గోధుమ రవ్వ - ఒక కప్పు
స్వీట్ కార్న్ - ఒక కప్పు
పాలు - ఒక లీటర్
చక్కెర - 200 గ్రా.
నెయ్యి - అరకప్పు
బాదం, పిస్తాలు - పది
జీడిపప్పు - పది
యాలకుల పొడి - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
గోధుమ రవ్వను నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. బాదం పిస్తాలను గంటసేపు నీటిలో నానబెట్టి తీసి తడి లేకుండా తుడిచి వేయించాక సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో పాలు మరుగుతుండగా గోధుమ రవ్వ, చక్కెర, స్వీట్ కార్న్ వేసి పది నిమిషాల పాటు ఉడికించి అందులో తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకులు, నెయ్యి కలిపి దించితే సరి. రుచికరమైన 'గోధుమ రవ్వ పాయసం' తయార్ !
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం