తెల్ల నువ్వులు - 2 కప్పులు
బెల్లం తురుము - 2 కప్పులు
యాలకుల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
జాజిపువ్వు పొడి - పావుటీస్పూన్
మైదా పిండి - ఒకటిన్నర కప్పులు
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- మైదా పిండిలో ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి, పూరీ పిండిలా కలిపి తడి బట్ట కప్పి ఉంచాలి.
- బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
- నువ్వులు చల్లారిన తరువాత బెల్లం తురుము వేసి రెండూ కలిపి మిక్సీ లో వేసి మెత్తగా చేయాలి. లేదా రోట్లో దంచినా మంచిదే.
- తరువాత యాలకుల పొడి, జాజిపువ్వు పొడి కూడా కలిపి ఉంచాలి.
- మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్లు మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకొని నూనె లేదా నెయ్యి వేస్తూ పెనం మీద కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం