
పెసర పప్పు - ముప్పావు కప్పు
సెనగ పప్పు - పావు కప్పు
చిక్కని కొబ్బరి పాలు - కప్పు
పలుచని కొబ్బరి పాలు - కప్పున్నర
బెల్లం తురుము - 2 కప్పులు
యాలకులు - 2
ఎండు ద్రాక్ష - కొద్దిగా
నెయ్యి - టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
- పెసర పప్పు, సెనగ పప్పును విడివిడిగా వేయించాలి. తరువాత సెనగ పప్పులో తగినన్ని నీళ్ళు పోసి 15 నిముషాలు నానబెట్టాలి. తరువాత ఫ్రెషర్ కుక్కర్ లో పెట్టి మూడు లేక నాలుగు విజిల్స్ రానివ్వాలి.
- పెసర పప్పును కూడా విడిగా ఉడకపెట్టి మెత్తగా మెదపాలి. సెనగ పప్పును మాత్రం కాస్త కచ్చాపచ్చాగా మెదపాలి.
- ఒక మందపాటి బాణలిలో బెల్లం, పావు కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టాలి. తరువాత మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇప్పుడు ఉడికించిన పప్పుల మిశ్రమం కలిపి మరిగించాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి చిక్కని కొబ్బరి పాలు పోసి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- ఓ చిన్న బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పాయసంలో కలిపితే పరుప్పు పాయసం రెడీ.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం