శనగపిండి : నాలుగు కప్పులు,
పంచదార : రెండు కప్పులు,
నూనె లేదా వనస్పతి : వేయిండానికి,
జీడిపప్పు : అరకప్పు,
యాలకులపొడి : అరస్పూన్.
తయారు చేసే విధానం :
- శనగపిండిలో నీళ్లుపోసి, బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దాన్ని బూందీగరిటతో నూనె లేదా వనస్పతిలో బూందీలా వేసి వేయించి తీయాలి. చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి.
- మీక్సీలో వేసి పంచదారను పొడి చేసుకోవాలి.
- వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు, యాలకుల పొడి వేసి పాలతోగానీ, నీటితోగానీ తడి చేసుకుంటూ చక్కగా లడ్డూలు చుట్టుకోవాలి. రుచిగా వుంటాయి.