పాలపొడి-రెండు కప్పులు,
కండెన్సెడ్ పాలు-ఒక డబ్బా,
కుంకుమ పువ్వు-చిటికెడు,
వెన్న-రెండు చెంచాలు,
నెయ్యి-రెండు చెంచాలు.
తయారీ విధానం :
- ఒక చిన్న గిన్నె పాలు వేడిచేసి కుంకుమ పువ్వును నాననివ్వాలి.
- ఒక వెడల్పైన నాన్‌స్టిక్ పాత్ర తీసుకుని కండెన్సెడ్ పాలు, పాల పొడిని ఇడ్లీ పిండి అంత మెత్తని ముద్దగా చేసుకోవాలి. ఉండల్లేకుండా చూసుకోవాలి. దీనికి వెన్న, నెయ్యి కలిపి చిన్న మంట మీద వేడి చెయ్యాలి.
- దీనిలో కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను కలిపి మరగనివ్వాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇది మెత్తటి బంతిలాగా అడుగు అంటకుండా తయారవుతుంది. అప్పుడే దించెయ్యాలి.
- కాస్త చల్లారాక చేతులకు వెన్నగానీ, నెయ్యిగానీ రాసుకుని చపాతీ కర్రకూ నెయ్యి రాయాలి. కావలసిన మందంలో పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత కావలసిన ఆకారంలో కత్తిరించుకోవాలి.