telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

కామాఠి కలువ

8/22/2013

0 Comments

 
Picture
                      మర్యాదస్తులు తప్పుకుని తిరిగే ‘కామాఠిపురా’ ప్రాంతానికి చరిత్రలోనే తొలిసారిగా గౌరవప్రదమైన గుర్తింపును తెచ్చిపెట్టిన శ్వేతాకట్టి... పడుపువృత్తిలో ఉన్నవారికే కాకుండా, యావత్ మహిళాలోకానికే స్ఫూర్తిదాయకం అనదగిన అడుగు వేసింది. చదువులో అసమానమైన ప్రతిభను కనబరిచి, దాదాపు ముప్పై లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌తో అందివచ్చిన ఆహ్వానంపై ఉన్నత విద్యకోసం ఇటీవలే అమెరికా వెళ్లింది! ఊహ తెలిసిన నాటి నుంచి నిత్యం జుగుప్సాకరమైన పరిస్థితుల మధ్య దుర్భర జీవనం సాగించిన శ్వేత జీవితంలో ఎన్ని మలుపులున్నాయి? మలుపు మలుపులో ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయి?....
 
                         ‘‘ఏయ్ పిల్లా... వస్తావా?’’... ఏ ఆడపిల్లా వినకూడని మాట ఇది. ఒక ఆడపిల్లని ఏ మగాడూ వేయకూడని ప్రశ్న ఇది. కానీ ఎంతోమంది మగాళ్లు నన్నా ప్రశ్న అడిగారు. పదకొండేళ్ల వయసులో... అరుగుమీద నిలబడి తల దువ్వుకుంటున్నప్పుడు... తొలిసారి విన్నానా ప్రశ్నని! ఏం జవాబివ్వాలో అంతుపట్టలేదు. చేతిలో దువ్వెనను వదిలేసి లోనికి పరుగెత్తుకుపోయాను. అప్పుడు నాకు తెలీదు... ఆ ప్రశ్న నుంచి నేను చాలాసార్లు పారిపోవాల్సి వస్తుందని.
 
                   కామాఠిపురా... ఆసియాలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో రెండోది. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా, బాలీవుడ్ లాంటి ప్రతిష్టాత్మక విషయాలే కాదు... కామాఠిపురా లాంటి కారు చీకటి కమ్మిన ప్రదేశాలూ ఉన్నాయి. నాగరిక జనాలే కాదు... అనాగరికమైన ఆచారాల కారణంగా అట్టడుగుకు కూరుకుపోయిన జీవితాలూ ఉన్నాయి. దానికి నిలువెత్తు నిదర్శనం... మా అమ్మ వందన!
 
                    అమ్మది కర్ణాటక. తాతయ్య బ్రోతల్ హౌస్ నడిపేవాడు. తాగి తాగి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకున్నాడు. సత్తువ చచ్చిపోయాక బ్రోతల్ హౌస్ చూసుకొమ్మని అమ్మమ్మకు చెప్పాడు. అప్పుడే అమ్మమ్మ ఆలోచనలో పడింది. తమ తర్వాత తన కూతురు మళ్లీ ఇదే పని చేయాలా అని ఆందోళన చెందింది. తన బిడ్డ జీవితం తనలా కాకూడదని, తనకో మంచి జీవితాన్ని ఇవ్వాలనీ అనుకుంది. కానీ, అమ్మ ఆ దిశగా ఆలోచించలేకపోయింది. ప్రేమలో పడింది. అది కూడా... అప్పటికే పెళ్లి కుదిరిన వ్యక్తితో.
 
                అతడెలాగూ తాళి కట్టడు కాబట్ట్టి... పెళ్లి కోసం ఆశపడలేదు అమ్మ. కానీ అతడి ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ కావాలనుకుంది. దాని ఫలితంగా పుట్టినదాన్ని నేను! అతడికి పెళ్లయిపోయింది. అమ్మమ్మ, తాతయ్యలు కూడా పోవడంతో అమ్మ కష్టాల్లో కూరుకుపోయింది. తనకవన్నీ అలవాటైపోయినా, నా కడుపు మాడ్చకూడదని, నాకోసం రాష్ట్రాన్ని దాటి, కామాఠిపురా చేరింది.
   
               జీవితం గురించి చాలామంది రచయితలు, కవులు అందంగా వర్ణిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారయినా కామాఠిపురాను చూసివుంటే వాళ్లలా రాసి ఉండేవారు కాదేమో! ఎందుకంటే, అక్కడ ఉన్నవాళ్లెవరికీ జీవితమే ఉండదు. ఏవేవో కారణాల చేత అక్కడకు వచ్చి, ఆ సాలెగూటి నుంచి బయటపడలేక విలవిల్లాడుతుంటారు. మనసు మొరాయిస్తున్నా పట్టెడన్నం తినాలంటే తనువు తనది కాదనుకోవాలి. మరో మార్గమే లేదు. అందుకే వారి జీవితాల్లో జీవం ఉండదు. అక్కడ పుట్టి పెరిగిన నాలాంటి అమ్మాయిల చెంపల్లో చారలు కట్టిన కన్నీళ్లు తప్ప గులాబీనిగ్గులు ఉండవు. అక్కడి తల్లుల కళ్లల్లో విషాదం తప్ప వెలుగన్నదే కనిపించదు. తాగి తూగి వాగే విటుల అరుపులు, నిస్సహాయ మహిళల ఆక్రందనలు, తల్లుల దారుల్లో నడవడం తప్ప మరో మార్గమే లేదనుకునే ఆడపిల్లలు, పేదరికం... ఇలాంటి భయంకరమైన వాతావరణంలో పెరిగాను నేను. దేవదాసీకి జన్మించిన ఆడపిల్లకి అంతకన్నా గొప్ప బాల్యం దక్కుతుందా?

                      సెక్స్‌వర్కర్ల మధ్యే ఉన్నా మా అమ్మ సెక్స్ వర్కర్ కాదు. ముంబై వచ్చాక మరో వ్యక్తికి చేరువయ్యింది. అతనితోనే ఉండిపోయింది. కానీ పాపం... అమ్మకు సుఖమంటే ఏంటో తెలీదు. తాగి వచ్చి తూలనాడే నాన్న మాటల్ని మౌనంగా భరించడమే తనకు తెలుసు. తాగింది దిగేవరకూ చితకబాదుతుంటే చీరకొంగును నోట్లో కుక్కుకుని బాధను అణచుకోవడమే తెలుసు. నేను తనలా కాకుండా కాపాడుకోవడం కోసం రాత్రీపగలూ కష్టపడి పనిచేయడమే తెలుసు. తన అవస్థను, ఆవేదనను చూసి ఎప్పుడూ అనుకునేదాన్ని... ఎందుకీ పిచ్చి అమ్మ ఇవన్నీ భరిస్తోంది, నాన్నను వదిలేసి ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. కానీ పిచ్చిది అమ్మ కాదు... నేను. మేము ఉంటున్న చోటు నుంచి కదలడం సాధ్యం కాదని, కదిలినా ఆదుకునే నాథుడే ఉండడని నాకు తెలీదు. ఆ నిజం తెలిసి రావడానికి నేను కొన్ని భయంకర అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది.
 
                     ఊహ తెలిసేనాటికి నాకు నాన్నగా ఉన్న వ్యక్తి... లోకం తెలిసేనాటికి నాన్న కాకుండా పోయాడు. అమ్మ అతడితో ఉండిపోయిందని, అతడు నాకు నాన్నలా వ్యవహరిస్తున్నాడని అర్థమయ్యింది. అప్పుడే తొలిసారి దేవదాసీ అన్న పదానికి నిర్వచనం తెలిసి వచ్చింది. అతడిని నేను నాన్న అనే అనుకున్నాను. అతడి నుండి నాన్న ప్రేమనే కోరుకున్నాను. కానీ అతడు మాత్రం నానుండి వేరేదో కోరుకున్నాడు. క్షోభపెట్టాడు. ‘‘నీ మనసు నీకంటే వికారంగా ఉంది’’... అతడన్న ఆ మాట నా మనసును ఎన్ని ముక్కలు చేసిందో నాకు మాత్రమే తెలుసు. అవును... నేను వికారంగానే ఉన్నాను.
 
                       నల్లగానే ఉన్నాను. అందంగా లేను. కానీ అందులో నా తప్పేముంది! నా రూపాన్ని చూసి అంతా నవ్వేవాళ్లే. నల్లపిల్ల, నల్లమొద్దు, నల్లదిమ్మ... ఇవా నా పేర్లు? నల్లగా పుట్టాలని నేను కోరుకున్నానా! నల్లగా ఉన్నంత మాత్రాన నేను మనిషిని కాకుండా పోతానా! ఇంటి దగ్గర, బడిలోను, నా ఈడు పిల్లలంతా నన్ను ‘పేరులో తెలుపు... ఒళ్లంతా నలుపు’ అంటూ అవహేళన చేస్తుంటే ఎంత ఏడ్చానో నాకే తెలుసు. చివరకు తండ్రిలా భావించినవాడు కూడా అదే మాట అన్నాడు. అది కూడా ఎందుకు? అతడి వికారానికి నేను తలవంచనందుకు. ఏం... దేవదాసీ కూతురయితే ఇలాంటి వాటికి తలవంచి తీరాలా? గౌరవంగా బతకాలని అనుకోకూడదా?
   
                   ‘‘ఏం చేయాలనుకుంటున్నావ్?’’... మా పక్కింటి ఆంటీ అడిగింది. ‘‘ఏముంది చేయడానికి?’’... లైట్‌గా తేల్చేశాను. ‘‘బాగా చదువుకో’’... చెప్పింది. ‘‘దానివల్ల ఏంటి ఉపయోగం!’’ అన్నాన్నేను. ‘‘అలా అనొద్దు శ్వేతా... చదువు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. చదువు లేకపోవడం వల్లే మేమంతా ఇక్కడ మగ్గిపోతున్నాం.
 
                        నాలుగక్షరాలు వచ్చివుంటే, మాకీ గతి పట్టేది కాదు’’... ఆమె మాటలు వింటూండిపోయాను నేను. వాళ్ల జీవితాలెలా నలిగిపోతున్నాయో, వారి నిస్సహాయత ఏమిటో బోధపడింది. నిరక్షరాస్యతే వారి నిస్సహాయత. నాకా పరిస్థితి రాకూడదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకుని తీరాలని నిర్ణయించుకున్నాను. నా కోరికను విని అమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంది... ఆనందంతో! కామాఠిపురాకు దగ్గరలో ఉన్న ‘అప్నే ఆప్’ అనే బడిలో చేర్పించింది నన్ను. ఆ బడిని క్రాంతి అనే ఎన్జీవో నడుపుతోంది. దాని స్థాపకులు రాబిన్ చౌరాసియా, త్రినా తాలూక్‌దార్. వారి పరిచయం నా జీవితాన్నే మార్చేసింది.
 
                  తమ సంస్థ ద్వారా సెక్స్ వర్కర్ల జీవితాలను బాగు చేయడానికి కృషి చేస్తున్నారు రాబిన్, త్రినాలు.  సెక్స్‌వర్కర్లను, వారి పిల్లలను తీసుకెళ్లి, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. వాళ్లు నా కథ విన్నారు. చదువుకుంటేనే జీవితం ఉంటుంది అన్న నా అభిప్రాయం, పట్టుదల వారికి నచ్చాయి. కామాఠిపురా నుంచి నన్ను బయటకు తీసుకెళ్లారు. చదివించారు. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు నేను రాసిన ఓ ఆర్టికల్‌ని, నా ప్రొఫైల్‌తో పాటు విదేశీ యూనివర్శిటీలకు పంపారు. అది చూసి ఇంప్రెస్ అయిన న్యూయార్క్‌లోని బార్డ్ యూనివర్శిటీ నాకు స్కాలర్‌షిప్‌ను మంజూరు చేసింది.
 
                        నా జీవితం ఇప్పుడు నేను కోరుకున్నట్టుగా ఉంది. నా చుట్టూ డేగకళ్లు లేవు. అవమానాలు లేవు. అంతా ఆనందమే. కానీ నాలా బయటకు రాలేక పోతున్న వారి సంగతేంటి! వాళ్లకోసం ఏదైనా చేయాలి. గతాన్ని వదిలేసి భవిష్యత్తువైపు కొత్తగా అడుగులు వేయడమెలాగో వాళ్లకు చెప్పాలి. సైకాలజీయే చదవాలనుకోవడానికి కారణమదే. చదువు పూర్తి కాగానే వచ్చి, ఓ కౌన్సెలింగ్ సెంటర్ పెడతాను. ఏ అమ్మాయీ ఆ జీవితం వైపు వెళ్లకుండా చూస్తాను. ఒకవేళ వెళ్లినా బయటకు తీసుకొస్తాను. అంతా నేను అనుకున్నట్టు జరిగితే... నాలా మరికొందరు పట్టుదలగా ప్రయత్నిస్తే... కామాఠిపురాలే ఉండవు. వందనలు, శ్వేతలు కూడా ఉండరు. నా లక్ష్యం అదే!
  
  నా చదువు, జీవితం వారికోసమే!


                       సెక్స్ వర్కర్లన్నా, దేవదాసీలన్నా అందరూ చిన్న చూపు చూస్తారు. అది ఎంతమాత్రం సరికాదు. ఎందుకంటే, ఎవరూ కావాలని అలా అవ్వరు. పరిస్థితులు అటువైపు నడిపిస్తాయి. బల వంతంగా అందులోకి తోస్తాయి. వాళ్లూ అందరిలాంటి మనుషులే. వాళ్లకీ అందరు ఆడపిల్లల్లాగా ఆనందంగా బతకాలని ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ మురికికూపంలో దిగాక బయటపడటం తేలిక కాదు. ఒకవేళ బయటపడినా తమను ఎవరు ఆదరిస్తారు, ఎవరు గౌరవిస్తారు అనే సంశయం ఆ దిశగా ఆలోచించనివ్వదు. అందుకే వాళ్లు అందులోనే మగ్గిపోతుంటారు. ఇవన్నీ తెలిశాక నేను వాళ్ల గురించి ఆలోచించకపోతే ఎలా! మా అమ్మను, మా అమ్మలాంటి ఇతర స్త్రీలను, వారి కష్టాలనూ కన్నీళ్లనూ చూసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉంటే ఎలా! అందుకే నా చదువు, జీవితం వాళ్ల కోసం, వాళ్ల బాగు కోసమే  అంకితం చేయాలనుకుంటున్నాను.  

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

తొలి మహిళా మంత్రి

8/20/2013

0 Comments

 
Picture
భారత స్వాతంత్య్రంలో కీలక పాత్ర
అన్నీ ఉన్నా నేత చీరెలు ధరించిన ధీర
గాంధీ పిలుపుతో సత్యాగ్రహ ఉద్యమంలోకి...
సంవత్సరం పాటు జైలు జీవితం
తండ్రి వెంట కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరు


              మోతీలాల్‌ నెహ్రూ కుమార్తెగా, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరిగా ప్రజలందరికీ చిరపరిచితమైన విజయలక్ష్మి పండిట్‌ ఝాన్సీలక్ష్మి బారుు, సరోజిని స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో బ్రిటీష్‌ పాలకులపై పోరాడారు. పలుసార్లు జైలుకు వెళ్లారు. భారత ప్రతినిధిగా పలు దేశాల్లో జరిగిన సదస్సులకు హాజరయ్యారు. భారత తొలి మంత్రిగా ఘనత వహించారు. ఆమె చూపిన పోరాట పటిమ నేటికీ స్ఫూర్తిదాయకం. రేపు విజయలక్షి్ష్మ జయంతి సందర్భంగా పలు విశేషాలు...

                  విజయలక్ష్మి పండిట్‌ సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త. ఆమె అసలు పేరు స్వరూప్‌ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్‌ నెహ్రూ. జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి. మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసింది. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్‌ సీతారామ్‌ పండిట్‌ను వివాహమాడింది. అప్పటి నుంచి విజయలక్ష్మి పండిట్‌గా పేరు మార్చుకున్నారు.భారత స్వాతంత్య్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ సైతం అనుభవించిన వీరవనితల్లో విజయలక్ష్మి పండిట్‌ ఒకరు. నెహ్రూ వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే విజయలక్షి్ష్మ జన్మించింది. మోతీలాల్‌ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌ నాయకులు చాలామంది ఇంటికి వస్తుండేవారు.

               స్వరూపరాణికి చిన్నతనం నుంచే కాంగ్రెస్‌ నాయకులందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. 1915వ సంవత్సరం కాంగ్రెస్‌ మహాసభలు బొంబాయిలో జరిగాయి. మోతీలాల్‌తో పాటు స్వరూప కుమారి సమావేశాలకు హాజరయింది. స్వరూప కుమారికి కవిత్వమంటే మంచి ఆశక్తి. ఎక్కువ కాలం తోటలో కూర్చుని సాయంకాల సమయాల్లో సోదరితో కవిత్వ ప్రసంగాలతో కాలం వెళ్లబుచ్చేవారు.


                 దండిలో ప్రారంభం అయిన ఉప్పు సత్యాగ్రహంలో విజయలక్ష్మి పాల్గొని విరివిగా ఉపన్యాసాలిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఉత్తరాలు, ఊరేగింపులు జరిపి ఉద్యమానికి నాయకత్వం వహించింది. సహాయనిరాకరణ ఉద్యమంలోనూ పాలుపంచుకుంది. విజయలక్ష్మి పండిట్‌ కాన్పూర్‌ చిల్‌హర్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థిపైన వెయ్యి ఓట్ల మెజారిటీతో నెగ్గిందామె. సంయుక్త రాష్ట్ర ప్రధాని గోవింద వల్లభ పంత్‌ అయ్యాడు.

                  విజయలక్ష్మి పండిట్‌ తొలిసారిగా మంత్రిగా పదవీ స్వీకారం చేసి స్థానిక స్వపరిపాలనా బాధ్యత చేపట్టింది. 1937 జూలై 28 న ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. 1938-39 సంవత్సరాలకు ఒక ప్రణాళిక తయారు చేసి, మూడు వందల ఆసుపత్రులను వివిధ రకాల వైద్య విధానాలతో స్థాపించింది. బాటసారులకూ, గ్రామీణులకూ నీరులేక బాధపడే ప్రాంతాలలో ఎన్నో బావులు తవ్వించింది. వయోజన విద్య పాఠశాలను నెలకొల్పింది. 1939 ఆగ్రా లోని స్ర్తీ వైద్య కళాశాలను, శిశు పోషణ కారణంగా మార్పించింది. తన నియోజక వర్గంలో విపరీతంగా ఉన్న మలేరియాను అరికట్టేందుకు ఆమె ఎంతగానో పాటుపడింది.తన ఆహ్వానాన్ని ఇందిర అంగీకరించకపోతే విజయలక్ష్మి పండిట్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని శాస్ర్తి భావించాట. అయితే నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని మేనత్త విజయలక్ష్మి పండిట్‌ ఎక్కడ తన్నుకుపోతుందోనన్న భయాందోళనే ఇందిరను కేంద్ర మంత్రిని అంగీకరించాట.

             విజయలక్ష్మి పండిట్‌కు సభలూ, సమావేశాల్లోనూ పాల్గొనకూడదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఒక రోజు అలహాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో స్వరూపరాణి ఉపన్యసిస్తుంటే ప్రభుత్వం లాఠీచార్జీ, అరెస్టులు జరిపించింది. మరుసటి రోజు ఆనందభవన్‌ వద్ద ఆమెను అరెస్టు చేశారు. దేశం కోసం జైలుకు వెళ్లడం చాలా ఘనతగా భావించారామె. సంవత్సరం జైలు శిక్షను లక్నోలోఅనుభవించారు. పూణెలో ఉన్న సమయంలో యార్యాడ జైలులో ఉన్న గాంధీజీని అనేక సార్లు చూశారామె.

