నచ్చజెప్పింది. నలుగురైదుగురు ఖైదీలు తమ అనుభవాలను రాస్తే వాటిని పుస్తకాలుగా ప్రచురించింది.'ఖైదీలనగానే తప్పు చేసిన వాళ్లనే భావనతోనే అంతా చూస్తారు. వాళ్లు విడుదలై బయటకు వెళ్లినా, అపరాధ భావంతో నలుగురిలో కలవలేరు. కొందరి మానసిక స్థితి తీవ్ర స్థాయికి వెళ్లి... వాళ్లు బయటికెళ్లినా మనుషుల్ని ద్వేషిస్తారు. నేరాలు చేస్తారు. ఆ పరిస్థితులు తలెత్తకుండా అంతా ఆనందంగా ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాను. అవి కొన్ని వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. త్వరగా విడుదలైన వారిలో యాభై మందికిపైనే డేటా ఎంట్రీ ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధితో జీవిస్తున్నారు. డిగ్రీ మాత్రమే కాకుండా... జ్యోతిష్య శాస్త్రాన్నీ దూరవిద్య ద్వారా చదువుకొనే అవకాశం కల్పించాం' అంటూ వివరించింది ఇందిర.



0 Comments

కారుణ్య బంధం

11/4/2013

0 Comments

 
Picture
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే!
 ప్రతి ఒక్కరికీ ఒక మంచి రోజు ఉంటుందని సామెత.
 రీనా లాంటి వాళ్లు ఉంటే..
 ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే... ఎవ్రీ డే!
 ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ మంచిరోజే...
 మనుషులకైనా, శునకాలకైనా!
 రీనా... వీధికుక్కల్ని చేరదీస్తుంటారు.
 అక్కడితో అయిపోలేదు.
 పెంపుడు కుక్కల కోసం...
 డే కేర్ సెంటర్ నడుపుతున్నారు.
 ‘వి కేర్ యానిమల్’ అనే సంస్థని కూడా పెట్టారు.
 కుక్కలపై రీనా ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే...
 ‘తనను పెళ్లిచేసుకునే అబ్బాయికి
 కుక్కలంటే ప్రేమ ఉండాలి’ అని కండిషన్
 పెట్టే వరకు!!
 ఈ కండిషన్ వెనుక, కారుణ్యం వెనుక ఉన్న కథే...

             పెంపుడు జంతువులను ప్రేమతోసాకి, ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ చాలామందే ఉన్నారు. అయితే వీధికుక్కల్ని చేరదీసి వాటి హక్కులకోసం పోరాడేవారు మాత్రం చాలా అరుదు. రీనా ఆ కోవలోకే వస్తారు. ‘‘నేను తొమ్మిదోతరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు స్కూలుకి వెళుతుంటే రోడ్డు పక్కనే పడుకొన్న కుక్కమీదకు ఓ కారు దూసుకొచ్చింది. కారు కుక్క దగ్గరగా రాగానే...స్టాప్...స్టాప్ అంటూ గట్టిగా అరిచాను. అయినా కారు డ్రైవర్ వినిపించుకోకుండా కారుని కుక్కపై నుంచి పోనిచ్చేశాడు. అయితే అప్పటికే నేను కారు నెంబరు నోట్ చేసుకున్నాను... స్కూలు బ్యాగు పక్కన పెట్టి చనిపోయిన కుక్కని నేను, నా స్నేహితులు కలిసి పక్కకు లాగాము.

                    వెంటనే బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. వాళ్లు పీపుల్ ఫర్ ఏనిమల్(పిఎఫ్‌ఎ) నెంబర్ ఇచ్చారు. పిఎఫ్‌ఎకి ఫోన్ చేస్తే వాళ్లొచ్చి చనిపోయిన కుక్కను  తీసుకెళ్లి పోస్టుమార్టం చేసి ఖననం చేశారు. నేనిచ్చిన కారు నంబరు తీసుకుని కేసు ఫైల్ చేశారు. కారు నడుపుతున్నవ్యక్తి గవర్నమెంటు అధికారి కారు డ్రైవరు. ఈ కేసు వల్ల ఆర్నెల్లు తిరక్కుండానే అతని ఉద్యోగం పోయింది. అప్పటికిగాని నాకు కోపం తగ్గలేదు’’ అంటూ రీనా ఏడేళ్లకిత్రం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటున్నప్పుడు మూగజీవులకు ఆమె మనసులో ఉన్న స్థానం ఎంతటిదో అర్థమవుతుంది. తన జీవితం కుక్కల క్షేమం కోసమే అంటోన్న రీనా చెప్పిన వివరాలివి..
 
                     శునక సంరక్షణకోసం పనిచేసే స్వచ్ఛందసంస్థలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా...రోజు రోజుకీ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యకు తగ్గట్టు ఆ సేవల్ని పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్ దగ్గర శ్రీలక్ష్మినగర్ కాలనీలో ఉండే రీనా తను డిగ్రీ చదువుతున్న సమయంలో ‘వి కేర్ ఏనిమల్’ అనే సంస్థని స్థాపించి ఇంటిదగ్గరే కుక్కలకోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక పక్క చదువు మరో పక్క కుక్కల పెంపకం...తనకు చేతనైనంత మేరకు రెండింటికీ న్యాయం చేసింది.

                  ‘‘నాన్న లింగారావు ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ విమల గృహిణి. చెల్లి, తమ్ముడు...అందరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమన్నమాట. ఎంత ఎక్కువంటే...స్కూలు నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఓ పదికుక్కలు వెంటే వచ్చేవి. ఇంటర్ అయ్యేవరకూ వీధి కుక్కలకు హానీ చేయకూడదంటూ కనిపించినవారికల్లా చెబుతుండేదాన్ని. డిగ్రీలో చేరాక కుక్కల కోసం సమయం కేటాయించే అవకాశం ఏర్పడింది. దాంతో షెల్టర్ ఏర్పాటు చేశాను. చాలామంది దూరప్రాంతాలకు వెళ్లాల్సివచ్చినపుడు తమ పెంపుడు కుక్కల్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుక్కలకు డేకేర్‌లాంటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాను.

                    గాయాలపాలైన వీధికుక్కల్ని తీసుకొచ్చి చికిత్స చేయించి వాటికి  పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించి షెల్టర్‌లో పెట్టుకుని పెంచేదాన్ని’’ అని చెప్పారు రీనా. వీధి కుక్కలకు వైద్యం, పెంపుడు కుక్కలకు డేకేర్ సదుపాయం ఏర్పాటు చేసి ఉన్నంతలో కుక్కలకు సేవ చేసుకుంటున్న రీనాకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. కుక్కల్లో పిల్లల తల్లులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడతాయని అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తన దగ్గర వదిలేయమని ఒక ప్రకటన ఇచ్చింది. అప్పుడు మొదలైంది అసలు కథ.
 
 పాలు తాగించి...పక్కనే ఉండి
 
                ‘‘నేనిచ్చిన ప్రకటన చూసి జిహెచ్‌ఎమ్‌సివాళ్లు ఓ నలభైకుక్కల్ని తీసుకొచ్చి నాకప్పగించారు. వాటివెంట నెలల పిల్లలతో పాటు రోజుల వయసున్న బుజ్జి బుజ్జి కూనలు కూడా ఉన్నాయి. తల్లికుక్కలకు కడుపునిండా అన్నం పెట్టి పిల్లలమధ్య వదిలేస్తే ఒక్క కుక్క కూడా పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. విషయం ఏంటంటే... ఆ పిల్లలేవీ ఆ కుక్కలకు పుట్టినవి కావు. దాంతో పాలులేక పిల్లలు అరవడం మొదలెట్టాయి. వెంటనే మెడికల్‌షాపుకెళ్లి పాలడబ్బాలు కొనుక్కొచ్చి వాటికి పాలుతాగించాను.

