కెప్టెన్ సెహగల్‌గా కిర్తి గడించిన ఆమె భారత రాష్ర్టపతి పదవికి పోటీచేసిన తొలి వనితగా చరిత్ర సృష్టిం చింది. 1998లో పద్మవిభూషణ్ అందుకున్న సెహగల్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ... మనకు అందని లోకాలకు వెళ్ళి పోయింది. ఆ వీర వనిత గురించి ప్రత్యేక కథనం...
ప్రొఫైల్
పూర్తి పేరు : లక్ష్మీ సెహగల్
పుట్టిన తేది : 1914 అక్టోబర్ 24
జన్మస్థలం : మద్రాస్
వృత్తి : స్వాతంత్రోద్యమ కారిణి
విద్యాభ్యాసం : వైద్య శాస్త్రం
అవార్డులు : పద్మ విభూషణ్(1998)
ప్రముఖ సంఘ సేవకురాలు , రాజ్యసభ సభ్యు రాలు, భారత రాష్ర్టపతి పదవికి పోటీచేసిన తొలి మహిళ సెహగల్ . ఆమె తండ్రి స్వామినాథన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది. తల్లి ఎవి అమ్ముకుట్టి సామాజిక సేవా కార్యకర్త. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహిష్కరణ, మధ్యపాన నిషేధం వంటి జాతీయ ఉద్యమాలలో పాల్గొన్నారు. మద్రాసు వెైద్య కళాశాలలో 1938లో ఎం.బి.బి. ఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత సంవత్సరంలో గెైనకాలజీలో డిప్లొమా అందుకున్నారు.
హద్దులు చెరిపిన సేవ
1940లో సింగపూర్ వెళ్ళి అక్కడ వైద్యశాల స్థాపిం చారు. అక్కడకు పనుల నిమిత్తం వలస వెళ్ళిన భారతీయ కార్మికులకు వైద్య సేవలందించారు. ప్రత్యేకించి అక్కడి మహిళల మానసిక, శారీరక రుగ్మతలకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అక్కడి నుండే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. 1942లో బ్రిటిషర్లతో కలసి జపనీయులు సింగపూర్‌ను ఆక్రమించుకున్నారు. ఆ యుద్ధంలో గాయపడ్డవారికి లక్ష్మీ సెహగల్ వైద్య సేవలు అందించారు. అదే సమయంలో అంటే 1943 జూలై 2వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌కు వచ్చారు. కొద్ది రోజుల తరువాత సింగపూర్‌లో నేతాజీ బోస్ ప్రసంగాలకు ప్రభావితురా లై స్వాతంత్య్రోద్య మంలో చేరి కీలక పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన ఇండి యన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని జాన్సీ రెజిమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇదే ఆసియా మొట్టమొదటి మహిళా యూనిట్. ఈ యూనిట్ కెప్టెన్‌గా ఉన్న లక్ష్మీ... బ్రిటీష్ అరాచ కాలను ఎదుర్కొన్నారు.
వ్యక్తిగతం
లక్ష్మీ సెహగల్ 1947లో లాహూర్కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్‌ను వివాహం చేసుకుని కాన్పూరులో స్థిరప డ్డారు. కాన్పూర్‌లోనే వైద్యశాలను ప్రారంభించారు. ఈమె కుమార్తె సుభాషిణి ఆలీ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలలో పాల్గొని పేదల తరపున పోరాడుతున్నారు. రాజ్యసభ సభ్యురాలుస్వాతంత్రానంతరం 1971లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో జరిగిన గొడవల్లో గాయపడ్డవారికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ఉపాధ్య క్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమ య్యారు. 1998లో స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నందుకు మరియు వైద్యసేవలు అందించినందుకు గాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని అప్పటి రాష్ర్టపతి కె.ఆర్.నారాయణన్ చేతుల మీదుగా ప్రధానం చేశారు.
రాష్ర్టపతి అభ్యర్థిగా
2002లో లక్ష్మీ సెహగల్ రాష్ర్టపతి అభ్యర్థిగా ఎపిజె అబ్దుల్ కలాంపై పోటీకి దిగారు. ఈమెకు నాలుగు లెప్టు పార్టీలు అయిన సిపిఎం, సిపిఐ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఆలిండియా ఫార్వడ్ బ్లాక్‌లు మద్దతు తెలిపాయి. తొంభై మూడు సంవత్సరాల వయస్సులోనూ మహిళల సమస్య లపై పోరాటానికి ముందున్నారు.. మహిళల ఆరోగ్యం పై చికిత్స చేశారు. సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఒక రెజిమెంట్‌కు కర్నల్ హోదాలో బ్రిటీష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ కాన్పూ ర్లో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. వైద్యు రాలిగా సేవచేస్తూనే ఆదే సమయంలో దేశంలోని మహిళలకు జరుగుతున్న అన్యా యాలపై పోరాడారు.
మూలం : తెలుగు విశేష్