విజయలక్ష్మి పండిట్‌

జన్మ నామం    : స్వరూప కుమారి
జననం         : 1900, ఆగష్టు 18
ప్రాంతం         : ఢిల్లీ
స్వస్థలం         : అలహాబాద్‌
మరణం         : 1990, డిసెంబర్‌ 1
నివాసం          : అలహాబాద్‌
ఇతర పేర్లు         : విజయలక్ష్మి పండిట్‌
వృత్తి         : రాజకీయ నాయకురాలు
                  మహారాష్ట్ర గవర్నర్‌
                  యు.ఎస్‌.ఎ.రాయబారి
                  సోవియట్‌ యూనియన్‌ రాయబారి
                 మెక్సికో రాయబారి
                 స్పెయిన్‌ రాయబారి
                 ఐర్లండ్‌ రాయబారి
                 యునైటెడ్‌ కింగ్‌డం హై కమీషనర్‌
                 మొదటి మహిళా మంత్రి
రాజకీయ పార్టీ    : భారత జాతీయ కాంగ్రెస్‌
భార్య/భర్త        : రంజిత్‌ సీతారామ్‌ పండిట్‌
సంతానం        : చంద్రలేఖ, నయనతార, రీటా
తండ్రి        : మోతీలాల్‌ నెహ్రూ
తల్లి        : స్వరూపరాణి నెహ్రూ


మూలం : సూర్య దినపత్రిక

0 Comments

కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…

8/20/2013

0 Comments

 
Picture
              లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎన్నివేల మైళ్లయినా అవలీలగా దాటేస్తాం! అమ్మ ‘అ,ఆ’లు దిద్దంచకపోయినా.. నాన్న ప్రపంచాన్ని పరిచయం చేయకపోయినా.. ఆ ప్రయాణం ప్రయాసను కలిగించదు… గమ్యం చేరాలన్న ఉత్సుకత అడుగు అడుగికీ ఆసక్తిని పెంచుతుంది! ఆ ఆరాటం, కుతూహలమే పశువుల కాపరిగా మొదలైన గాండ్ల మల్లీశ్వరి జీవితాన్ని కెమెరాఉమన్‌గా మార్చేశాయి ఏమీలేని నేపథ్యం నుంచి లోకాన్ని కెమెరా యాంగిల్‌లో చూడగలిగే స్థాయికి రావడం చిన్న విషయం కాదు! అది పదమూడేళ్ల సుదీర్ఘ ప్రస్థానం…తన అస్తిత్వాన్ని చాటుకున్న వైనం ఈ ఆడబిడ్డలో…

     మల్లీశ్వరిది మెదక్ జిల్లాలోని చిన్న చెలిమెడ అనే కుగ్రామం. తండ్రి గరణయ్య రెండెకరాల పేద రైతు. తల్లి మొగులమ్మ వ్యవసాయ కూలీ. భార్యభర్తలు పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి.

                      బతకడానికి ఆసరా లేకపోయినా తమ వంశానికొక మగాడు కావాలన్నది మొగులమ్మ అత్తగారి ఆశ. ఆ ఆశ కడుపునింపదనే ధ్యాసను మరిచేలా చేసింది. ‘ఒక్క వారసుడి’ కోసం కన్న కలలు మొగులమ్మను ఐదుగురు ఆడపిల్లల తల్లిని చేశాయి. ఉన్న భూమిలో పంట పండినా పండక పోయిన మొగులమ్మనే కూలీనాలీ చేసి భర్తను, పిల్లలను పోషించాల్సిన పరిస్థితి ఒకవైపైతే, మరోవైపు వారసుడి కోసం ఆరాటం. మొత్తం మీద ఆరవ సంతానం రూపంలో వారి ఆశ తీరింది. ఆరవ సంతానంగా మగపిల్లాడు పుట్టాడు. కానీ మొగులమ్మ మాత్రం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. అది 1999వ సంవత్సరం అప్పుడు మల్లీశ్వరి వయస్సు కేవలం 11 సంవత్సరాలు. మొగులమ్మ మరణించడంతో పిల్లల బాధ్యత గరణయ్యపై పడింది. ఒకవైపు పంటలు పండని భూమి… మరోవైపు ఆరుగురు పిల్లలు… వారి పోషణ తన వల్ల కాదనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు.

                  ఆరుగురిలో పెద్దమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటికి వారం రోజుల వయసున్న ఆ ఇంటి మగపిల్లాడితో సహా అయిదుగురు పసివాళ్ళు అనాథలయ్యారు. ఆ సమయంలోనే మొగులమ్మ తమ్ముడు వారిని చేరదీశాడు. రంగాడ్డి జిల్లా మర్పల్లి మండలంలోని మల్లిఖార్జున గిరి ఆయన సొంతూరు. ఆ పిల్లలందరినీ తనింటికి తీసుకెళ్లాడు. ఆయనేమీ భూస్వామి కాదు. ఆయనకూ ముగ్గురు పిల్లలు. తనకున్నదాంట్లోంచే తలాకొంచెం పెట్టి తన పిల్లలతో పాటే తన సోదరి పిల్లలనూ పోషించాడు. పిల్లల అయిదువేళ్లూ నోట్లోకి వెళ్లే దారి చూడ్డానికే సరిపోయింది కానీ ఆ పిల్లల చేతికి పలకా, బలపం ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అయిదుగురిలో రెండవ అక్క నాగమణి మాత్రమే ఏదైనా పని చేయగలిగే వయస్సులో ఉంది. పిల్లలు పెద్దవాళ్లు అవుతూనే కుటుంబ భారాన్ని పంచుకున్నారు. చిన్నచిన్న పనులు చేస్తూ మేనమామకు ఆసరాగా నిలిచారు. మూడవదైన మల్లీశ్వరి కూడా తనవంతుగా గ్రామంలో పశువుల కాపరిగా మారింది.

అనుకోని అవకాశం…
                   ‘చిన్నతనంలో పశువులను కాస్తున్నానన్నట్లే కానీ, తోటిపిల్లలు స్కూలుకు వెళ్తుంటే మనసు కొట్టుకునేది. నేను కూడా రంగురంగుల యూనిఫాం వేసుకుని, పుస్తకాల బ్యాగు పట్టుకుని స్కూలుకు వెళ్తున్నట్లు కలలు కనేదాన్ని. కనిపించిన వారందరినీ పుస్తకాలకు ఎంతవుతుంది, చదువుకునేందుకు ఎంత ఖర్చవుతుందని అడిగేదాన్ని. నన్ను చదివించే వారికోసం కళ్లల్లో వత్తులు వేసుకుని చూసేదాన్ని. ఆ అవకాశం ఎం.వి.ఫౌండేషన్ రూపంలో వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. హైదరాబాద్‌కు చెందిన ఎం.వి.ఫౌండేషన్ (మామిడిపుడి వెంకట రంగయ్య ఫౌండేషన్) ఒకసారి మా ఊరిలో శిబిరం ఏర్పాటు చేసింది. దాని ముఖ్యోద్దేశం బాలకార్మికులను గుర్తించడం, వారికి విద్యావకాశాలు కల్పించడం. అది నా కోసమే పెట్టారన్నంతగా సంబురమనిపించింది. నేనూ ఆ శిబిరంలో చేరిన’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది మల్లీశ్వరి.

ఫస్ట్‌క్లాస్…
                తన అక్కాచెల్లెల్లను కూడా ఆ శిబిరంలో చేర్చితే వారు కూడా చదువుకునే అవకాశం కలుగుతుందన్న ఆశ కలిగింది ఆమెకు. కానీ వారు అంతగా ఆసక్తి చూపించలేదు. చివరికి ఒక అక్క నాగమణిని మాత్రం చదువుకోవడానికి ఒప్పించ గలిగింది. తొలుత రంగాడ్డి జిల్లా ఆలూరు గ్రామంలో ఉన్న ప్రాంతీయ కేంద్రంలో ఇద్దరూ చేరారు. అక్కడ బ్రిడ్జి కోర్సులో చేరి ఏడవతరగతి వరకు చదువుకున్నారు. ఆ సంవత్సరం ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇద్దరూ పాసయ్యారు. ఆ తరువాత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందే. ఎం.వి.ఫౌండేషన్ వాలంటీర్లు ముందుగా మల్లీశ్వరి మేనమామను ఒప్పించి ఆమెను, ఆమె అక్క నాగమణిని హైస్కూల్‌లో చేర్పించారు. అలా అక్కచెప్లూల్లిద్దరూ హైదరాబాద్ చేరారు. అక్కడ 8,9,10 తరగతులు చదివే అవకాశం కల్గింది వాళ్లకు. పదవతరగతిలో 72 శాతం మార్కులతో మల్లీశ్వరి పాసైతే, నాగమణి 70శాతం మార్కులు సాధించింది.

ఆదుకున్న ఎం.వి.ఫౌండేషన్, దాతలు

               ఎం.వి.ఫౌండేషన్, దాతల సహకారంతో వికారాబాద్‌లో ఇంటర్ మీడియట్ పూర్తి చేసింది మల్లీశ్వరి. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీలో చేరాలంటే మాత్రం డబ్బులు అవసరం. ఇంటర్‌తోనే చదువు ఆపేస్తే ఇన్నాళ్లు తను పడిన కష్టానికి ఫలితం ఉండదని ఆమె ఆలోచన. ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలన్నదే ఆమె ఆశయం. దీనికోసం మల్లీశ్వరి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తన చదువు కోసం ఎంతోమంది దాతలను సంప్రదించింది. అలా అప్పటి కూకట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ అయిన శ్రీనివాస్ మల్లీశ్వరి డిగ్రీ మొదటి సంవత్సరానికి అయ్యే ఖర్చు భరించడానికి ముందుకు వచ్చాడు. కానీ ఆ తరువాత…? ఎన్నాళ్లు తను ఇలా దాతల మీద ఆధారపడాలి అనే ఆలోచన వచ్చింది మళ్లీశ్వరికి.

దారి చూపిన అభిరుచి
                 ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మల్లీశ్వరి ఎం.వి.ఫౌండేషన్‌లో ఉన్నప్పుడే చదువుతో పాటు తన అభిరుచి మేరకు పాటలు పాడడం, వీడియో తీయడం నేర్చుకుంది. ఎం.వి.ఫౌండేషన్ నిర్వహించే పలు కార్యక్షికమాల్లో పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేది. తమ కార్యక్షికమాలను సరదాగా వీడియోలో బంధించేది. సరదాగా నేర్చుకున్న వీడియోక్షిగఫి తనకు ఉపాధి చూపిస్తుందని మల్లీశ్వరి ఏనాడు ఊహించి ఉండదు. కానీ అదే జరిగింది.

              వీడియోక్షిగఫి అంత సులువైన పనేమీ కాదు. అంతేకాదు అప్పుడు ఇప్పుడున్నంత చిన్న కెమెరాలు అందుబాటులో లేవు. బరువుగా ఉన్న కెమెరాను గంటల తరబడి భుజాల మీద మోస్తూ వీడియో తీయాల్సి వచ్చేది. అయినా మల్లీశ్వరి వెనుకడుగు వేయలేదు. తన భవిష్యత్తును తాను తీర్చిదిద్దుకోవాలంటే ఎంత కఠినమైన పనైనా చేయాల్సిందే అనుకుంది. అలా వీడియోక్షిగఫీనే ఉపాధి మార్గంగా ఎంచుకుంది. చిన్న చిన్న అవకాశాలతో చిన్న మొత్తం సంపాదిస్తూనే తన చదువును పూర్తి చేసింది. మొత్తం మీద 2010లో బీఎస్సీ(మ్యాథ్స్) పూర్తిచేసిన మల్లీశ్వరి ఆ తరువాత కూడా వెనుతిరిగి చూడలేదు.

వీడియోజర్నలిస్టుగా….
                వీడియో తీస్తూ ఉపాధి పొందుతున్న మల్లీశ్వరిని న్యూస్ ఛానళ్లు ఆకర్షించాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగిన వాలిపోయే టీవీ జర్నలిస్టులకు ప్రధాన ఆధారం కెమెరామన్. అంటే వీడియోక్షిగాఫర్. తనకు కూడా వీడియో తీయడంలో అనుభవం ఉంది కనుక తానేందుకు ‘కెమెరాఉమన్’ కాకుడదు అన్న ఆలోచన వచ్చింది ఆమెకు. అనుకున్నదే తడవుగా ‘హెచ్‌ఎం టీవీ’ ఛానల్‌లో ఇంటర్వ్యూకు వెళ్లింది. మొదట ఆడపిల్ల ఈ వృత్తిని సమర్థవంతంగా చేయగలుగుతుందా? అనే అనుమానం అందరిలోనూ వ్యక్తమైంది. ఆ అనుమానానికి కారణం… అప్పటి వరకు వీడియో జర్నలిస్టుగా మహిళలు ఎవరూ లేకపోవడమే! మొదటినుంచీ కష్టాలను ఈదడం అలవాటైన మల్లీశ్వరికి వీడియో జర్నలిస్ట్ అనే హార్డిల్ దాటలేనంత క్లిష్టమైందిగా అనిపించలేదు ఆమెకు. అందుకే తన ప్రతిభాసాహసాలతో సిబ్బంది అనుమానాన్ని పటాపంచలు చేసింది. ఆమె ఆసక్తి గమనించిన హెచ్‌ఎం టీవీ యాజమాన్యం కూడా వీడియో జర్నలిజంలో మల్లీశ్వరీకి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహించింది. అలా ఆ రంగంలో చాలా సులువుగా నిలదొక్కుకోగలిగింది. రాష్ట్రంలోనే ‘మొట్టమొదటి కెమెరా ఉమన్’గా తన కెరీర్‌ను ప్రారంభించింది. పూర్తిగా మగవాళ్లకే పరిమితమైన వీడియోజర్నలిజంలో మీరేలా రాణించగలిగారిని మల్లీశ్వరిని అడిగితే…‘హెచ్‌ఎమ్ టీవీ యాజమాన్యం తనను ఎంతగానో ప్రోత్సహించింది, తోటి వీడియోజర్నలిస్టులు కూడా నన్ను ఒక కొలీగ్‌గానే చూశారు’అని తన తొలి అడుగులోని ఆనందాన్ని తెలిపింది. ప్రస్తుతం మల్లీశ్వరి సీవీఆర్ న్యూస్ ఛానల్‌లో వీడియోజర్నలిస్టుగా పనిచేస్తోంది.

పనీ.. పాట..
                 మల్లీశ్వరి ప్రస్తుతం వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పటికీ తన మూలాలను మాత్రం మరవలేదు. అందుకే టీవీ జర్నలిస్టుగా బాలకార్మికులు, 108 సేవలపై ప్రత్యేక కార్యక్షికమాల రూపకల్పనకు కృషిచేస్తోంది. అంతేకాదు గాయనీగా తెలంగాణ ఉద్యమ గీతాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, భక్తిగీతాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన 11 ఆల్బమ్స్‌లో తన గళాన్ని వినిపించింది మల్లీశ్వరి. వెండితర నేపథ్యగాయనీగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. అందుకే ఇటీవల ఓ సినిమాలో ఒక డ్యూయెట్ కూడా పాడింది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

               తనలా మరెవరు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఎం.వి.ఫౌండేషన్‌లాంటి సంస్థల సహకారంతో ఉన్నత చదువులు చదివి, వివిధ రంగాల్లో స్థిరపడిన వారితో కలసి ‘విముక్తి’ అనే ఒక సామాజిక సంస్థను కూడా ప్రారంభించింది. బాలకార్మికులను గుర్తించడం, నగరంలో ఉన్నత వర్గాల ఇళ్లల్లో మగ్గిపోతున్న బాలలను గుర్తించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వారికి విముక్తి కలిపించి విద్యనందించడం, బాల్య వివాహాలను అడ్డుకోవడం వంటి కార్యక్షికమాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థకు మల్లీశ్వరి ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తోంది. తన చదువును డిగ్రీతో ఆపిన మల్లీశ్వరి తనకు వచ్చే జీతంతో ఇద్దరు చెల్లెళ్లను, తమ్ముడినీ చదివిస్తోంది. తనకు ఇతర ఉద్యోగాల మీదా అంతగా ఆసక్తి లేదని, మీడియా రంగంలోనే ‘ది బెస్ట్ కెమెరాఉమన్’ గా ఎదగాలన్నదే తన లక్ష్యం అంటోంది మల్లీశ్వరి. వందల మంది వీడియో జర్నలిస్ట్‌లుండొచ్చు కానీ పశువుల కాపరి నుంచి కెమెరాను డీల్ చేసే స్థాయికి ఎదిగినవాళ్లు కొద్దిమందే ఉంటారు. వాళ్లలో మల్లీశ్వరి ఒకరు. అందుకే ఆమె కెమెరా ఉమనే కాదు ఇన్సిపిరేషనల్ ఉమన్ కూడా!

75మందిలో ఒక్కదాన్నే
             ఎంతమగవారితో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కెమెరాఉమన్ అంటే చిన్నచూపు ఉన్న మాట వాస్తవమే. కానీ నా విషయంలో మాత్రం ఏనాడు ఈ వివక్ష కనిపించలేదు. ఒకప్పుడు నేనొక్కదాన్నే కెమెరాఉమన్‌ని. కానీ ఇప్పుడు వివిధ ఛానెల్స్‌లో మహిళలు వీడియో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సీవీఆర్ న్యూస్‌లో ఉన్న 75 మంది కెమెరాపర్సన్స్‌లో నేనొక్కదాన్నే ఉమన్‌ని.


0 Comments

పనిమనిషి నుంచి రచయిత్రి దాకా!

8/19/2013

0 Comments

 
Picture
                 కష్టాలు లేని జీవితం కావాలని బేబీ ఏనాడూ కోరుకోలేదు. పాతికేళ్ల వయసులో, ముగ్గురు పిల్లలతో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయటికి వచ్చేస్తూ కూడా దేవుణ్ని ఒకటే కోరుకుంది 'దేవుడా నేను భరించగల కష్టాల్నే ఇవ్వు, వాటిని తట్టుకుని నిలబడే శక్తినివ్వు' అని. కంటినిండా నీళ్లు నిండటం చిన్నప్పట్నుంచి అలవాటైన జీవితం తనది. అందుకే రాబోయే కష్టాలను తలుచుకుని భయపడలేదు. అన్నింటికీ సిద్ధపడే ముగ్గురు పిల్లలతో తమ గ్రామం నుంచి ఢిల్లీకి దగ్గర్లోని గుర్‌గావ్‌ వెళ్లే బస్సు ఎక్కేసింది. కిక్కిరిసిన బస్సులో పిల్లలతో సహా కూర్చుంది. ఆలోచనలు స్థిమితంగా లేవు.

                      చిన్నప్పుడే తనను వదిలేసిన అమ్మ... తాగుడుకు బానిసైన నాన్న... పనిమనిషిలా చూసిన సవతి తల్లి... హింసించిన భర్త... అంతా కలిసి ఇలా తమని రోడ్డున పడేసిన చేదు జ్ఞాపకాలు కళ్లల్లో మెదిలాయి. బేబీ అమ్మానాన్నలకు ఒక్కగానొక్క కూతురు. నాన్నకి తనంటే ఇష్టమే. కానీ తాగి వస్తే రాక్షసుడై పోతాడు. వాళ్లమ్మని తిట్టి, కొట్టి బాధపెడతాడు. చాలా ఏళ్లు ఆ కష్టాల్ని భరించిన ఆమె భర్తనీ, బిడ్డనీ వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు బేబీకి నాలుగేళ్లే. అమ్మ లేక, తండ్రి తాగొచ్చి కొడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధపడింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడంతో ఆమె కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. సవతి తల్లి చదువు మాన్పించి, బేబీతో ఇంటి పనులన్నీ చేయించేది. అయినా దొంగతనంగా, తనుండే ముర్షిదాబాద్‌లోని స్కూలుకెళ్లి బెంగాలీలో చదవడం, రాయడం నేర్చుకుంది.

                             పట్టుమని పన్నెండేళ్లు నిండలేదు... బంధువులెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. బేబీని వదిలించుకోవడానికి ఇదే అవకాశం అనుకున్న సవతి తల్లి భర్తని ఒప్పించి, ఇరవై ఆరేళ్ల వయసున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేసింది. భర్త చిరుద్యోగి. సంపాదన తక్కువ. సాధింపులు ఎక్కువ. ఇంటిపనీ, వంటపనీ చేయలేక, భర్త తిట్లు భరించలేక చాలా బాధపడింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ తరవాత రెండేళ్లలో మరో ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. భర్త, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో... పిల్లలకి తిండి పెట్టేందుకు ఇళ్లల్లో పాచి పనులకు వెళ్లడం ప్రారంభించింది.

                         ఏళ్లు గడుస్తున్నాయి... బేబీ కష్టాలు ఇంకా పెరిగాయి. సరిగ్గా ఆ సమయంలోనే తన చెల్లెల్ని మరిది చంపేశాడన్న వార్తతో నిలువునా కుంగిపోయింది. తనకీ అలాంటి పరిస్థితి వస్తే పిల్లల పరిస్థితేంటి... అని ఆలోచించింది. ఓ రోజు ఎప్పటిలాగే భార్యాభర్తలిద్దరి మధ్యా పెద్ద గొడవ. అప్పటికే విసిగిపోయి ఉన్న బేబీ పిల్లలతో కలిసి ఇంట్లోంచి బయటికొచ్చి, కంటికి కనిపించిన బస్సు ఎక్కేసింది. ఢిల్లీకి దగ్గర్లోని గుర్‌గావ్‌కు చేరుకుంది. అక్కడ ప్రొఫెసర్‌ ప్రబోధ్‌ కుమార్‌ ఇంట్లో పనిమనిషిగా చేరింది. పదవీ విరమణ పొందిన ప్రబోధ్‌ ఇంట్లో ఎటు చూసినా పుస్తకాలే. ఒకరోజు బేబీ అల్మరాలు తుడుస్తుండగా కొన్ని పుస్తకాలు కిందపడ్డాయి. వాటిని అపురూపంగా చూసుకునే ప్రబోధ్‌ 'వాటిని చదివితే కానీ ఎంత విలువైనవో తెలియదు' అంటూ కోప్పడి కొన్ని పుస్తకాలిచ్చి, వాటిల్లో తనకి నచ్చిన పుస్తకం చదవమని చెప్పాడు.

