ప్రసంగాలతో పోరాటంలో కీలకపాత్ర
1857లో సత్తా నిరూపించిన లక్ష్మీబాయ్
తెలుగు నారీ తక్కువ కాదన్న దుర్గాబాయ్
గాంధీ మెచ్చిన ధీర సరోజినీ
చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ల వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంతో ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టయింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేశారు. 1958లో హైదరాబాద్‌లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.
సరోజినీ నాయుడు భారత కోకిలగా, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర పోషించారు. 1879లో పుట్టిన ఈమె కవయిత్రి కూడా. సరోజినీ దేవి 1935 డిసెంబర్లో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
సరోజినీనాయుడు భారత దేశంలోని ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయ్యారు. ఎంత కఠినమైన విషయాలైనా శ్రోతల గుండెలను హత్తుకుని యదార్థ స్థితిని అర్థమయ్యేలా ఆమె గంభీరమైన ఉపన్యాసం శ్రోతలకు కాలం, శ్రమ తెలియనిచ్చేవి కావు.
ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్యవద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ. గాంధీజీ ఆరేళ్లు జైలు శిక్ష ననుభవించేందుకు వెళుతూ సరోజినీనాయుడుపై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించి చేతిలో చేయి వేసుకున్నారు. ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్య్ర ప్రభోదం ముమ్మరంగా సాగించింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో 1942లో బ్రిటిష్ ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్య్ర పోరాటం సాగించిందామె. అందుకు ఫలితంగా అరెస్టయి దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితం అనుభవించింది. దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆమెకు ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్ పదవి యిచ్చి సత్కరించారు.
మొదటి స్వాతంత్య్ర సంగ్రామం జరగడానికి ముఖ్య భూమిక పోషించిన వీర నారీ. ఈమె ఉత్తర భారతదేశ రాజ్య మైన ఝాన్సీ అనే రాజ్యా నికి రాణి. చిన్నతనం లోనే కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలను నేర్చుకుంది. ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది. ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌తో వివాహమైంది. తాము దత్తత తీసుకున్న బాలుడి విషయంలో బ్రిటీష్ వారితో కయ్యం ఆరంభం అయింది. తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆమెను ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. 1857లో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రాణి మాత్రం దత్తత తీసుకున్న బిడ్డను వీపున తగిలించుకుని పారిపోయి తాంతియా తోపేను కలుసుకుంది. రాణి 1858లో మరణించింది. గ్వాలియర్ యుద్ధంలో ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పింది. అందుకే ఆమె భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
మూలం : సూర్య దినపత్రిక