                   ఓ పదిరోజులు కాలేజి ఎగ్గొట్టి ఆ పిల్లలమధ్యే గడిపాను. తల్లికుక్కల్ని బ్లూక్రాస్‌కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బయట వదిలేశాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక బయటికి పంపించాను. అలా ‘వి కేర్ ఏనిమల్’ని ఛాలెంజ్‌కి తీసుకుని నడిపించాను. అయితే భవిష్యత్తులో కుక్కల సంరక్షణకోసం పటిష్టమైన సంస్థని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణ, జ్ఞానం అవసరమని గుర్తించి ‘పీపుల్ ఫర్ ఏనిమల్’ ఆధ్వర్యంలో కొంత శిక్షణ తీసుకున్నాను’’ అని చెప్పే రీనా ఆలోచన సేవ నుంచి పోరాటందాకా విస్తరించింది. కుక్కలకు కూడా హక్కులున్నాయంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
 
 కుక్కల హత్య...
 
                   రీనా ఉండే ప్రాంతంలో ఒకరోజు వీధి కుక్క ఓ చిన్నపాపను కరిచింది. ఆ పాప సర్పంచ్ మనవరాలు కావడంతో అతను వెంటనే ఆ ప్రాంతంలోని కుక్కల్ని చంపించేశాడు. ఆ సంఘటన రీనా దృష్టికి వచ్చింది. ‘‘నాకు విషయం తెలియగానే చెప్పలేనంత ఆవేశం వచ్చింది. పైగా ఆ కుక్కల్ని చంపిన విధానం ఎంత ఘోరం... అంటే ఆ కుక్కలన్నింటికీ మనుషుల్ని పెట్టి పాయిజన్ ఇప్పించి మరీ చంపించేశారు. ఈ సంఘటనలో ఎనభై కుక్కలు చనిపోయాయి. నేను నేరుగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్లి ఏ అధికారంతో ఈ పని చేశారని అడిగాను. ‘నాకు పైనుంచి ఆదేశాలున్నాయి’ అన్నారు.

                     కుక్కని చంపే హక్కు ఎవరికీ లేదని అతనిపై కేసు వేశాను. అయితే ఆ తర్వాత నాకు అర్థమైందేమిటంటే... కుక్కల్ని చంపడం నేరమన్న విషయం చాలామందికి తెలియదని’’  రీనా చెబుతున్నప్పుడు తనకళ్లలో చెమ్మ కనిపించింది. ‘‘వీధిలో కుక్కలు లేకపోతే రాత్రిపూట ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. రాత్రివేళ కుక్క అరిచే అరుపు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే కుక్క మనల్ని కరిస్తే దాన్ని చంపేటంత కోపం వస్తుంది. ఎందుకంత కోపం... దానికి ఓ రెండు టీకాలు వేయిస్తే పోయేదానికి చంపడందేనికి’’ అని ప్రశ్నిస్తున్న రీనా ఆవేదనలో అర్థం ఉంది. మన ఇంటిముందు పడుకున్న ఓ వీధికుక్క అరుపు దాని ఆకలిని కాదు... తన కావలిని చూపిస్తుందని అర్థమైనవారికి రీనా బాధ కూడా అర్థమవుతుంది. ‘‘నన్ను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’’ అని కండిషన్ పెడుతున్న ఈ శునకప్రేమికురాలి కోరిక నెరవాలని కోరుకుందాం.
 
 వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్...
 
 భవిష్యత్తులో రీనా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు చాలా పెద్దవి. సొంతంగా భూమి కొనుక్కుని వీధి కుక్కలకోసం పెద్ద పునరావాస  కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికోసం ‘పీపుల్స్ ఫర్ ఏనిమల్’ వారి దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. ‘వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్’లో చేరాక మూగజీవులకు సంబంధించి రీనా చాలా విషయాలు నేర్చుకున్నారు. జెన్‌పాక్ కంపెనీలో పనిచేస్తున్న రీనా ఇంట్లో  ప్రస్తుతం ఓ పది వీధి కుక్కలు ఉంటున్నాయి. వాటిని చూసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వీధికుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నారు రీనా. 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.