జొన్న పిండి - 150 గ్రా.
బేకింగ్ పౌడర్ - 2 స్పూన్లు
పంచదార పొడి - 70 గ్రా.
అరటి పండ్లు - 3
గుడ్లు - 3
డాల్డా - అరకప్పు
పాలు/పెరుగు - అరకప్పు
వెనిల్లా ఎసెన్స్ - కొద్దిగా
ఉప్పు - పావు స్పూన్
వంట సోడా - కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
జొన్న పిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, వంట సోడా కలపాలి. పంచదార పొడిలో కోడిగుడ్ల సొన, డాల్డా వేసి క్రీమ్ తయారయ్యేలా గిలక్కొట్టాలి. ఇందులోనే జొన్నపిండి మిశ్రమాన్ని చేర్చి బాగా కలపాలి. చివరగా పాలు/పెరుగు, అరటిపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ గిన్నెలో వేసి ఓవెన్ లో అరగంట సేపు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత ముక్కలు చేస్తే చాలు.
మూలం : ప్రజా శక్తి ఆదివారం