కేక్ మిక్స్ - అరకేజీ,
కోడిగుడ్లు - 3,
వెజి ఆయిల్ - పావు కప్పు,
కోకోనట్ క్రీమ్ - 40ఱగా.
కొబ్బరి పాలు - 400మి.లీ.
క్రీమ్ - ఒక కప్పు,
కోకోనట్ ఎక్స్‌వూటాక్ట్ - అర టీ స్పూన్,
చక్కెర - ఒక స్పూన్,
కొబ్బరి తురుము - ఒక కప్పు
తయారు చేసే విధానం :
ఒక గిన్నెలో కేక్ మిక్స్, కోడిగుడ్లు, వెజి ఆయిల్, కోకోనట్ ఎక్స్‌వూటాక్ట్ అన్నీ వేసి బాగా కలపాలి. దీన్ని కేక్ చేసే పాన్‌లో వేయాలి. 30నిమిషాలపాటు ఓవెన్‌లో బేక్ చేయాలి. ఆ తర్వాత బయటకు తీసి కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు కోకోనట్ క్రీమ్, కొబ్బరి పాలు, క్రీమ్, చక్కెర మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో బేక్ చేసిన కేక్‌ని నానబెట్టాలి. దీన్ని ఓ రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. తెల్లారిన తర్వాత తీసి పైనుంచి క్రీమ్, కొబ్బరి తురుముతో అందంగా అలంకరించాలి. చల్ల, చల్లని కోకోనట్ క్రీమ్ కేక్ తయార్!