సతారా జిల్లాలోని మస్వాద్ అనే గ్రామంలో సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. మహారాష్టల్రో ని సతారా, సోలాపూర్, సంగ్లీ, రాయ్‌గడ్, రత్నగిరి, పూణే, కోలాపూర్ జిల్లాలలో బ్యాంక్ సేవలందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో మొత్తం ఆరు బ్రాంచీలు ఈ బ్యాంక్‌కు ఉన్నాయి. కేవ లం బిజినెస్ స్కూల్‌నే కాకుండా తోటి మహిళలకోసం ‘మన్‌దేశి మహిళా సహకారి బ్యాంక్’ ను నిర్వహిస్తున్నారు. మహిళలే సమర్ధంగా చిన్న పరిశ్రమలను నిర్వహించుకొనేలా మనమే ఒక బిజినెస్ స్కూల్ పెట్టుకొంటే...! అన్న ఆలోచనతో హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ అందించిన సహ కారంతో ‘మన్‌దేశి ఉద్యోగిని’ అనే బిజినెస్ స్కూల్ ప్రారంభించారు. స్కూల్ నిర్వహణకు గాను బ్యాంక్ ఏడు లక్షల రూపాయల నిధులను సమకూర్చింది. హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ, వడాపావ్ వెండింగ్, మేలు గొర్రెల పెంపకం వంటి చిన్న తరహా పరిశ్రమలను సమర్ధవం తంగా ఎలా నిర్విహంచాలో, తయారు చేసిన వస్తువులను ఎలా మార్కెట్ చెయ్యాలో ఈ స్కూల్‌లో శిక్షణనిస్తారు.
మహిళసాధికారతే లక్ష్యంగా...
‘‘జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల ఉన్న స్ర్తీలు, ఆర్ధిక స్ధోమత లేక పై చదువులు చదువుకోలేని యువతులెందరో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. పొట్టకూటికోసం వ్యవసా య కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ర్టలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు సాధారణంగా సెకండరీ స్థాయి స్కూలు చదువుతోనే ఆపేస్తారు. సతారా జిల్లాలోని చాలా మంది బాలికలు స్థోమతలేక... ఇంకా ఇతరత్రా కారణాల వల్ల పై చదువుకొనసాగించలేక సెకండరీ విద్యతోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. సరైన విద్యార్హతలు లేక పోవడం వల్ల వీరికి ఉద్యోగాలు రావు. దీనితో నిరుద్యోగులుగా లేదా వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. వొకేషనల్ శిక్షణ లేకపోవడంతో వీరికి సూక్ష్మ రుణాలు అందే అవకాశం కూడా లేదు. అటువంటి మహిళలకు ఏదో ఒకటి చేయాలన్న తపన నన్ను నిలకడగా ఉండనివ్వలేదు.
ఎన్నో మార్గాలను అన్వేషించాను. చివరకు బిజినెస్ స్కూల్‌ను స్థాపించాను. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన వొకేషనల్ శిక్షణతో పాటు ఆర్థిక సాయం అందించడమే ఈ స్కూల్ లక్ష్యం. మహిళలను ఆర్థిక పురో భివృద్ధి దిశగా పయనింపజేయడమే మా సంస్థ ఉద్ధే శం, మహిళలు శక్తిహీను లుగా కాకుండా ఆర్థికస్థితిమంతులుకావాలి.’’అని మన్‌దేశి సహకార బ్యాంక్ చైర్‌పర్సన్ చేతనా గాలా సిన్హా అంటున్నారు. ‘‘బిజినెస్ స్కూ ల్‌లో మొత్తం18 కోర్సులున్నాయి వీటి వ్యవధీ వారంరోజుల నుండి మూడు నెలల వరకు ఉంటుంది. ఈ కోర్సు లు సాంకేతిక నైపుణ్యం, మార్కెటింగ్, ఆర్థికరంగంలోని మెళకువలతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొం
దడానికి దోహదపడతాయి.
చదువుకుని రోజుకూలీలుగా పనిచేసుకుంటున్న యువతులు,చదువుకోకపోయినా సమర్ధవంతంగా కుటుంబభాద్యతలు నిర్వహిస్తూ ఆపై ఏదోఒకటి చేయాలని తపన పడుతున్న మహిళలెందరో. వారికి చేయూతనిచ్చి మంచి జీవితాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో రెండు గ్రూపులుగా విభజించి స్కూల్‌లో శిక్షణ ఇస్తున్నాము. నిరక్షరాస్యులయిన మహిళలకు గొర్రెలపెంపకం, ద్రాక్షతోటల పెంపకం, పాల నాణ్యతను ఎలా మెరుగు పరచాలి... తదితర అంశాల మీద శిక్షణ ఇస్తున్నారు. యువతులకు హాండ్‌బ్యాగుల తయారీ, హాస్పిటల్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై శిక్షణ ఇస్తున్నాము. సాధారణంగా మన్‌దేశి బ్యాంక్ ద్వారా మహిళలకు రుణాలు అందజేస్తారు.
వృత్తివిద్య కళాశాల...
