మైదా పిండి - కప్పు
నూనె - వేయించడానికి సరిపడా
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - పావు టీస్పూన్
పంచదార - కప్పు
బియ్యప్పిండి - 3 టీస్పూన్లు
- మైదా పిండిలో బేకింగ్ పౌడర్, తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
- పంచదారలో సుమారు ముప్పావు కప్పు నీళ్ళు పోసి లేతపాకం రానిచ్చి పక్కన పెట్టుకోవాలి.
- బియ్యప్పిండిలో కరిగించిన నెయ్యి వేసి కలిపి పక్కన ఉంచాలి.
- చపాతీ పిండిని ఉండలుగా చేసుకొని పలుచని రొటీలాగా చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండిని రోటిమీద పరిచినట్లుగా చల్లాలి.
- తరువాత రోటీని చాపలా చుట్టాలి. తరువాత దీన్ని అంగుళం వెడల్పులో ముక్కలుగా కోసి వీటిని వేళ్లతో కొద్దిగా నొక్కాలి. ఇలాగే అన్నీ చేసి నూనెలో వేయించి తీసి పాకంలో వేసి ఓ 20 నిమిషాలు ఉంచ తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం