ఆ పరిస్థితికి మానసికంగా ముందే సిద్ధపడటంతో, దాన్ని ఎదుర్కోవడం ఆమెకు పెద్ద కష్టం కాలేదు. పీజీ పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో పడింది. అసలు సమస్య మొదలైంది అప్పుడే. చూపులేని వాళ్లు ఎలా పనిచేస్తారంటూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో వీధివీధి తిరిగి పచ్చళ్లూ, జామ్‌లూ అమ్మడం మొదలుపెట్టింది. మరోవైపు చిన్నప్పట్నుంచీ చూపులేని వాళ్లు అసలు చదువుకోవడమే కష్టం కదా అన్న ఆలోచనలు ఆమెను వేధించేవి. ఎన్నో నెలలు కష్టపడి తనుంటోన్న మేఘాలయలో వాడుక భాష అయిన ఖాసీలో బ్రెయిలీ కోడ్‌ని సృష్టించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో అంధుల కోసం ఉచిత స్కూల్‌ను మొదలుపెట్టింది. ఇప్పుడా స్కూల్‌లో నూటయాభైకి పైగా చిన్నారులు చదువుకుంటున్నారు.
తన లాంటి వాళ్లకోసం ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా పద్మశ్రీ, సీఎన్‌ఎన్ రియల్ హీరోస్ అవార్డులతో పాటూ మరెన్నో పురస్కారాలను అందుకుంది. అలాంటి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పాటూ తెలిసిన వాళ్ల సహాయంతో ఎన్నో ఏళ్లుగా స్కూల్‌ను విజయవంతంగా నడిపిస్తోంది.