అప్పుడప్పుడు చిన్నస్థాయి పరిశ్రమలను నిర్వహించడంలో ఎదురయ్యే సమస్యల గురించి కొంత మంది మహిళలు మా వద్దకు వచ్చేవారు. ఓరోజు కూరగాయల వ్యాపారి అరుణ గైక్వాడ్ తన సమస్యకు పరిష్కారం సూచించమంటూ వచ్చింది. ఆ సంఘటన మమ్మల్ని ఆలోచనలో పడేసింది. ఇలా అరుణలా ఏదో చేయాలన్న ఆలోచన వున్నా అందుకు కావాల్సి న తెలివితేటలు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలు బాధ పడుతున్నారు. వారిని ఆ సమస్యల నుంచి విముక్తుల్ని చేయాలన్న ఆలోచనే బిజినెస్ స్కూల్ స్థాపనకు నాంది’’. ఇటువంటి తరహా బిజినెస్ స్కూల్ దేశంలో ఎక్కడా లేకపోవడం వలన స్కూలు ఏర్పాటు కొంచెం కష్టమే అయింది. బ్యాంకే స్వంతంగా ఒక మోడల్‌ను రూపొందించింది. ఇక కోర్సు లను డిజైన్ చేయడం కూడా ఒక సవాల్. విద్యార్థులు ఎవరి మార్కెటింగ్ తామే చేసుకోవ డానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు.
కోర్సు మెటీరియల్ మొత్తం ప్రాక్టికల్‌గా, ఎక్కువగా వీడియో ప్రోగ్రాములతో విద్యార్థులకు అర్ధమయ్యేలా, ఆసక్తికరంగా బోధిస్తున్నారు. రాష్ర్టం లో లెక్కలేనన్ని వొకేషనల్ కాలేజీలు ఉన్నాయి. కానీ వాటికీ, మా బిజినెస్ స్కూల్‌కు చాలా తేడా ఉంది. వొకేషనల్ కాలేజీలు వృత్తివిద్యా శిక్షణ మాత్రమే ఇస్తాయి. కానీ ఇక్కడ శిక్షణతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, విజయవంతమైన వ్యాపారులు అయ్యేందుకు కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుంది. ‘‘మా దగ్గర శిక్షణ పొందిన యువతులు ఇంగ్లీషు కూడా నేర్చుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్ని చక్కపెట్టడంలో సఫలీకృతులవుతున్నారు. 30 రూపాయలు సంపాదించే రోజుకూలీ నుండి నేడు రోజుకు రూ. 120 సంపాదించే వ్యాపారులుగా ఎదిగారు. ఇది మా కృషికి నిదర్శనం. మొదట మహిళా సహకార బ్యాంక్... తర్వాత గ్రామీణ మహిళల కోసం బిజినెస్ స్కూల్...ఆ తర్వాత...? ‘‘బిజినెస్ స్కూల్ ఆన్ వీల్స్’’. స్కూల్‌కి వచ్చి శిక్షణ పొందలేని మహిళల దగ్గరకే ‘మన్‌దేశి ఉద్యోగిని’ తీసుకెళ్లాలన్న ఆలోచనతో బిజినెస్ స్కూల్ ఆన్ వీల్స్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాము. దీని గురించి పటిష్టమైన ప్రణాళిక రూపొందించాల్సి వుంది.’’ అని చేతన తెలిపారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
మన్‌దేశి బ్యాంక్ ఆర్గనైజేషన్‌కు ప్రత్యేక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంది. చేతనా విజయ్ సిన్హా ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా, వైస్ ఛైర్మన్ మంజుశా రాజ్‌కుమార్ సూర్యవన్సితో పాటు మరో 15మంది మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారు. దీనితో పాటు స్వయం సహాయక బృందానికి ప్రత్యేక కమిటీ ఉంది. ఇంకా చేతనా గలా సిన్హా వ్యవస్థాపకురాలుగా ఉన్న ఈ సంస్థలో రేఖాకులకర్ణి (చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి), వనితా షిండె( చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి), సుష్మా షిండే(చీఫ్ ఫైనాన్సియల్ అధికారి)లుగా వ్యవహరిస్తున్నారు.
అవార్డులు
2006లో ఎబిఎన్ అమ్రోబ్యాంక్, ప్లానెట్ ఫైనాన్స్ ఇండి యా నుంచి మైక్రోఫైనాన్స్ ప్రాసెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు.
2005లో ఇంటర్నేషనల్ అశోకా చేంజ్‌మేకర్స్ అవార్డు.
ఫైనలిస్ట్ స్కావాబ్ ఫౌండెషన్ అవార్డు-2007
అశోక ఇన్నొవేటర్స్ ఫర్ ది పబ్లిక్ అవార్డు
హార్వార్డ్ యూనివర్సిటీ బ్రిడ్జ్ బిల్డర్ అవార్డు-2003
ఏల్ యూనివర్సిటీ వరల్డ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2002-2003
ఫస్ట్ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ బ్రేవెరి అమోదిని అవార్డు-2009
రాణీ లక్ష్మీబాయి పురస్కార్-2009
శ్రీమతి సుశీలాదేవి దేశ్‌ముఖ్ స్మృతి మహిళా పురస్కార్-2007
మైక్రోఫైనాన్స్ ప్రాసెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు-2005.
వీటితో పాటు పలు అవార్డులు ఈ సంస్థ అందుకుంది.