కోవా - 2 కప్పులు
నువ్వులు - ఒకటిన్నర కప్పులు
పంచదార పొడి - రుచికి సరిపడా
కుంకుమ పువ్వు - చిటికెడు
బాదం,పిస్తా - సరిపడా
తయారుచేసే పద్ధతి :
- మందపాటి గిన్నెలో కోవా వేసి తక్కువ మంట మీద లేత బంగారు వర్ణంలోకి మారేవరకు వేయించి దించి చల్లార్చాలి.
- తరువాత విడిగా మరో బాణలిలో నువ్వులు వేసి వేయించి మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి.
- ఈ పొడిని వేయించి ఉంచిన కోవాలో కలపాలి. మిశ్రమం కాస్త వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్న దశలోనే పంచదార పొడి వేసి బాగా కలిపి ఉండలు చుట్టాలి. వీటికి కుంకుమపువ్వు, బాదం, పిస్తా పప్పుల్ని అలంకరించి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం