తొలిపాట ‘జాన్ బాజ్ ’లో ‘హర్ కిసీకో నహీ మిల్తా’ సూపర్ హిట్
మున్నాలో ‘మనసా’ పాటతో తెలుగులో మంచి గుర్తింపు
ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం
2002 జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు... ఫిలింఫేర్ అవార్డులు
ఆమె స్వరం విన్నవారికి స్వర్గం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఓ మధుర ఫలం తిన్న అనుభూతి కలుగుతుంది. అమృతం సేవించిన ఆనందం కలుగుతుంది. తీయని స్వరంతో పాటకు ప్రాణం పోసే సాధనా సర్గం గురించి ఆమె పాటలే నిర్వచిస్తారుు. మున్నా చిత్రంలో పాపులర్ సాంగ్ ‘మనసా..నువ్వుండే చోటే చెప్పమ్మా’ అంటూ కురక్రారు హృదయంలో నేటికీ మోగుతున్న స్వరం ఆమెది. శంభో శివ శంభోలో ‘కనుపాపల్లో ప్రేమ’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆలపించి తెలుగువారికి సుపరితమైన సాధనా సర్గం గురించి ఈరోజు..
ప్రొపైల్
పూర్తి పేరు : సాధనా సర్గమ్
పుట్టిన తేది : మార్చ్ 14,
జన్మ స్థలం : మహా రాష్ట్ర
వృత్తి : నేపథ్య గాయని
ప్రత్యేకతలు : ప్లేబ్యాక్ సింగింగ్,
శాస్త్రీయ,
ఆధ్యాత్మికసంగీతం
కెరీర్ ప్రారంభం : 1982
తొలి పాట : విధాత
పాడిన భాషలు : తెలుగు ,హిందీతో,
మరాఠీ, తమిళం,
కన్నడభాషల్లో
పాడారు.
శాస్ర్తీయ సంగీతంలో ప్రావీణ్యం గడించాక సాధన తల్లి ఆమెను అనిల్ మోహిల్ అనే ఒక కంపోజర్‌ను పరిచయం చేయించింది.దాంతో ఆమెకు చిన్నప్పుడే పాడే అవకాశం వచ్చింది.1982లో సాధన ‘విధాత’ అనే చిత్రంలో పాడి తన కెరీర్‌ను ప్రారంభించింది. జాన్ బాజ్ చిత్రంలో సాధన పాడిన ‘హర్ కిసీకో నహీ మిల్తా’ అనే పాట మంచి పాపులారిటీను సంపాదించింది. నేటికీ ఆ పాటను విన్న వారు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటారు. తరువాత ‘మైసే మీనా సే’, ‘లోగ్ కహ్తె హే’ అనే పాటలను ఆమెకు మరింతగా గుర్తింపును తీసకు వచ్చాయి.త్రిదేవ్ చిత్రంలో ‘మై తేరి మోహబ్బత్ మే’, ‘గజర్ నే కియా ఇషారా’ వంటి పాటలు సంగీతాభిమానులను అలరించాయి. 90 దశకంలో సాధన మంచి నేపథ్యగాయనిగా గుర్తింపు పొందింది.
స్వర సేవలో..
కెరీర్ తొలి దశలో ఆమె పాడిన పాటలు తక్కువే అయినా అవి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.కేవలం నేపథ్య గీతాలనే కాకుండా ఆధ్మాత్మిక గీతాలను కూడా అలపించి సంగీతానికి సేవ చేసింది.తన దైన శైలిలో పాడి పాటకు జీవం పోసే గాయని సాధన. సాధన పాడిన పాటలలో రోమాంటిక్ టచ్ ఉన్న పాటలే అధికం.అంతే కాకుండా ఆమె ఎన్నో రంగస్థల ప్రదర్శనలిచ్చి సంగీత ప్రియులను అలరించింది. ఏ.ఆర్.రెహ్మాన్‌తో కలిసి ఇచ్చిన స్టేజ్ షో హైలైట్‌గా నిలించింది.
మేస్ట్రోతో...
సాధన తన కెరీర్‌లో అత్యధిక పాటలు హిందీలోనే పాడగా దేశంలోని వివిధ భాషల్లో ప్రధానంగా దక్షిణాది చిత్రాలలో ఎన్నో మధురమైన పాటలను పాడింది. సంగీత దర్శకుడు ఏ. ఆర్.రెహ్మాన్ కోసం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో అనేక పాటలను ఆలపించింది.రెహ్మాన్ చిత్రం ‘వారియర్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్’ చిత్రంలో పాడి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.రెహ్మన్‌తో పాటు అమె మేస్ట్రో ఇళయరాజా కోసం అనేక పాటలు పాడటంతో పాటు అనేక మంది సంగీత దర్శకులతో కలిసి పని చేశారు. అందులో ఏ.ఆర్.రెహ్మాన్,హిమేష్ రేషమ్యా, ఇళయరాజ, శంకర్-ఎహాసాన్-లాయ్, యువన్ శంకర్ రాజా, రాజేష్ రోషన్, ఆర్పీ. పట్నాయక్, చక్రీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అంతేకాకుండా కె.జే. యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, కుమార్‌సాను, హరిహరన్ వంటి ప్రముఖ సింగర్స్‌తో కలిసి ఎన్నో యుగళ గీతాలను అలపించింది..
తెలుగులో..
ప్రభాస్ కథానాయకుడిగా ‘మున్నా’ చిత్రంలో ‘మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా’ అనే పాట యూత్‌ను ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ పాటను పాడింది సాధన సర్గమే. అంతే కాకుండా హోలీ చిత్రంలో ‘చెలియా చెలియా’ పాటలో ఆర్పీ. పట్నాయక్‌తో లిసి పాడారు. సంక్రాంతి చిత్రంలో ‘ఎలా వచ్చెనమ్మా’, స్టాలిన్‌లో ‘సిగ్గుతో చీచీ’ వంటి పాటలను పాడింది. సిద్ధార్థ్, తమన్నాల జంటగా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ లో ‘పంచీరే పంచీరే’ పాటను పాడింది.
తెలుగులో టాప్ - 5
పాట చిత్రం
చెలియా చెలియా హోలి
బాబా నీకు బాబా
మనసా మున్నా
పంచీరే పంచీర కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కనుపాపల్లో ప్రేమా శంభో శివ శంభో
అవార్డులు
- 2002లో జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు
- 2 సార్లులో ఫిలింఫేర్ ఉత్తమ గాయనీ అవార్డులు
- జీ సినిమా ఉత్తమ గాయనీ అవార్డు విజేత
- స్టార్ స్క్రీన్ ఉత్తమ గాయనీ అవార్డు
వంటి అవార్డులు.. మరెన్నో గౌరవాలనందుకున్నారు.