అటుకులు-అర కప్పు,
పాలు-రెండు కప్పులు,
బెల్లం-అరకప్పు,
నెయ్యి-రెండు చెంచాలు,
యాలకుల పొడి-చిటికెడు,
జీడిపప్పులు-ఐదు లేదా పది
తయారీ :
ఒక మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పులను దోరగా వేగించుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ మూకుడులోనే అటుకులు వేసి దోరగా వేగించుకోవాలి. వీటిని ఆరనిచ్చి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాలి. (ఇష్టం లేనివారు మిక్సీలో తిప్పనవసరం లేదు) ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి మరగనివ్వాలి, దానికి అటుకులు కలపాలి. అరగంటసేపు ఉడికిన తర్వాత చల్లారాక, బెల్లం తురుము కలపాలి. (బెల్లం వద్దనుకుంటే పంచదార కలుపుకోవచ్చు, ఏదైనా పాలు వేడిగా ఉండగా కలపకూడదు. కలిపాక పాయసాన్ని వేడిచెయ్యకూడదు) యాలకుల పొడి, వేగించిన జీడిపప్పు పైన చల్లాలి.