లేతవయసులోనే కథలకు శ్రీకారం
అతితక్కువ కాలంలో విశ్వఖ్యాతి నొందిన నవల, ఆ నవలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఎంతటి పాపులారిటీని సంపాదించిందో, అంతకంటే ఐశ్వర్యం, పేరు ఆమెకు వచ్చింది. నవల, సినిమా ఎంత పాపులరో ఆమె పేరు కూడా అంతే పాపులర్. రౌలింగ్ పూర్తిపేరు జె.కె.రౌలింగ్. బ్రిటన్ దేశానికి చెందిన 48 సంవత్సరాల రౌలింగ్ లేత వయసులోనే పిల్లల కథలను రాయడం అలవర్చుకున్నారు. చిన్నప్పుడు తోటిపిల్లలకు కథలను చెప్పడంలో ఆరితేరిన రౌలింగ్ అదే స్పృహతో రచనలపై ఆసక్తిని చూపించారు.
తల్లి నుంచి ప్రేరణ
రౌలింగ్ 1965 జూలై 31న ఇంగ్లండులో ఒక మారుమూల ప్రాంతంలో జన్మిచారు. రౌలింగ్ తల్లిపేరు 'అన్నీ'. ఫ్రాన్స్, స్కాట్‌లాండ్ రెండు దేశాలకు చెందిన తల్లి భర్త నుంచి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఈ ప్రభావం రౌలింగ్‌పై బాగా ఉండేది. ఎందుకంటే తల్లి కష్టపడి తనను చదివించడం, తన కోసం తల్లి చేస్తున్న పోరాటం ఆమెలో ఒక పట్టుదల రావడానికి కారణమైంది. ఇంగ్లండ్‌లోని సెయింట్ మైఖెల్ ప్రైమరీ స్కూలో రౌలింగ్ చదువుకున్నారు. ఒకసారి స్థానికంగా ఉండే చర్చికి రౌలింగ్ హాజరయినప్పుడు ఒక ఆంటీ 'జెస్సికామిట్‌ఫోర్ట్' అనే ఒక మహిళ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇచ్చి చదవమంది. ఈ పుస్తకం చదివిన రౌలింగ్ తనేందుకు రచనలు చేయకూడదని అనుకున్నారు.
చారిటీలో పనిచేసిన రౌలింగ్
రౌలింగ్ బిఎ పూర్తయ్యాక పారిస్ నుంచి లండన్‌కు వచ్చారు. లండన్‌లో కొన్ని సామాజిక సంస్థలో పనిచేశారు. ఆమ్నేస్టీ అంతర్జాతీయ చారిటీలో పనిచేశారు. చారిటీలో పనిచే స్తున్నప్పుడు మానవహక్కుల కోసం పోరాడుతూనే వాటిని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసేవారు. ఒకసారి రౌలింగ్ మన్‌సేస్టర్ నుంచి లండన్‌కు వెళ్లేందుకు పయనమయ్యారు. ఆ ట్రైన్ నాలుగుగంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ నాలుగు గంటలు ఆమె జీవితాన్ని మార్చివేస్తుందని రౌలింగ్ ఊహించి వుండరు. కారణం ఆ సమయంలో ఆమెకు ఒక పిల్లాడు స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు మెదలుతాయి? అనే ఒక ఆలోచన ఆమెలో జీవం పోసుకుంది. 1990లో ఆమె ఒక సాహసబాలుడి గురించి కథను రాయాలని అనుకున్నారు. కానీ ఇదే సమయంలో రౌలింగ్ తల్లి మరణించడంతో తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లితో తనకున్న అనుబంధం, జీవితంలో ఎదురైన సంఘటనలు, అప్పటికే తన భర్త విడిపోవడం, 8సంవత్సరాల కూతురి బాధ్యతను మోయడం వంటివన్నీ రౌలింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 1990లో కథను రాయాలనే ఆలోచన అయితే వచ్చింది కానీ, 1995 వరకూ అది సాధ్యం కాలేదు. తన కూతుర్ని దృష్టిలో పెట్టుకుని, పసిపిల్లల్లో ఉండే ఆతృత, ఆసక్తి, ఉత్సాహం వీటిని ఆధారం చేసుకుని, 'హ్యారీపొట్టర్' నవలకు శ్రీకారం చుట్టారు.
నవలే సినిమాగా...
1996లో విడుదలైన హ్యారీపొట్టర్ పుస్తకం హాట్‌కేక్‌లా అమ్ముడుపోవడం ఒక సంచలనం అయితే బ్రిటన్‌లో అన్ని లైబ్రరీలలో పిల్లలకోసం ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచింది. తర్వాత బ్రిటన్ నుంచి అమెరికా 1998లో ఈ పుస్తకహక్కుల్ని కొన్న వార్నర్ బ్రదర్స్ పుస్తకం పేరుతోనే సినిమాగా తీసారు. ఈ సినిమా ఇంతగా విజయం పొందుతుందని ఎవరూ ఊహించలేదు. మీడియా కూడా నవలతోపాటు సినిమాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సూపర్ పాపులర్ అయ్యింది.
నవల ఏడు సీరీస్‌గా
పుస్తకం, సినిమాకు ఊహించని పాపులారిటీ లభించడంతో రౌలింగ్ ఇదే నవలను 7 సీరీస్‌గా రాశారు. 1. హ్యారీపొట్టర్ ఫిలసాఫీయర్స్‌స్టోన్, 2.హ్యారీపొట్టర్ అండ్ ద చాంబర్ ఆఫ్ సీక్రెట్స్, 3. హ్యారీపొట్టర్ అండ్ ద ప్రిజనర్ ఆఫ్ అక్బన్, 4. హ్యారీపొట్టర్ అండ్ ద గోబ్లెట్ ఆఫ్ ఫైర్, 5.హ్యారీపొట్టర్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫియోనిక్స్, 6. హ్యారీపొట్టర్ అండ్ ద హాఫ్‌బ్లడ్ ఫ్రిన్స్, 7. హ్యారీపొట్టర్ అండ్ ద డెత్లీ హాల్లోస్‌గా రాశారు. 2006లో రౌలింగ్ తన ఫైనల్ పుస్తకం రాసి, ముగించారు. ముగింపు కథలో కథానాయకుడు హ్యారీపొట్టర్ మరణంతో ముగుస్తుంది. అందుకే ఈ కథకు 'హ్యారీపొట్టర్ అండ్ ద డెత్లీ హల్లోస్'గా నామకరణం చేశారు. ఈ పుస్తకం 2007లో విడుదలయ్యింది. ఈ పుస్తకం ఫేవరెట్ మాత్రమే కాక అన్ని సమయంలో వేగంగా అమ్ముడుపోయే పుస్తకంగా మారింది. చివరి పుస్తకం నాకెంతో నచ్చింది. కారణం ఇందులో సంతోషం, దుఃఖం నిండిన భిన్నమైన కథ. హ్యారీపొట్టర్ కథను పూర్తిచేసిన రౌలింగ్ చిన్నచిన్న కథలు రాస్తున్నారు.
చేతిరాత సరిగ్గా లేక తిరస్కరణ
ఆరంభంలో రౌలింగ్ తన చేతిరాతతో హ్యారీపొట్టర్ నవలను రాసి, దాదాపు 12 ప్రచురణసంస్థలకు ప్రచురణ నిమిత్తం పంపారు. కానీ ఆమె చేతిరాత అర్థం కాక, అవి ప్రచురించేందుకు నిరాకరించాయి. చివరికి ఆమె క్రిస్టఫర్ అనే ఒక వ్యక్తిని పట్టుకుని, తన కథను టైపింగ్ చేసి, పంపారు. ఈ నవల ప్రచురించబడినందుకు ఆరంభంలో రౌలింగ్ కేవలం 1500 పౌండ్లు మాత్రమే లభించాయి.
ఎందుకింత పాపులర్?
