ఉసిరికాయలు - 5,
పాలు - 2 కప్పులు,
చక్కెర - అర కప్పు,
బాదం పప్పు - 10,
జీడిపప్పు - 10,
కిస్‌మిస్ - 5,
యాలకుల పొడి - ఒక టీ స్పూన్,
తేనె - చిన్న కప్పు
తయారు చేసే విధానం :
- ఉసిరికాయలను కడిగి.. ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత చిన్న, చిన్నముక్కలుగా కట్ చేసి తేనెలో వేసి గంటపాటు నానబెట్టాలి.
- కొన్ని వేడినీళ్ళల్లో జీడిపప్పు, బాదం పప్పును వేసి నానబెట్టాలి. కాసేపటి తర్వాత వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాలల్లో చక్కెర వేసి వేడిచేయాలి. దీంట్లో బాదం పేస్ట్‌ని వేసి మరగనివ్వాలి.
- పాలు చిక్కగా అయ్యేంతవరకు అలాగే ఉంచాలి.
- ఇప్పుడు తేనెలో నానబెట్టిన ఉసిరికాయ ముక్కలను, యాలకుల పొడిని వేసి సన్నని మంట మీద మరికాసేపు ఉండనివ్వాలి. అంతే.. తియ్య, తియ్యని ఆమ్లా ఖీర్ సిద్ధం!