మామిడి తురుము : కప్పు
బంగాళదుంప : ఒకటి
పాలపొడి : అరకప్పు
చక్కర పొడి : కప్పు
వెన్న : రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి : చెంచా
నేతిలో వేయించిన జీడిపప్పు : టేబుల్ స్పూన్
నేతిలో వేయించిన బాదం : టేబుల్ స్పూన్
తయారీ విధానం :
ముందుగా బంగాళదుంపని ఉడికించుకొని చెక్కు తీసేసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో వెన్న కరిగించి మామిడి తురుముని వేసి బాగా వేయించాలి. అందులోని నీరు పోయాక ఉడికించి ముద్దలా చేసుకున్న బంగాళదుంపను వేసి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలయ్యాక చెక్కరపొడి వేయాలి. అది కరిగి పాకంల వచ్చాక పాలపొడి కలుపుకోవాలి. అంత కలిసి మిశ్రమం దగ్గర పడుతున్నపుడు యాలకుల పొడి, జీడిపప్పు, బాదంపలుకులు వేసుకొని ఓసారి కలిపి పొయ్యి కట్టేయాలి. దీన్ని నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకోవాలి. కావాలనుకుంటే బిళ్ళల్లా కూడా కోసుకోవచ్చు. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
మూలం : ఈనాడు దినపత్రిక