బొంబాయి రవ్వ-100 గ్రాములు;
చక్కెర - 100 గ్రాములు (తీపి ఎక్కువ కావాలంటే మరో 50 గ్రాములు వేసుకోవచ్చు);
యాలకుల పొడి- పావు టీస్పూన్;
నెయ్యి -3 టేబుల్ స్పూన్స్,
మిఠాయి రంగు: చిటికెడు;
జీడిపప్పు, బాదాం, కిస్మిస్: 10చొప్పున;
నీళ్లు: సరిపడా.
తయారుచేసేవిధానం :
వెడల్పాటి అడుగు మందమున్న గిన్నెను స్టౌపై ఉంచి చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదాం, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టు కోవాలి. అదే గిన్నెలో బొంబాయిరవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించాలి. వేయించిన రవ్వను కూడా విడిగా తీసిపెట్టాలి. ఇప్పుడు గిన్నెలో ఒకటికి మూడొం తుల నీళ్లు పోసి, మరగించాలి. హల్వా బాగా గట్టిగా కావాలంటే నీళ్లు ఒకటికి రెండే పోయవచ్చు. మరిగే నీళ్లల్లో పంచాదార, మిఠాయిరంగు వేసి కలపాలి. పంచదార కరిగాక, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి. చివరిలో మిగిలిన నెయ్యీ వేసి కలిపి, దించేయాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్లతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రవ్వకేసరి రెడీ.