ఓట్స్ - 250గ్రాములు,
చక్కెర -2 టేబుల్‌స్పూన్స్
ఆవిల్ -1
తేనె 50గ్రాములు
కాజు-బాదంపలుకులు 25 గ్రాములు,
పాలు - 1/2 లీటరు
నెయ్యి 1టేబుల్ స్పూన్
ఇలాయిచి పొడి - చిటికెడు
తయారు చేసే విధానం:
- ముందుగా ఓట్స్ నెయ్యివేసి వేయించి ఫ్రై చేసి, మిక్సిలో వేసి పొడిచేసుకోవాలి.
- స్టవ్ మీద పాత్ర పెట్టి పాలు బాగా మరగ నివ్వాలి. అందులో ఈ ఓట్స్ మిశ్రమం వేసి తిప్పుతూ ఆవిల్ కడిగి ముక్కలు చేసుకుని అందులో కలపాలి. ఇవి కూడ బాగ కలియ తిప్పుతూ చక్కెర, తేనే వేసి చివర్న బాదామ్ - జీడి పలుకులు వేసి దించాలి.ఇలాయిచిపొడి వేసి కలియ తివ్పి కొద్దిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి. వెరైటీగా రుచిగా ఉంటుందీ ఖీర్. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
మూలం : సూర్య దినపత్రిక