మినపప్పు : అరకిలో
బియ్యం : 2 కప్పులు
పంచదార : కిలో
నెయ్యి : అర కిలో
తయారుచేసే పద్ధతి :
ముందుగా బియ్యాన్ని, మినపప్పును వేర్వేరుగా రెండు గంటల పాటు నానబెట్టి తర్వాత నీళ్ళు లేకుండా వంపేయాలి. తరువాత తడి లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. పలుచగా ఉండకూడదు. ఒక గిన్నెలో పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. కొద్దిగా రంగు (ఎడిబుల్ కలర్స్ అమ్ముతారు) పాలలో కలిపి పాకంలో వేయాలి. వెడల్పాటి పళ్ళెంలో ఒక మంచి వస్త్రంలో కొద్దిపాటి మినపపిండి చొప్పున తీసుకుంటూ గట్టిగా మూటలా కట్టి నేతిలో దోరగా వేయించి తర్వాత పాకంలో వేయాలి. అన్నింటిని ఇలాగే వేసి పాకంలో నానిన తర్వాత తీసి మరోపాత్రలో వేస్తే సరిపోతుంది.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