చిక్కని పాలు - లీటర్
పంచదార - కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు,బాదం, పిస్తా - ముప్పావు కప్పు
బటర్ స్కాచ్ సిరప్ - 3 టేబుల్ స్పూన్లు
అక్రోటు ముక్కలు - టేబుల్ స్పూన్
పటిక పొడి - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
- మందపాటి బాణలిలో నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా వేయించి పెట్టుకోవాలి.
- పాలు మరిగించాలి. మధ్యలో చిటికెడు పటిక పొడి వేస్తూ కలుపుతూ మరిగించాలి. సగమయ్యాక పంచదార వేసి కలపాలి. తరువాత బటర్ స్కాచ్ సిరప్ కూడా వేసి మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ మీద నుండి దించాలి.
- ఓ రెండు నిమిషాలయ్యాక బాదం ముక్కల మిశ్రమం, అక్రోటు ముక్కలు వేసి నెయ్యి రాసిన ప్లేటులో పరచాలి. ఆరిన తర్వాత ముక్కలుగా కోయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం