సన్నని సేమియా - ముప్పావు కప్పు
పాలు - ఆరు కప్పులు
పంచదార - రుచికి సరిపడా
నెయ్యి - తగినంత
సన్నగా తరిగిన బాదంపప్పు - ఒక టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన పిస్తాపప్పు - ఒక టేబుల్ స్పూన్
నానబెట్టి తొక్క తీసిన చిరోంజి గింజలు - ఒక టేబుల్ స్పూన్
మెలన్ సీడ్స్ - ఒక టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన ఖర్జూరం - రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - అర టీ స్పూన్
కిస్మిస్ - ఒక టేబుల్ స్పూన్
జాజికాయ పొడి - పావు టీ స్పూన్
యాలకుల పొడి - చిటికెడు
తయారు చేసే విధానం:
- ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి.
- మిగిలిన పాలను బాణలిలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి.
- మరొక పాత్ర (అడుగు భాగం మందంగా ఉండేది) తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కిస్మిస్, బాదం, చిరోంజి, పిస్తా, మెలన్ గింజలను వేయించి పక్కకు పెట్టుకోవాలి.
- మిగిలిన నేతిలో సేమ్యాలను దోరగా వేయించుకొని ఇదివరకు మరింగించి పెట్టుకున్న పాలను పోసి ఉడకనివ్వాలి.
- ఇది ఉడుకుతుండగా కర్జూరం, కుంకుమపువ్వు కలిపిన పాలను పోసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడింకిం చాలి.
- సేమియా బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి, దీనిని వేడిగా అయినా వడ్డించుకోవచ్చు లేదా ఫ్రిజ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు.
మూలం : సూర్య దినపత్రిక