కొబ్బరి పొడి - 2 కప్పులు
ఖర్జూరం - 1 1/2 కప్పు
జీడిపప్పు - 10
బాదాం పప్పు - 10
కిస్మిస్ - 10
ఈ లడ్డూలు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేసి మళ్లీ తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలిపి ఉండలు చేసుకోవాలి. అంతే..