అన్నం - మూడు కప్పులు;
కొబ్బరి ముక్కలు - కప్పు;
పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి);
ఎండుమిర్చి - 3;
పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు;
జీడిపప్పు - పది పలుకులు;
ఆవాలు - టీ స్పూను;
శనగపప్పు - టీ స్పూను;
మినప్పప్పు - టీ స్పూను;
కరివేపాకు - రెండు రెమ్మల
నూనె - టేబుల్ స్పూను;
ఉప్పు - తగినంత;
నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు.
తయారి:
- కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి
- బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి
- జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి
- కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి అన్నం, ఉప్పు వేసి కలపాలి
- మంట తగ్గించి రెండు నిముషాలు ఉంచి దించేయాలి.