ఉప్మా రవ్వ - 1 కప్పు
పంచదార - 3/4 కప్పు
గుమ్మడికాయ తురుము - 3/4 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
యాలకుల పొడి - 1 టీ.స్పూ.
ఎల్లో కలర్ - చిటికెడు
జీడిపప్పు - 10-15 (అలంకరణకు)
తయారు చేసేదిలా
- పాన్‌లో రెంచు చెంచాల నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించుకోవాలి.
- ఒక గినె్నలో మూడు కప్పుల నీరు మరిగించి గుమ్మడికాయ తురుము వేసి చిన్న మంటమీద ఉడికించాలి. గుమ్మడికాయ బాగా ఉడికిన తర్వాత గరిటతో మెదపాలి. (గుమ్మడి ముక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి కూడా వాడుకోవచ్చు).
- ఇందులో వేయించిన రవ్వ మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా వేగంగా కలుపుతూ ఉండాలి.
- తర్వాత పంచదార, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. మొత్తం మిశ్రమం ఉడికి దగ్గర పడ్డ తర్వాత నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరిచి జీడిపప్పుతో అలంకరించాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.