మైదా - 2 1/2 కప్పులు
పాలు - 1 కప్పు
వెన్న - 1/4 కప్పు
వంట సోడా - చిటికెడు
బేకింగ్ పౌడర్ - 3/4 టీ.స్పూ.
బెల్లం తురుము - 2 కప్పులు
యాలకుల పొడి - 1 టీ.స్పూ.
నూనె - వేయించడానికి
చేయండి ఇలా
పాలు వేడి చేసి పంచదార, వెన్న వేసి కలిపి చల్లారనివ్వాలి. మైదా, వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. ఇందులో పాలు వేసి కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని బాగా మర్దనా చేసి చిన్న ఉండలు చేసుకుని కాస్త మందంగా, వెడల్పుగా (చిన్న పూరీల్లా) వత్తుకోవాలి. లేదా పెద్దగా చపాతీలా వత్తుకుని ఏదైనా మూతతో కట్ చేసుకోవచ్చు. మరో చిన్న మూతతో మధ్యలో వత్తుకుని ఆ భాగం తీసేయాలి. ఇది ఒక రింగులా ఉంటుంది.
బెల్లం తురుములో అరకప్పుడు నీళ్లు పోసి ముదురు పాకం చేసుకుని యాలకుల పొడి కలిపి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి వీటిని మధ్యస్థమైన వేడితో రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి గోరువెచ్చగా ఉన్న బెల్లం పాకంలో వేసి ఐదు నిమిషాలుంచి తీసేయాలి. అన్నివైపులా పాకం అంటిన తర్వాత తీసి ప్లేటులో పెట్టి ఆరనివ్వాలి.