బీట్ రూట్ - అరకిలో (తురమాలి)
పాలు - అర లీటర్
కోవా - 100 గ్రా.
పంచదార - రుచికి సరిపడా
గసగసాలు - 2 టీస్పూన్లు
పిస్తా, బాదం - తగినన్ని
- స్టవ్ మీద పాన్ పెట్టి పాలు, బీట్ రూట్ తురుము వేసి కలుపుతూ ఉడికించాలి. బీట్ రూట్ పచ్చి వాసనా పోయేదాకా, పాలు అన్నీ ఆవిరై పోయేదాకా ఉడికించి కోవా, పంచదార వేసి ఉడికించాలి.
- పంచదార కరిగిపోయి హల్వాలో కలిసిపోయిన తర్వాత గసగసాలు కూడా వేస్ కలపాలి. చివరగా ఇష్టమైతే కాస్త నెయ్యి, పిస్తా, బాదం పప్పులు వేసి కలిపి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం