బటర్ - 8 స్పూన్స్,
చక్కెర - పావు కప్పు,
కోడిగుడ్లు - 2,
నారింజపండ్లు - 2,
మైదా పిండి - 1 1/2 కప్పు,
బేకింగ్ పౌడర్ - 1 1/2 టీ స్పూన్స్,
బేకింగ్ సోడా - పావు టీ స్పూన్,
ఉప్పు - పావు టీ స్పూన్,
నారింజ రసం - అర కప్పు
తయారుచేసే విధానం :
- ఓవెన్‌ని 350ఫారన్ హీట్ వద్ద ముందే వేడి చేయాలి.
- నారింజలను ఒలిచి పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో బటర్, చక్కెర వేసి బాగా బీట్ చేయాలి. దీంట్లోనే కోడిగుడ్లు, నారింజపండ్లు, మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తపడాలి. తర్వాత నారింజ రసం పోసి కలుపుకోవాలి.
- ఇప్పుడు కేక్‌పాన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి. 35నిమిషాల పాటు బేక్ చేయాలి. తర్వాత పదినిమిషాలపాటు పాన్‌లోనే ఉంచి చల్లారనివ్వాలి.
- నారింజ ముక్కలతో అందంగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేయాలి.