విజయవాడ ఆమె జన్మస్థలం
సిస్కో సిస్టవ్‌సు సిటివోగా బాధ్యతలు
మోటొరొలా సంస్థకు సిటివోగా అనుభవం
ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలలోని అత్యంత శక్తివంతుల ముఖాలన్ని పురుషూలేక చెంది ఉంటాయని ఇంతవరకు భావిస్తున్న వారు ప్రస్తుతం తమ అభిప్రాయాలను కాస్త మార్చుకోవలసి ఉంది. ప్రపంచ ఐటీ పరిశ్రమ ఇప్పటికీ పురుషూల ఆధిపత్యంలోనే నడుస్తూ ఉండటం నిజమే కాని ఐటి కోటాలోకి ప్రతిభావంతులైన మహిళా మూర్తులు తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. తమ కృతనిశ్చయం, ప్రతిభ, దార్శనికతల ద్వారా ప్రపంచ ఐటి పరిశ్రమలో అత్యంత శక్తివంతులైన వారి సరసన మహిళలు ఇప్పుడు సగర్వంగా నిలబడుతున్నారు. అలాంటి వారిలో ఒకరు విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్.
విజయవాడలో పుట్టిన ఆమె అంతర్జాతీయ సంస్థలకు సిఇవోగా పనిచేయడం అంటే సామాన్య విషయం కాదు. అందున మహిళ ఆ స్థాయికి ఎదగడం అంటే ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. తెలుగు వనిత అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది అంటే అది తెలుగు వారందరికీ గర్వకారణం. సాంకేతిక ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తెలుగు వనిత పద్మశ్రీ వారియర్. విజయవాడలో జన్మించిన ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థ సిస్కో సిస్టమ్స్ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫిసర్(సిటిఓ)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. గతంలో మోటొరొలా సంస్థకు సిటిఓగా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఈమె ఇక్కడే పిల్లల మోంటెసోరీ పాఠశాల, మేరీ స్టెల్లా కళాశాలలో చదువుకుంది. విజయవాడలోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన ఆమె ఢిల్లీ ఐఐటి నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. 1982 లో రసాయన శాస్త్రంలో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కూడా కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టాను సాధించింది.
వారియర్ 1984 సంవత్సరం మోటారోలా సంస్థలో చేరి అక్కడ సుమారు 29 సంవత్సరాలలో వివిధ రకాల బాధ్యతలను వహించి చివరికి వైస్ ప్రెసిడెంట్ గాను, ఎనర్జీ సిస్టంస్ విభాగానికి జనరల్ మేనేజర్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన టెక్నాలజీ అధికారిగా ఎదిగారు.సిస్కో చీఫ్ టెక్నికల్, స్ట్రాటజీ అధికారిని అయిన పద్మశ్రీ వారియర్ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలను నిద్రలేస్తారట. ముందుగా ఈ - మెయిల్స్ ను చెక్ చేసుకోవటం ఆ తరువాత జిమ్ ఆపై పిల్లలను స్కూల్‌కు పంపి 8.30 ప్రాంతంలో ఆఫీసుకు బయలుదేరతారట.2013లో పోర్బ్ మ్యాగ్జిన్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళలు జాబితాలో భారత సంతతికి చెందిన పద్మశ్రీ వారియర్ 57వ స్థానాన్ని పొందారు. ఈ జాబితాలో సోనియా 9వ స్థానంలో నిలిచారు. 2004లో పద్మశ్రీ మోటరోలా కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే ఆ కంపెనీ అమెరికా ప్రెసిడెంట్ నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డును అందుకున్నారు.
2005లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2007లో సిస్కో సిస్టమ్స్‌లో చేరారు. ప్రపంచంలోనే అత్యధికంగా జీతం అందుకుంటున్న పది మందిలో పద్మశ్రీ ఒకరని ఫార్ట్యూన్ పత్రిక వెలువరించింది. ‘లెవెన్త్ మోస్ట్ ఇన్‌ఫ్ల్యూయన్షియల్ గ్లోబల్ ఇండియన్’ గా ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఆమె ఆలోచనలను ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బందితో పంచుకుంటూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యోగ హోదా కంటే వారు ఇచ్చిన సూచనలు ఎంత వరకు ఉపయోగం అనే విషయాన్నే ఆమె పరిగణలోకి తీసుకుంటారు. అందుకే వారియర్ అంటే సంస్థలోని ప్రతి వ్యక్తి గౌరవం. ఎంతో మంది అమ్మాయిలు వారియర్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వారికి ఆమె ఇచ్చే సూచన ఒక్కటే ‘‘గోల్ ఏర్పరచుకోండి దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడండి. అది సాధించిన రోజన నీ కష్టాలన్నీ మరిచిపోతావ్’’.
మూలం : సూర్య దినపత్రిక