                             బెంగాలీలో ఉన్న తస్లీమా నస్రీన్‌ ఆత్మకథని చదవడం మొదలుపెట్టింది బేబీ. ఒకటీ, ఇంకొకటీ, మరొకటీ... ఇలా వరుసగా పుస్తకాలు చదువుతూ ప్రపంచాన్నే మరిచిపోయింది. కొన్ని రోజులు గడిచాక ప్రొఫెసర్‌ కొన్ని కాగితాలిచ్చి, 'నువ్వు చదివిన పుస్తకాల్లో ఏది నచ్చిందో, ఎందుకు నచ్చిందో రాసివ్వు' అన్నారు. తస్లీమా నస్రీన్‌ పుస్తకం గురించి తనకొచ్చిన వాడుక భాషలో రాసిచ్చింది. దానిని చదివిన ప్రబోధ్‌ ఆమె రాసిన తీరుకీ, వాక్యాల్లోని గాఢతకీ ఆశ్చర్యపోయాడు. కట్ట కాగితాలిచ్చి, ఏదయినా కథ రాసి తెమ్మన్నాడు. పగలంతా పనులు చేసుకుని, రాత్రి వేళ తన జీవితాన్నే కథగా రాయడం మొదలుపెట్టింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలూ, కష్టాలూ, పారిపోయి వచ్చిన సంగతులూ, పిల్లలూ, వాళ్ల గురించిన కలలూ... 143 పేజీల కథ సిద్ధమైంది.

                       ఆడపిల్ల కష్టాల్నీ, కన్నీళ్లనీ కళ్లకు కట్టే ఆ కథ ప్రొఫెసర్‌ని కదిలించింది. ఆయన దాన్ని హిందీలోకి తర్జుమా చేయించి 'ఆలో ఆంధరీ' పేరుతో కొన్ని పుస్తకాలు అచ్చు వేయించాడు. కొన్ని రోజుల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. పనిమనిషి జీవిత కథగా చాలా పేరుతెచ్చుకుంది. జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. బెంగాలీ, మలయాళంతో సహా సుమారు ఇరవై భాషల్లోకి అది తర్జుమా అయ్యింది. ఆర్థికంగా, సామాజిక గౌరవం పరంగా బేబీ హాల్దార్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్సాహంగా 'ఇషత్‌ రూపాంతర్‌' పేరుతో రెండో పుస్తకం రాసింది. అదీ ఆదరణ పొందింది. ప్రస్తుతం మూడో పుస్తకం రాసే పనిలో ఉన్న బేబీ పిల్లలకి మంచి చదువు చెప్పిస్తోంది. కోల్‌కతాలో సొంత ఇల్లు కట్టుకుంటోంది.

మూలం : ఈనాడు దినపత్రిక 

0 Comments

హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసర్

8/19/2013

0 Comments

 
Picture
             














                          ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అరుదైన అమెరికాలోని హార్వాడ్గ యూనివర్శిటీలో భారతీయ సంతతి మహిళకు తొలిసారిగా ప్రొఫెసర్‌ హోదా లభించింది. గోపినాథ్‌ భారత్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తొలుత ఢిల్లీయూనివర్సిటీలో విద్యనభ్యసించారు. హార్వాడ్గ విశ్వవిద్యాలయాలలో ఆర్ధిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించడం గీతా గోపినాథ్ కి దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. గీతా గోపినాథ్‌ తన ఎకనామిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని ఢిల్లీ లోని లేడి శ్రీరామ్‌ కాలేజీలో, మాస్టర్‌ డిగ్రీని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేశారు. ఆ తర్వాత 2001లో ప్రిన్సటన్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు.2005లో హార్వార్డ్‌ యూనివర్సిటీలో చేరక ముందు వరకు చికాగోభూత్‌స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పని చేశారు.‘ఆమె బ్యాచిలర్‌ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ 1990-91లోనే చవిచూసింది. అసలు సంక్షోభం ఎందుకు సంబవిస్తుందో తెలుసుకోవాలన్న ఆకాంక్షే అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర అధ్యయనానికి కారణమైందన్నారు.

                   మాక్రో ఎకనామిక్స్‌ బోధించడంతో పాటు అంతర్జాతీయ ధరల నియంత్రణ, మార్పిడి ధరల నిర్ణయం, అత్యవసర మార్కెట్‌ వ్యాపారం, ఆర్థికమాంధ్యం తదితర అంశాలపై రిచర్చ్‌ చేశారు. గీత రాసిన అనేక ఆర్థిక సంబంధ కథనాలు అమెరి కన్‌ ఎకానమిక్‌ రివ్యూ, త్రైమాసిక ఎకానమిక్‌ జర్నల్‌, రాజకీయ ఆర్థిక జర్నల్‌, రివ్యూ ఆఫ్‌ ఎకానమిక్‌ స్టడీస్‌, ఇంటర్నేషనల్‌ ఎకానమిక్‌ తదితర పుస్తకాలలో ప్రచురితమయ్యాయి.గీతా గోపినాథ్‌ ఎకనామిస్ట్‌గా అర్థికసంక్షోభం సమయంలో గ్రీస్‌, ఐస్‌లాండ్‌లలో పరిశోధనలు చేశారు. ఆ అనుభవమే ఆమెకు ప్రొఫెసర్‌గా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడింది. హర్వార్డ్‌ యూనివర్సిటీలో అతి పెద్ద విభాగమైన ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎంపిక కావడం ఒక ఎత్తయితే ఇప్పటివరకు ఆ హోదాను పొందిన మహిళల్లో మూడవ మహిళ కావడం అందులోనూ భారతదేశం నుంచి తొలి మహిళా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

                  గ్రీస్‌లో జరిగిన దేశాలు-ఆర్థికసంక్షోభం అనే అంశం మీదా జరిగిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్న భారత ప్రణాళిక సంఘం సభ్యులకు గోపినాథ్‌ పలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రణాళికలో ఉన్న లోపాలను సవరించాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉందని కూడా సూచిచారు. ఒక భారతీయ వనిత అతి చిన్న వయస్సులో అత్యున్నత స్థానంలో నిలవడంతో పాటు ఈ పదవిని అలంకరించిన తొలి భారతీయు రాలుగా కీర్తిని గడించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

మూలం : తెలుగు విశేష్

0 Comments

ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ్‌భాయ్ సివిల్స్ టాపర్

8/17/2013

0 Comments

 
Picture
                    పట్టుదల, దృఢచిత్తం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని గుజరాత్ రాష్ట్రానికి చెందిన కోమల్ అనే మహిళ నిరూపించింది. పెళ్లయిన 15 రోజులకే కట్నం చాల్లేదని తన భర్త, ఆడబిడ్డలు ఇంట్లో నుంచి ఆమెను గెంటివేశారు. అదనపు కట్నం ఇచ్చుకోలేని కడుపేదరికం వల్ల ఆమెను అత్తారింటివాళ్లు గెంటివేశారు. ఐనా తన జీవితం ఇక ఎడారిగా మారిపోతుందని దిగులు చెందక జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఏకైక లక్ష్యంతో కోమల్ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయింది. ఆమె కన్న కల సాకారమైంది. యూనియన్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఏకంగా ఆమె 591 ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

                   ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లెటూరులో ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పనిచేస్తున్న కోమల్ త్వరలో ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్‌లో చేరబోతోంది. అదనపు కట్నం ఇవ్వలేని కారణంగా భర్తతో గెంటివేయబడ్డ కోమల్ స్టోరీ తెలుసుకుందాం.

                    కోమల్ అందానికి అందం ఉన్న అమ్మాయే. అలాగే అందరి అమ్మాయిల్లాగే కోమల్ కూడా తనకు కాబోయేవాడి గురించి కలలు కన్నది. తన తండ్రి రిటైర్డ్ టీచర్. ఐతే కూతురుకు గొప్పింటి సంబంధం చేయాలని, ఆమెను సుఖసంతోషాలతో చూడాలని న్యూజీలాండ్ లో పనిచేస్తున్న ఓ ఎన్నారైకిచ్చి పెళ్లి చేశాడు. అయితే 15 రోజులు కూడా తిరక్కుండా కూతురు జీవితం వీధిన పడేశాడు సదరు ఎన్నారై భర్త. 

                 కోమల్ ఆడబిడ్డలు సైతం తోటి స్త్రీ అనే కనికరం లేకుండా గెంటివేశారు. దీంతో కోమల్ పుట్టింటికి తిరిగి వచ్చేసింది. తనకు న్యాయం కావాలంటూ ఆమె చేసిన ప్రయత్నాలను ఆమె పేదరికమే వెక్కిరించింది. ఆ స్థితిని చూసుకుని కుంగిపోకుండా పాఠశాలలో టీచర్‌గా చేరి తన లక్ష్యం ఏమిటో నిర్దేశించుకున్నది. ఆ దృఢ సంకల్పమే ఆమెను సివిల్స్‌లో టాపర్‌గా నిలిపింది. 

               తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన భర్త, ఆడబిడ్డల పనిపడతానని ఇప్పుడు అంటోంది. న్యూజీలాండ్‌లో ఉంటున్న భర్త, ఆడబిడ్డలు వివరాలు తనకు తెలిసే అవకాశం లేకుండా వారు జాగ్రత్తపడ్డారనీ, అయినా వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని కోమల్ చెపుతోంది. తన జీవితాన్ని ఎడారిమయం చేసినవారికి బుద్ధి చెపుతాననీ, తన జీవితంలా మరో స్త్రీ జీవితం కాకుండా చేయాలన్నదే తన తాపత్రయం అని అంటోంది కోమల్. అవును... కోమల్ పట్టుదల, జీవితంపై ఉన్న నిబద్ధత, దృఢచిత్తం ఆదర్శనీయం కదా.


0 Comments

అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమంత్రి రబ్బానీ

8/17/2013

0 Comments

 
Picture
                   దాయాది దేశాలైన భారత్-పాక్ విదేశాంగ మంత్రుల స్థాయి శాంతి చర్చలు ఇటీవల న్యూఢిల్లీలో జరిగాయి. పరస్పరం ఘర్షణ పడే ఈ రెండు దేశాల జరిపిన చర్చల కంటే చర్చల్లో పాల్గొన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ తన అందం, వాక్చాతుర్యంతో మీడియా, ప్రజల్ని తనవైపు ఆకర్షించారు. ఈ మితభాషి గురించిన విశేషాలు ఒకసారి పరిశీలిస్తే......

వ్యక్తిగత జీవితం: 
                  హీనా రబ్బానీ ఖర్ 1977 జనవరి 19న పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జన్మించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అయిన యువ, తొలి మహిళ హీనా రబ్బానీ. ఈమె పాకిస్థాన్ ప్రముఖ రాజకీయవేత్త ఇబ్రహీం అర్కమ్ కుమార్తె. 

                 వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన హీనా మూలాలు పంజాబ్ రాష్ట్రంలోని ముజఫరాహ్ జిల్లా ఖర్ ఘర్బీ గ్రామంలో ఉన్నాయి. 1999లో లాహోర్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ(హానర్స్) గ్రాడ్యుయేషన్ పొందారు. 2001లో మసాచూసెట్స్ యూనివర్శిటీలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 

                   ఫిరోజ్ గుల్జార్‌ను వివాహమాడిన ఆమెకు ఇద్దరు పిల్లలు. లాహోర్‌లోని లాహోర్ పోలో మైదానంలో పేరొందిన ఉన్నతస్థాయి రెస్టారెంట్‌ పోలో లౌంజికి సహ భాగస్వామి. 

రాజకీయ జీవితం: 
                హీనా రబ్బానీ ఖర్ పాకిస్థాన్ ముస్లీం లీగ్(పీఎంఎల్-క్యూ) తరపున 2002లో జాతీయ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో పీఎంఎల్-క్యూ ఆమెకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లో చేరి 84 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

                     యూసఫ్ రజా గిలానీ క్యాబినేట్‌లో హీనా ఆర్థిక వ్యవహారాలు, గణాంకాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009 జూన్ 13న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 

విదేశాంగ మంత్రి: 
                    ఆఫ్ఘన్-పాక్ ట్రాన్సిట్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రితో కలిసి హీనా రబ్బానీ సంతకం చేశారు. ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీ చేసిన క్యాబినేట్ పునర్‌వ్యవస్థీకరణలో 2011 ఫిబ్రవరి 11న విదేశాంగ సహాయ మంత్రిగా నియమించబడ్డారు. 

                షా మొహమ్మద్ ఖురేషి విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో 2011 ఫిబ్రవరి 13 వరకు తాత్కాలికంగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. జులై 19న అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీచే అధికారికంగా విదేశాంగ మంత్రిగా ఎంపికైన ఆమె జూలై 20న బాధ్యతలు స్వీకరించారు. 

మీడియాలో:

                      దేశ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలుత ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటించిన ఆమె అనంతరం శాంతి చర్చలకు గానూ భారత్‌కు వచ్చారు. చర్చల కంటే హీనా అందం, ఫ్యాషన్‌ గురించే జాతీయ మీడియా ఎక్కువగా ప్రస్తావించడంతో భారత పర్యటన సందర్భంగా సాధారణ ప్రజలను సైతం ఆమె ఆకర్షించారు. 

వివాదం-విమర్శలు: 
                  తొలిసారి విదేశాంగ మంత్రిగా భారత్‌ వచ్చిన రబ్బానీ ఖర్ భారత ప్రభుత్వ ప్రతినిధులను కలవక ముందే కాశ్మీర్ వేర్పాటువాద నాయకులతో సమావేశమై వివాదాన్ని సృష్టించారు. దీంతో ఆమె ప్రతిపక్ష బీజేపీతో పాటు భారత మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వేర్పాటువాదులతో ఖర్ భేటీని ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొన్న బీజేపీ ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.


0 Comments

హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం

8/16/2013

0 Comments

 
Picture
హైదరాబాద్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగి లక్నోలో యుక్తవయస్సుకొచ్చిందట!
అందుకేనేమో ఉర్దూ పురుడు పోసుకున్న ఈ నగరం ఆ భాషలో
ఎందరో కవులు, రచయితలనూ కని భాగ్యవంతురాలైంది!
హైదరాబాద్ అదృష్టాన్ని పెంచిన వాళ్లలో జిలానీ బాను కూడా ఒకరు!
పంచదార పలుకుల ఉర్దూకు పరిసరాల యోచనలను జాగృతపరిచే రచనలను అందించింది..
తన కలాన్ని హైదరాబాద్ సంస్కృతికి అద్దంలా మార్చిన జిలానీ బాను గురించి....

ఇప్పటి వరకు నేను 94 పుస్తకాలు రాశాను. ప్రతి పుస్తకం హైదరాబాద్ నేపథ్యానికి సంబంధించినదే! నేను రాసిన ‘పత్తరోంకీ బారిష్’ (హెల్ ఆఫ్ స్టోన్స్) అనే ఉర్దూ నవల ఇంగ్లీష్,
తెలుగు, మరాఠీ వంటి చాలా భాషల్లోకి అనువాదమైంది. నా నవలల్లో చాలావాటిని దాశరథి రంగాచార్యులు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. నాలుగు గోడల మధ్య కూర్చొని రాసే టైప్ కాదు నేను. నా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకొని, పరిశీలించి రాసే రచయితను.

స్వేచ్ఛనిచ్చాడు...
                    మా నాన్న గొప్ప షాయర్ (కవి), అంతే గొప్ప స్కాలర్ కూడా! మా ఇల్లు పుస్తకాల నిలయంగా ఉండేది. అందులో విదేశీ రచయితల పుస్తకాలతోపాటు పాకిస్థాన్ రచయితల పుస్తకాలూ ఉండేవి. సంగీత కచేరీకి మా ఇల్లు పెట్టింది పేరు! సాయంత్రం అయిందంటే చాలు రోజూ ఇంట్లో సంగీత కచేరీ జరిగేది. ఆ వాతావరణంలో పెరిగిన నాకు అటు సాహిత్య పఠనం, ఇటు సంగీత శ్రవణం రోజువారీ కార్యక్షికమాల్లో భాగం అయ్యాయి. అవే నా రచనాశక్తికి ప్రేరణ, స్ఫూర్తిని కలిగించాయని చెప్పొచ్చు! నాకు పాడడం రాకపోయినా హిందుస్థానీ సంగీతంలోని ప్రతి రాగాన్ని గుర్తుపట్టగలను. ఇప్పటికీ ఏదైనా రాగం వినిపించి అదే రాగమో అడిగితే తడుముకోకుండా టక్కున రాగం పేరు చెప్పగలను! ఇస్లాం సంప్రదాయ హద్దుల్లోనే పెరిగినా మా నాన్న మాకు అన్ని విషయాలు నేర్చుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఒకేదానికి పరిమితమై పోవడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అయితే మా మేనమామ మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. మా చిన్నప్పుడు మా అమ్మ ఇస్మత్ ఛుగ్తాయ్ పుస్తకాలను లైబ్రరీ నుంచి తెప్పించుకొని బాగా చదివేది. ఆమెతోపాటు నేనూ చదివేదాన్ని. కానీ మా మమయ్యకు ఇష్టం ఉండకపోయేది. ‘ఇవి ఆడవాళ్లు చదివే పుస్తకాలు కావు, చదవొద్దు’ అని మా అమ్మతో చెప్పేవాడు. అలాంటి కట్టుబాట్లు కొంచెం ఉండేవి కానీ మరీ ఆడవాళ్లు గడప దాటకూడదు అనే ఆంక్షలైతే లేకుండే!

పల్లె జ్ఞానం...
                    మా చిన్నప్పుడు మా ఇంట్లో లక్ష్మి అనే హిందూ మహిళ పనిచేసేది. అసలు మమ్మల్ని పెంచింది ఆవిడే! సెలవుల్లో ఆమెతో వాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. ఎడ్ల బండ్లమీద ప్రయాణం! లక్ష్మీ వాళ్ల ఊరు వెళ్లిన ప్రతీసారి అక్కడి ప్రజలు, వాళ్ల జీవన విధానం, సమస్యలు, అవసరాలు వగైరా అన్నిటినీ పరిశీలించేదాన్ని. భూస్వాములు, నాయకులు పిల్లలతో వెట్టి చేయించుకునేవారు. చదువంటే తెలిసేది కాదు వాళ్లకు. ఇట్లా ఆ పల్లెటూరు నాకు చాలా విషయాలను నేర్పింది. ఎంతో జ్ఞానాన్నిచ్చింది. తర్వాత తర్వాత అవే నా రచనలకు మూల వస్తువులయ్యాయి.

నాకు పధ్నాలుగేళ్లప్పుడనుకుంటా...
                      ఓ కథ రాశాను ‘దూర్ కి ఆవాజ్’ పేరుతో! అది చూసిన మగ్దుం మా నాన్నతో ‘అంత చిన్న పిల్లకు సమాజం గురించి ఏం తెల్సని పెద్ద పెద్ద విషయాల మీద కథ రాస్తుంది? అలాంటివి రాయొద్దని చెప్పు జిలానీతో’ అని అన్నాడట! మా నాన్న ఇంటి కొచ్చి ‘మగ్దుం ఇలా అంటున్నాడు.. అలాంటి విషయాల మీద తప్ప ఇంక దేనిమీదైనా రాసుకోమ్మా’ అని నాతో చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకు ఏదో పనిమీద మగ్దుం మా ఇంటికి వచ్చాడు ‘జిలానీ.. కథలు బాగా రాస్తున్నావ్.. శభాష్! అలాగే మంచిగా రాయి’అని మెచ్చుకున్నాడు. మా నాన్నతో ‘ఈ అమ్మాయి మీద ఆంక్షలేమీ పెట్టకు. తనకు నచ్చింది రాయనియ్’ అని చెప్పాడు. నా రచనలను చదివి పాకిస్థాన్‌లో ఉన్న రచయితలు కూడా ‘బాగా రాస్తున్నావ్’ అని ప్రశంసిస్తూ ఉత్తరాలు రాసేవారు. ఇంటర్ పూర్తవగానే పెళ్లయింది. ఆయనకూడా మంచి షాయర్, ఆలీగఢ్ యూనివర్శిటీ ప్రొఫెసర్. రైటర్, టీవీ సీరియల్ డైరెక్టర్. ఆయనా నాకు చదువుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడా నా ఆసక్తులకు ఆటంకం కలిగించలేదు. అందుకే పెళ్లాయ్యాకే జామియా యూనివర్శిటీ నుంచి బీఏ, ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎమ్మే చేశాను. పీహెచ్‌డీ చేయాలనే తపన ఉన్నా పిల్లలు, ఇతర బాధ్యతలతో కాలేదు.