హ్యారీపొట్టర్ నవల, సినిమా ఎంతగా పేరుపొందాయో తెలియని వారుండరు. 2007లో చివరి నవల అయిన హ్యారీపొట్టర్ అండ్ ద డెత్లీ హాల్లోస్ రాసి, మార్కెట్లోకి విడుదల చేయకముందే ఆ కాపీని సొంతం చేసుకునేందుకు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, చివరికి ఇండియా కూడా యువతీ యువకులు పుస్తకాల స్టాల్స్ ముందు బారులుతీరారు. ఇంత పాపులారిటీని పొందడానికి అసలు ఈ నవలల్లో ఏం ఉన్నాయి? అని గమనిస్తే హ్యారీపొట్టర్, అతడి స్నేహితులు హోవార్ట్స్ అనే మంత్రాల స్కూల్లో విద్యార్థులు. మంత్రాలు, తాంత్రికవిద్య ప్రయోజనకరమైన వాటికోసం కాక, అవినీతి, అన్యాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకుని, ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించే మాంత్రికుడి కుతంత్రాల్ని ఎప్పటికప్పుడు హ్యారీపొట్టర్ అనే బాలుడు తిప్పికొట్టడం చేస్తుంటాడు. హ్యారీపొట్టర్ 11 సంవత్సరాల ఒక అనాధబాలుడు. ఇతడి బాధ్యత పిల్లల్ని మంత్రాల స్కూల్లో చేరేందుకు ప్రోత్సహించడం, తద్వారా తనతోటి వారికి అలాంటి చదువును నేర్పించి, అందులో విజయం పొందాలనే ధ్యేయంతో ఉంటాడు. అయితే మంత్రాలు, తంత్రాల వల్ల ప్రయోజనం కంటే నష్టాలే అధికమని గమనించి, ఇందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రయత్నాల్ని మాంత్రికుడి పెద్ద విఫలం చేస్తుంటాడు. తద్వారా ఆ మాంత్రికుడు హ్యారీపొట్టర్, అతడి స్నేహితుల్ని అంతం చేసే ప్రయత్నంలో మాంత్రికుడు తనకున్న మంత్రశక్తుల ద్వారా నిత్యం పోరాడుతూ సాగే కథ పాఠకుల్ని ఆసాంతం ఉత్కంఠంలో పడేస్తూ, సస్పెన్షన్, థ్రిల్లర్, హర్రర్ వంటి మసాలాను జోడించి రాయడంలో రోలింగ్ తనకున్న సత్తాను చాటుకున్నారు. నవలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ప్రేక్షకుల్ని మరింత ఆసక్తిగా తిలకించేందుకు దోహదం చేసింది. తద్వారా రచయితగా రౌలింగ్‌కు, సినిమాగా తీసిన వార్నెర్ బ్రదర్స్‌కు కనకవర్షంతో పాటు పేరు, అవార్డుల ప్రవాహంలో తడిసిపోయారు.
పేదలపై మనసు
ఇంతటి పేరు, డబ్బును ఏకకాలంలో సంపాదించుకున్న రౌలింగ్ తను సంపాదించిన కోట్లాదిరూపాయల్లో ఒక మిలియన్‌ను పేదల కోసం ఖర్చు పెడుతున్నారు. నేను దేవుడిని నమ్ముతాను, ఆయనే నాకు తోడుగా ఉండి, నడిపిస్తున్నాడని నేను భావిస్తుంటాను.
అవార్డులు: 1997లో గోల్డ్ అవార్డు, 1998లో బ్రిటిష్ ప్రభుత్వం అవార్డు, 1999లో బుక్‌ప్రైజ్ అవార్డు, ఇదే సంవత్సరంలో నేషనల్ బుక్ అవార్డు, చిల్డ్రన్ బుక్ అవార్డు, 2000లో గోబ్‌లెట్ ఆఫ్ ఫైర్ అవార్డు, 2003లో హ్యారీపొట్టర్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ ద పోనెక్స్ అవార్డు, 2005లో హ్యాఫ్‌బ్లెడ్ ప్రిన్స్ 2005లో అవార్డు, 2007లో హ్యారీపొట్టర్ అండ్ ద డెడ్లీ హాల్లోస్ అవార్డులను పొందారు.