బొప్పాయి పండు ముక్కలు - ఒక కప్పు,
పంచదార - మూడు టేబుల్ స్పూన్లు,
పాలు - 50 మిల్లిలీటర్లు,
నెయ్యి - ఒక టీస్పూన్,
జీడిపప్పులు - నాలుగు.
తయారుచేసే పద్ధతి :
- బొప్పాయి ముక్కల్ని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి.
- కళాయిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పులు వేగించి పక్కన పెట్టాలి. తరువాత అందులోనే బొప్పాయి గుజ్జు వేసి వేగించాలి.
- గుజ్జు ఎరుపు రంగుకు రాగానే పంచదార వేసి బాగా కలిపి పాలు పోసి మంట పెంచి ఉడికించాలి. మధ్యమధ్యలో కదుపుతుండాలి.
- మిశ్రమం చిక్కపడగానే స్టవ్ మీద నుంచి కళాయి దింపి జీడిపప్పుతో అలంకరించి తినేయడమే.