సొరకాయ ముక్కలు - నాలుగు కప్పులు
నెయ్యి - నాలుగు చెంచాలు
చక్కెర - రెండు కప్పులు
కోవా - పావుకేజీ
జీడిపప్పు పలుకులు - కొన్ని
యాలకుల పొడి - చెంచా
తయారుచేసే పద్ధతి :
- సన్నటి మంట మీద బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేడి చేసి సొరకాయ తురుమును వేయించాలి. దాని పచ్చి వాసన పోయి మెత్తగా అయ్యాక చక్కెర వేసేయాలి. అది కరిగి దగ్గర పడే వరకు మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక మిగిలిన నెయ్యి, కోవా, యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి మరోసారి కలిపి దించాలి. దీన్ని నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకోవాలి. అరగంట దాటాక ఇది గట్టిపడుతుంది. ఆ తర్వాత ముక్కల్లా కోసుకొని వేరుచేస్తే సరిపోతుంది. నోరూరించే సొరకాయ బర్ఫీ రెడీ.
మూలం : ఈనాడు వసుంధర