బియ్యం - 250 గ్రా.
పాలు - 2 లీటర్లు
కోవా - 200 గ్రా.
మిల్క్ మేడ్ - 400 గ్రా.
బాదం పప్పు - 100 గ్రా.
ఎండు ద్రాక్ష - 50 గ్రా.
జీడిపప్పు - 4
లవంగాలు - 2
చెక్క - కొంచెం
కేసరి రంగు పొడి - చిటికెడు
చక్కెర - 750 గ్రా.
నెయ్యి - 100 గ్రా.
తయారుచేసే పద్ధతి :
బియ్యం, బాదం పప్పులను వేర్వేరుగా రెండు గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టాలి. అనంతరం బాదంపప్పుల తొక్కు తీసి పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాత్రను ఉంచి అందులో నెయ్యి వేయాలి. దీనిలో ఎండు ద్రాక్ష, జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో పాలు పోసి అర గ్లాస్ నీళ్ళను చేర్చి బాగా మరిగించుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. అన్నంలా ఉడికిన తర్వాత చక్కెర కలుపుకోవాలి. తర్వాత బాదం పేస్ట్, మిల్క్ మేడ్, కోవాలు ఒక దాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత యాలకులు, లవంగాలు, చెక్కపొడి, కేసరిరంగు పొడిని కలుపుకొని మరో రెండు నిముషాలు ఉడికించాలి. చివరగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్షలను గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన రైస్ మిట్టా రెడీ..
మూలం : సాక్షి దినపత్రిక