పైనాపిల్ గుజ్జు - ఒక కప్పు,
పంచదార - అరకప్పు,
పాలు - రెండు టేబుల్స్పూన్లు,
మైదా, నెయ్యి - ఒక్కో టీస్పూన్.
తయరుచేసే పద్ధతి :
పైనాపిల్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. మందపాటి కళాయిలో దాన్ని వేసి ఉడికించాలి. తరువాత మంట తగ్గించి పంచదార వేయాలి. పాలలో మైదా కలిపి ఉడుకుతున్న గుజ్జులో పోసి కాసేపు ఉడికించాలి. నెయ్యి వేసి బాగా కలిపి మిశ్రమం చిక్కగా అయ్యాక స్టవ్ పైనుంచి గిన్నె దింపేయాలి.