వెల్‌డన్ అబ్బా..
                        హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల నేపథ్యంతో ‘నర్సయ్యకీ బౌడీ’ అనే టెలీప్లే రాశాను. దాన్నే శ్యాం బెనెగళ్ ‘వెల్‌డన్ అబ్బా’ పేరుతో సినిమా తీశాడు. అసలు హైదరాబాద్‌కున్న కల్చరే వేరు. వందల ఏండ్ల కిందటి నుంచే ఇది కాస్మాపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉంది. హిందూ, ముస్లింలు సహజీవనం చేస్తారిక్కడ. అదే హైదరాబాద్ పెహచాన్! దేశంలో ఇంకెక్కడికి వెళ్లినా ఈ అద్భుతం కనిపించదు మనకు. అంతెందుకు మా చిన్నప్పుడు మేం మల్లేపల్లిలో ఉన్నప్పుడు మా పనమ్మాయి లక్ష్మితో కలిసి హిందూ దేవాలయాలకు వెళ్లేవాళ్లం. దసరా ముందు బతుకమ్మ ఆడేవాళ్లం. అందుకే నాకు హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం. ఆ కల్చర్ మీద బోలెడు రచనలు చేశాను. దీనికి ఇప్పటి యువత దూరమవుతోంది. సాహిత్యం అంటే ఇప్పటి పిల్లలకు పరిచయంలేని విషయం. పుస్తకాలు చదివితేనే సమకాలీన సమాజం తెలుస్తుంది. చరిత్రా అవగతమవుతుంది. మానసిక పరిణతి పెంచేవి ఇవేకదా! సాహిత్యం తర్వాత తరాలకు ఓ గైడ్ లాంటిది. మా మనవలు, మనవరాళ్లకు మాత్రం వీటన్నిటితో స్నేహం చేయిస్తున్నాను.

వాళ్ల కొరత ఎక్కువే..
                  ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలంటాన్నేను. అప్పుడే మాతృభాష వికాసం చెందుతుంది. విస్తృతమవుతుంది. భాషతోనే సంస్కృతీ బతుకుతుంది. అలాగని ఇంగ్లీష్ అవసరంలేదు అనను. కానీ మాతృభాష మీద పట్టు అత్యంతావశ్యకం అంటున్నాను! తెలుగు మాట్లాడగలను, కానీ చదవలేను కాబట్టి తెలుగు సాహిత్యం లోతుపాతుల గురించి అంతగా తెలియదు. హిందీ, ఉర్దూ భాషల్లో రొమాన్స్ గురించే కాదు సమాజంలోని పరిస్థితులు, సమస్యల గురించీ మంచి రచనలు చేసేవాళ్లు ఉన్నారు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే ఒక రచయితగా నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది అనిపిస్తుంటుంది. మగ్దుం కవితలతో ఇప్పటికీ నేను స్ఫూర్తి పొందుతుంటాను. ఆయనలాంటి కవులు ఇప్పుడు లేరు. కొరత అనిపిస్తుంటుంది. అసలు ఇప్పటి తరంలో రచయితలు, కవులు, కళాకారులు, చిత్రకారులు చాలా చాలా తక్కువ! వాళ్ల కొరత ఎక్కువే!

                  జిలానీ బాను సాహితీవేత్తగానే కాదు సామాజికవేత్త కూడా! వెట్టిచాకిరి, స్త్రీ సమస్యలు, నగర జీవితంలోని ఒత్తిళ్లు మొదలైన అంశాల మీద పనిచేస్తోంది. అస్మిత స్వచ్ఛంద సంస్థకు చైర్ పర్సన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. అంతేకాదు చైల్డ్ అండ్ విమెన్, హ్యూమన్‌రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్(ఇండియా)కు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా కూడా. ఉర్దూభాషకు సంబంధించి విశేష కృషిచేస్తున్న 76 ఏళ్ల జిలానీబానును గాలిబ్, ఆల్‌ఇండియా ఔమీ హలీ, ఆలమ్ ఎ ఉర్దూ ఫరోఘి అవార్డులతో పాటు ఎన్నో దేశవిదేశీ సత్కారాలు వరించాయి. 2011లో మన ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది!


మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక


0 Comments

స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు

8/15/2013

0 Comments

 
                        మహిళలు బయటికి రావడమే అరుదైన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కొందరు సమరంలో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారు. ఉద్యమానికి ఊపిర్లూదారు. ప్రసంగాలు, యుద్ధాలు, కవితలతో బ్రిటీష్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమాన్య వర్గాల్లోకి స్వాతంత్య్ర పిపాసను రగిలించగలిగారు. వీరిలో సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయ్‌, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ చెప్పుకోదగినవారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారి గురించి కొన్ని విశేషాలు...

ప్రసంగాలతో పోరాటంలో కీలకపాత్ర
1857లో సత్తా నిరూపించిన లక్ష్మీబాయ్‌
తెలుగు నారీ తక్కువ కాదన్న దుర్గాబాయ్‌
గాంధీ మెచ్చిన ధీర సరోజినీ


Picture
దుర్గాబాయి దేశ్‌ముఖ్‌
               

                చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ల వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్‌ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్‌ లేని కారణంతో ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టయింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1952లో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యురాలిగా పని చేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్‌ రిలీఫ్‌ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేశారు. 1958లో హైదరాబాద్‌లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.


Picture
సరోజినీ నాయుడు
              సరోజినీ నాయుడు భారత కోకిలగా, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర పోషించారు. 1879లో పుట్టిన ఈమె కవయిత్రి కూడా. సరోజినీ దేవి 1935 డిసెంబర్‌లో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

            సరోజినీనాయుడు భారత దేశంలోని ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయ్యారు. ఎంత కఠినమైన విషయాలైనా శ్రోతల గుండెలను హత్తుకుని యదార్థ స్థితిని అర్థమయ్యేలా ఆమె గంభీరమైన ఉపన్యాసం శ్రోతలకు కాలం, శ్రమ తెలియనిచ్చేవి కావు.

                           ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్యవద్దనీ, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ. గాంధీజీ ఆరేళ్లు జైలు శిక్ష ననుభవించేందుకు వెళుతూ సరోజినీనాయుడుపై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించి చేతిలో చేయి వేసుకున్నారు. ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్య్ర ప్రభోదం ముమ్మరంగా సాగించింది.

                  క్విట్‌ ఇండియా ఉద్యమంలో 1942లో బ్రిటిష్‌ ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్య్ర పోరాటం సాగించిందామె. అందుకు ఫలితంగా అరెస్టయి దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితం అనుభవించింది. దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆమెకు ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌ పదవి యిచ్చి సత్కరించారు.


Picture
ఝాన్సీ లక్ష్మీబాయి

                 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం జరగడానికి ముఖ్య భూమిక పోషించిన వీర నారీ. ఈమె ఉత్తర భారతదేశ రాజ్య మైన ఝాన్సీ అనే రాజ్యా నికి రాణి. చిన్నతనం లోనే కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలను నేర్చుకుంది. ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది. ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌తో వివాహమైంది. తాము దత్తత తీసుకున్న బాలుడి విషయంలో బ్రిటీష్‌ వారితో కయ్యం ఆరంభం అయింది. తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆమెను ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. 1857లో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. జనవరి 1858లో బ్రిటిష్‌ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రాణి మాత్రం దత్తత తీసుకున్న బిడ్డను వీపున తగిలించుకుని పారిపోయి తాంతియా తోపేను కలుసుకుంది. రాణి 1858లో మరణించింది. గ్వాలియర్‌ యుద్ధంలో ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పింది. అందుకే ఆమె భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శప్రాయంగా నిలిచింది.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

చాయాచిత్ర చరిత్రకారిణి మార్గరిట్

8/14/2013

0 Comments

 
Picture
Picture
                    పురుషాధిక్యత ఎక్కువగా కనిపించే రంగంలో వారికి సవాలు విసిరిన మహిళ ఆమె. ఛాయాచిత్రాలు తీయడం మగవాళ్ళ గుత్త సొత్తుగా ఉన్న రోజుల్లో వారికి దీటుగా, చాలా సందర్భాల్లో వారి కన్నా మేటిగా వృత్తి నైపుణ్యం చూపిన ఉత్సాహశీలి ఆమె. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మహిళా ఫోటోజర్నలిస్టు మార్గరెట్‌ బూర్క్‌-వైట్‌కు ఇలాంటి విశిష్టతలెన్నో ఉన్నాయి. జన బాహుళ్యంలో విశేష ప్రాచుర్యమున్న 'లైఫ్‌' మ్యాగజైన్‌కు స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారామె. ఇరవయ్యో శతాబ్దానికి చెందిన కీలక ఘట్టాలెన్నిటినో ఆమె తన కెమేరాలో బంధించారు. ఆ క్రమంలో ఆమె ప్రపంచంలోని సంక్షుభిత ప్రాంతాలెన్నిటినో సందర్శించారు. మానవ జాతి చరిత్ర గతిని మార్చేసిన ఇరవయ్యో శతాబ్దపు ఘట్టాలెన్నింటినో ఆమె ఛాయాచిత్ర బద్ధం చేశారు.



                                   ప్రపంచంలో యుద్ధ వార్తలను పత్రికలకు అందించే పనిలో నియుక్తురాలైన మొట్టమొదటి మహిళా విలేఖరి కూడా ఆమె. అలా తొలి మహిళా 'వార్‌ కరెస్పాం డెంట్‌'గా ఆమె రెండో ప్రపంచ యుద్ధ వార్తా దృశ్యాలను జనం ముందుకు తెచ్చారు. అలాగే, సోవియట్‌ యూనియన్‌లో పర్యటించి, అక్కడి అంశాలను ఛాయాచిత్ర బద్ధం చేయడానికి అనుమతి పొందిన తొలి అమెరికన్‌ కూడా ఆమే.

                    ఆమె సోవియట్‌ యూనియన్‌ అంతా తిరిగి, అక్కడ శరవేగంతో సాగుతున్న పారిశ్రామికీకరణను ఫోటోలు తీశారు. అంతే కాకుండా, క్రెమ్లిన్‌లో స్టాలిన్‌ ఫోటో కూడా తీశారు.

                   మన దేశానికి సంబంధించి కూడా మార్గరెట్‌ ఫోటోలకు ప్రత్యేకత ఉంది. ఆమె తీసిన అత్యంత ప్రముఖమైన ఫోటోలు అనేకం భారతదేశ స్వాతంత్య్ర సముపార్జన సమయంలోవి కావడం విశేషం. దేశం భారత, పాకిస్తాన్‌లుగా విభజనకు లోనై, బ్రిటీషు పరిపాలన నుంచి స్వాతంత్య్రం వైపు అడుగులు వేసిన సమయంలో ఆమె తీసిన అద్భుతమైన ఫోటోలెన్నో ఇవాళ ఆనాటి చరిత్రను కళ్ళకు కడుతున్నాయి.

                   మహాత్మా గాంధీ, మహమ్మద్‌ అలీ జిన్నాలతో సహా ఆ కాలపు ప్రముఖ నేతలందరినీ ఆమె ఫోటోలు తీశారు. పట్టుబట్టి, కావాల్సిన విధంగా ఆమె ఫోటోలు తీసే పద్ధతి చూసి, 'హింసాకారిణి' అంటూ ఆ రోజుల్లోనే గాంధీ ఆమెను ఛలోక్తిగా పిలిచేవారు. దేశ విభజన సమయంలో లక్షలాది ప్రజలు వలస పోవడం, మత ఘర్షణల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఆమె కళ్ళారా చూశారు. భారత ఉపఖండం రెండు స్వతంత్ర దేశాలుగా చీలిన ఘట్టానికి ఆమె, ఆమె కెమేరా ప్రత్యక్ష సాక్షులు.

                      ''1946లో వసంతకాలపు తొలి రోజుల్లో నేను భారత్‌కు వెళ్ళాను. అప్పటికే భారతదేశ స్వాతంత్య్రానికి పునాది పడింది. ఆ ఏడాదిలో చాలా కాలం నేను భారత్‌లోని వివిధ ప్రాంతాలకు పర్యటించాను. ఆపైన నేను స్వదేశానికి తిరిగి వచ్చాను. ...కానీ, భారతదేశం గురించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గుర్తించాను. అందుకే, భారత్‌కు మళ్ళీ వచ్చి, 1947లో కొంత భాగం, ఆ మరుసటి ఏడాది అంతా ఇక్కడే గడిపాను'' అని మార్గరెట్‌ తన అనుభవాల్లో పేర్కొన్నారు.

                1904 జూన్‌ 14న జోసెఫ్‌ వైట్‌, మిన్నీ బూర్క్‌ దంపతులకు మార్గరెట్‌ జన్మించారు. ఆ దంపతుల ముగ్గురి సంతానంలో రెండో వ్యక్తి - మార్గరెట్‌. ప్రకృతినీ, ప్రాణులనూ అమితంగా ప్రేమించే తల్లితండ్రుల ప్రభావంతో ఆమె పెరిగారు. పాముల లాంటి సరీసృపాలతో చెలిమి చేసిన ఆమె దాదాపు ఓ జంతుశాస్త్రవేత్త అవుతుందేమో అని అందరూ అనుకున్నారు.

                 అయితే, ఫోటోగ్రఫీ మీద, ఫోటోలు తీసే విధానాలను మెరుగుపరచడం మీద ఆమె తండ్రికి ప్రేమ చాలా ఎక్కువ. ఆయనకు సహాయకురాలిగా వ్యవహరించారు.

                  నిజానికి, ఆమె ఎన్నడూ ఓ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌ కావాలని అనుకోలేదు. అయితే, కాలేజ్‌లో ఉండగా తమ ఇంటి దగ్గర, కొండల నేపథ్యంలో ఓ శిబిరానికి ఆమె ఫోటోగ్రఫీ కౌన్సెలర్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. తెలతెలవారుతుండగానే కొండల నేపథ్యంలో ఆ శిబిరం ఫోటోలు తీయడానికి రాత్రంతా ఆమె సహనంతో వేచి చూసేవారు. అలా తీసిన ఓ ఫోటో ప్రతులు కొన్ని వందల సంఖ్యలో అమ్ముడయ్యాయి.

                    దాంతో, ఫోటోగ్రఫీని వృత్తిగా చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అదే జీవితంగా గడిపారు. ''నాకు పనే దైవం. పని మీద అంతటి గౌరవం నాలో పెంపొందింపజేయ డానికి మా నాన్న గారే కారణం!'' అని మార్గరెట్‌ చెప్పారు.

                  సమకాలీన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో ప్రతిఫలించే మ్యాగజైన్‌గా 'లైఫ్‌' పత్రిక అమెరికాలో ప్రారంభమైనప్పుడు ఫోటో జర్నలిస్టుగా తొలి అవకాశం ఆమెకే దక్కింది. అవసరమైన ఒకే ఒక్క గొప్ప ఫోటో కోసం ఎన్ని రీళ్ళు ఖర్చు చేసినా నష్టం లేదని ఆమెకు కెరీర్‌ తొలినాళ్ళలోనే అర్థమైపోయింది. అందుకే, ఆమె మిగిలినవాళ్ళు చాలనుకొనేదాని కన్నా చాలా ఎక్కువ ఫోటోలు తీసేవారు. అందుకు ఒక్క కెమేరా చాలదు కాబట్టి, ఒకేసారి అయిదు కెమేరాలను వెంట ఉంచుకొనేవారు.

                 అలా ప్రపంచమంతా తిరుగుతూ ఫోటోలు తీయడం ద్వారా ఆమె పేరు, ముఖం, ఫోటోలు లక్షల మందికి సుపరిచితమయ్యాయి. భారత్‌, పాకిస్తాన్‌ల విభజనతో పాటు జనం లక్షలాదిగా వలస వెళ్ళిన ఘట్టాన్ని కెమేరాలో చిత్రాలుగా బంధించడానికి 'లైఫ్‌' మ్యాగజైన్‌ ఆమెను ప్రత్యేకంగా నియోగించింది. అలా 1946 నుంచి 1948 వరకు ఆమె భారతదేశం నలుమూలలా పర్యటించారు. ఎంతోమందితో స్నేహ సంబంధాలు నెరపారు. ఆమె రాతలు, ఫోటోలు ఆ కథలను మన కళ్ళకు కడతాయి. ''భారత, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రోడ్లన్నీ శరణార్థుల గుంపులతో క్రిక్కిరిసిపోయాయి. కొత్తగా తలెత్తిన సరిహద్దుల వెంట భవిష్యత్తు తెలియకుండా వారంతా వెళుతున్న దృశ్యాలు బైబిల్‌ కాలాన్ని గుర్తు చేశాయి'' అని రాశారామె.

                        విశేషం ఏమిటంటే, భారతదేశంలో తనకు కలిగిన అనుభవాలనూ, దేశ స్వాతంత్య్రం, విభజన సమయంలో తాను తీసిన ఫోటోలనూ కలిపి 'హాఫ్‌వే టు ఫ్రీడమ్‌: ఎ రిపోర్ట్‌ ఆన్‌ ది న్యూ ఇండియా ఇన్‌ ది వర్డ్స్‌ అండ్‌ ఫోటోగ్రాఫర్స్‌ ఆఫ్‌ మార్గరెట్‌ బూర్క్‌-వైట్‌' పేరిట ఆ రోజుల్లోనే పుస్తక రూపంలో వెలువరించారామె.

                   ఫోటోజర్నలిస్టుగా విస్తృతమైన జీవితానుభవాలున్న మార్గరెట్‌ ఆ అంశాలన్నిటినీ స్పృశిస్తూ, 'పోర్‌ట్రయిట్‌ ఆఫ్‌ మైసెల్ఫ్‌' పేరిట ఆత్మకథ రాశారు. ఆమె మరణానంతరం ఆమెపై జీవిత చరిత్ర గ్రంథం కూడా వచ్చింది. చిత్రం ఏమిటంటే, దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' (1982) చిత్రంలో కూడా మార్గరెట్‌ పాత్ర కనిపిస్తుంది. దాన్ని బట్టి అప్పటి మన చరిత్రలో ఆమెకు ఎంతటి అవిస్మరణీయ పాత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.

               నలభై ఏడేళ్ళ వయస్సులో తనకు పార్కిన్‌సన్స్‌ వ్యాధి వచ్చినట్లు గ్రహించిన ఆమె ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొన్నారు. వ్యాయామం, ధ్యానం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ప్రయత్నించారు. అందు కోసం వివాదాస్పదమైన ఓ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తరువాత మరో ఇరవై ఏళ్ళ పాటు మార్గరెట్‌ చురుగ్గా ఫోటోలు తీస్తూ, ప్రయాణాలు సాగిస్తూ గడిపారు.

                    క్రమంగా పరిస్థితులు కష్టంగా మారినప్పటికీ, జీవితం మీద, చేస్తున్న పని మీద ఆఖరి వరకు ఆసక్తినీ, ఉత్సాహాన్నీ ఆమె కోల్పోవకపోవడం విశేషం. 1971లో ప్రమాదవశాత్తూ కిందపడిన ఆమె కదలలేని పరిస్థితికి చేరుకొని, కన్ను మూశారు. టెలివిజన్‌ ఆవిర్భావంతో ఫోటో జర్నలిజమ్‌లో స్వర్ణయుగానికి తెర పడుతున్న రోజుల్లోనే ఈ అత్యుత్తమ ఫోటో జర్నలిస్టు తుదిశ్వాస విడిచారు.

                   మార్గరెట్‌ చనిపోయిన ఓ ఏడాది తరువాత ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన 'లైఫ్‌' మ్యాగజైన్‌ ఆమె ఫోటోలతో పాపులరైన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలోకి మారిపోవడం విషాదం. వెరసి, ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా ఫోటో జర్నలిస్టుల్లో ఒకరిగా మార్గరెట్‌ ఇవాళ్టి నవ యువ మహిళా ఫోటోగ్రాఫర్లకు నిరంతర స్ఫూర్తిప్రదాత అంటే అతిశయోక్తి కాదు. ఆమె కెమేరాలో బంధించిన దృశ్యాలే అందుకు తిరుగులేని ఉదాహరణ


0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.