2005లో హార్వార్డ్ ఆధ్యాపక బృందంలోకి
హార్వార్డ్‌లో ఇప్పటికి భారత్ 25 మంది
తండ్రి మైసూర్‌లో రైతు, వ్యాపారవేత్త
ఆర్థిక సంక్షోభంలో పలు దేశాల్లో పరిశోధనలు
ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అయిన అమెరికాలోని హార్వార్డ్ యూనివర్శిటీలో భారతీయ సంతతి మహిళకు తొలిసారిగా ప్రొఫెసర్ హోదా లభించింది. అమెరికాలో నివసించడం గొప్పగా భావించే కాలంలో అక్కడి విశ్వవిద్యాలయాలలో ఆర్ధిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించడం గీతా గోపినాథ్‌కు మంచి అవకాశంగా భావించారు.
2010 ఫిబ్రవరిలో జరిగిన ఆర్థిక శాస్త్ర విభాగం కార్యవర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై ఒకటి నుంచిపదాయంలో ఒకసారి ప్రొఫెసర్ హోదా లభిస్తే అది జీవితకాలం కొనసాగుతుంది. ప్రస్తుతం గీత ఇంటర్నేషనల్ మాక్రో ఎకనామిక్స్,పైనాన్స్ సబ్జెక్టులను బోధిస్తున్నారు.
విద్య
గీతా గోపినాథ్ తన ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ లోని లేడి శ్రీరామ్ కాలేజీలో, మాస్టర్ డిగ్రీని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేశారు. ఆ తర్వాత 2001లో ప్రిన్సటన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు.2005లో హార్వార్డ్ యూనివర్సిటీలో చేరక ముందు వరకు చికాగోభూత్‌స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పని చేశారు.‘ఆమె బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని భారత్ 1990-91లోనే చవిచూసింది. అసలు సంక్షోభం ఎందుకు సంబవిస్తుందో తెలుసుకోవాలన్న ఆకాంక్షే అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర అధ్యయనానికి కారణమైందన్నారు. గీతా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే ఇంటర్నేషనల్ ఎకానమిక్ జర్నల్ అయిన అమెరికన్ ఎకానమిక్ రివ్యూకు అసోసి యేట్ ఎడిటర్‌గా పనిచేశారు. మాక్రో ఎకనామిక్స్ బోధించడంతో పాటు అంతర్జాతీయ ధరల నియంత్రణ, మార్పిడి ధరల నిర్ణయం, అత్యవసర మార్కెట్ వ్యాపారం, ఆర్థికమాంధ్యం తదితర అంశాలపై రిచర్చ్ చేశారు.
గీత రాసిన అనేక ఆర్థిక సంబంధ కథనాలు అమెరి కన్ ఎకానమిక్ రివ్యూ, త్రైమాసిక ఎకానమిక్ జర్నల్, రాజకీయ ఆర్థిక జర్నల్, రివ్యూ ఆఫ్ ఎకానమిక్ స్టడీస్, ఇంటర్నేషనల్ ఎకానమిక్ తదితర పుస్తకాలలో ప్రచురితమయ్యాయి.గీతా గోపినాథ్ ఎకనామిస్ట్‌గా అర్థికసంక్షోభం సమయంలో గ్రీస్, ఐస్‌లాండ్‌లలో పరిశోధనలు చేశారు. ఆ అనుభవమే ఆమెకు ప్రొఫెసర్‌గా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడింది. హర్వార్డ్ యూనివర్సిటీలో అతి పెద్ద విభాగమైన ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎంపిక కావడం ఒక ఎత్తయితే ఇప్పటివరకు ఆ హోదాను పొందిన మహిళల్లో మూడవ మహిళ కావడం అందులోనూ భారతదేశం నుంచి తొలి మహిళా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.42 సంవత్సరాలలోనే గోపినాథ్ అనేక ఆర్థిక సమస్యలను అనుభవంతో పరిష్కరించింది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభ సమయంలో యూరఫ్‌లో అడుగుపెట్టి అక్కడ తన శక్తి యుక్తులతో సమస్యను గట్టెక్కించడంలో తనదైన పాత్రను ఎంతో సమర్థవంతంగా నెరవేర్చారు. మార్కెట్‌ను అభివృద్ధి దిశలో పయనింప జేయడంలో అనుభవం ఎంతగానో ఉపయోగపడింది.
మాక్రోఎకనామిక్స్, అడ్వాన్స్ ఎకనామి క్స్‌లో ఉన్న అనుభవంతో ముందుగానే సమస్యను అర్థం చేసుకోగలగడం గీతాకు ఉన్న ప్రత్యేకత. దానివల్లే ధరలు, వడ్డీరేట్లకు మధ్య తేడాను గుర్తించి వాటిని పరిష్కరించే దిశలో ఎంతగానో కృషి చేశారని హర్వార్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్, పబ్లిక్‌పాలసీ ప్రొఫెసర్, ఐఎంఎఫ్ ఎకనామిస్ట్ మాజీ చిఫ్ కెన్నిత్ రగఫ్ అన్నారు. గ్రీస్‌లో జరిగిన దేశాలు-ఆర్థికసంక్షోభం అనే అంశం మీదా జరిగిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్న భారత ప్రణాళిక సంఘం సభ్యులకు గోపినాథ్ పలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రణాళికలో ఉన్న లోపాలను సవరించాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉందని కూడా సూచిచారు. ఈ సంక్షోభం భారత్ మీదా కూడా ప్రభావం చూపుతుంది. దాదాపు 7 శాతం వరకు లోటు బడ్జెట్‌కు ఇది దారి తీస్తుంది. వాస్తవానికి ఇది అమెరికా మీదా పడే ప్రభావంతో పోలిస్తే చాలా తక్కువ కానీ ఆర్థిక పరంగా మాత్రం ఇండియాకు ఎక్కువే ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారుల మూలంగానే ఎక్కువ ప్రభావితమవుతుంది.
ఇండియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అక్కడ చాలా అవకాశాలున్నాయి. సమస్యను సరైన సమయంలో గుర్తిస్తే పరిష్కరించవచ్చు. ఇది రాజకీయంగా ఎదుర్కొనేది కాదు. మొత్తం మీదా భారతీయ మార్కెట్‌లో ఉన్న లోపాలు ఇతర దేశాలతో పొలిస్తే చాలా చిన్నవనే చెప్పాలి ’అని ఈ సందర్భంగా భారతీయ ఆర్థిక వేత్తల నుద్ధేశించి గీతా అన్నారు. గీతా తండ్రి టీవీ గోపినాథ్ మైసూర్‌లో రైతు, వ్యాపారవేత్త. అతను చిన్నతనం నుంచి గీతను ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఎంతోమందిని ఆయన చూసి ఉండడం కూడా దీనికి కారణం.‘నా కూతురు మైసూర్‌లో స్కూల్‌కు వెళ్లేది. అయితే ఢిల్లీలో ఎదుర్కున్నంతగా పోటీ ఇక్కడ ఎదురు కాలేదు. అదే ఆమె విజయానికి కారణం. అలా పోటీని ఎదుర్కొనకపోతే ఈ రోజు హార్వార్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా నియమితురాలు కాకుండేదని తండ్రి వివరించారు. ఆమె వాషింగ్టన్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది.
అయితే తనకున్న ఆర్థిక అవగాహన చాలా అమోఘం. ఆ అనుభవమే ఆమెను ఈ రోజు ఈ స్థాయికి చేర్చింది. వివిధ హోదాల్లో పనిచేసిన గీత 2005 నుంచి హార్వాడ్ అధ్యాపక బృందంలో కొనసాగుతున్నారు. తరువాత 2009లో అసోసియేటేడ్ ప్రొఫెసర్ హోదాను పొందారు. ఎదుగుతున్న మార్కెట్లపై ఆమె ఎంతో కీలకమైన అధ్యయనం జరిపారని ఆయా మార్కెట్లలోని వ్యాపార చక్రాలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం దోహదపడుతుందని హార్వార్డ్ విశ్వవిద్యాలయం సోషల్ సైన్స్ డీన్ స్టీపెన్ కోస్లిన్ అన్నారు.ఒక భారతీయ వనిత అతి చిన్న వయస్సులో అత్యున్నత స్థానంలో నిలవడంతో పాటు ఈ పదవిని అలంకరించిన తొలి భారతీయు రాలుగా కీర్తిని గడించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
గోపినాథ్ భారత్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తొలుత ఢిల్లీయూనివర్సిటీలో విద్యనభ్యసించారు. గీతకు ముందు నితిన్ నోహరియా 10వ డీన్‌గా కొనసాగారు. 102 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలోనే ఒక భారతీయ సంతతి మహిళ ఈ పదవికి ఎంపిక కావడం విశేషం. సుమారు 200 మంది ప్రొఫెసర్లు గల హార్వార్డ్ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన వారు కేవలం 25 మంది మాత్రమే ఉండడం గమనార్హం.