క్యారెట్ తురుము - రెండున్నర కప్పులు
మైదా - 2 కప్పులు
దాల్చిన చెక్క పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీస్పూన్లు
బేకింగ్ సోడా - టీస్పూన్
ఉప్పు - అరటీస్పూన్
కోడి గుడ్లు - 4
పంచదార - ఒకటిన్నర కప్పులు
వెనీలా ఎక్స్ ట్రాక్ట్ - 2 టీస్పూన్లు
నూనె - కప్పు
తయారుచేసే పద్ధతి:
- మైదాలో దాల్చిన చెక్కపొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి.
- విడిగా ఓ గిన్నెలో కోడి గుడ్లు వేసి రెండు నిముషాలు గిలక్కొట్టాలి. తరువాత పంచదార వేసి మరో ఐదు నిముషాలు గిలక్కొట్టాలి. ఇప్పుడు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి మరో నిమిషం బీట్ చేయాలి. తరువాత నెమ్మదిగా నూనె వేస్తూ గిలక్కొడుతూ ఉండాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ తెడ్డు లాంటి గరిటెతో కలుపుతూ ఉండాలి. చివరగా క్యారెట్ తురుము వేసి కలపాలి.
- ఇప్పుడు మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి వెన్న రాసిన రెండు కేకు గిన్నెల్లో వేసి ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేసిన ఓవెన్ లో 30 నిముషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం