బియ్యం : రెండు కప్పులు
బెల్లం తురుము : రెండు కప్పులు
యాలకుల పొడి : పావు చెంచాడు
నెయ్యి : చెంచాడు
బియ్యం పిండి : రెండు చెంచాలు
నువ్వులు : ఒక కప్పు
ఎండు కొబ్బరి తురుము : కొద్దిగా
పాలు : నాలుగు గ్లాసులు
డ్రై ఫ్రూట్స్ : తగినన్ని
తయారుచేసే పద్ధతి :
ముందుగా నువ్వులకు కొన్ని నీళ్ళు చల్లి చేతితో బాగా రుద్ది తర్వాత బియ్యం పిండి కూడా వేసి బాగా రుద్ది చెరగాలి. పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బియ్యంలో నాలుగు కప్పుల నీళ్ళు, ఒక కప్పు పాలు, నెయ్యి వేసి కుక్కర్ లో పెట్టి మెత్తగా అన్నములాగా ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ లో విజిల్ వచ్చాక మూత తీసి మిగతా అన్ని పదార్థాలను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత నువ్వుల పొడి, డ్రైఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి. బెల్లం కరిగాక దించాలి. అంతే ! కమ్మని 'పులుగం' రెడీ! ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం